పుట:Sahityabashagate022780mbp.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

63 తక్కిన అన్యదేశ్యాలకు ఇంత ఆత్మీయత తెలుగుతో ఏర్పడలేదు. అవి నామకులైనా, ధాతువులైనా, ఆగు, చేయు, ఇచ్చు మొదలగు సహాయ ధాతువుల చేర్పుతో మాత్రమే తెలుగులో చెల్లుతాయి. ప్రోపోజుచేయు, ప్యాస్ అగు, ప్రొమోషను ఇచ్చు- ఈ విధంగానే వాడబడతాయి. తురుష్కేతర పదాలకు కూడా ఇంచుగాగమం చేసి తెలుగులో ప్రయోగించడానికి కొందరు ప్రయత్నం చేశారుకాని ఆ ఉద్యమం జయప్రదం కాలేదు. ప్రోపోజించు మొదలైన వ్యవహారం తెలుగులో కుదరలేదు. తెలుగులో ప్రవేశించిన అన్యదేశ్యాలను గురించి పరిశోధకులు కృషిచేస్తున్నారు. శుకసప్తతి, హంసవింశతివంటి కధాకావ్యల్లో వాణిజ్య సంబంధమైన అన్య దేశాలు కనబడతాయి. దిట్టకవి నారాయణకవి రచించిన రంగరాయ చరిత్రలో (బొబ్బిలియుద్ధ వృత్తాంతము) ఫ్రెంచి సైనికపదాలు వాడడం జరిగింది. డాక్టరు కొత్తపల్లి వీరభద్రరావుగారి సిద్ధాంతవ్యాసగ్రంధంలో (the influence of Englishi on Telugu) పోర్చుగీసు, డచ్చిభాషాపదాలు సేకరింపబడ్డాయి. ఆంగ్లపద్యప్రయోగం మనకు ఇప్పటికీ పరిచితమే. ఇది మన నిత్యజీవితాన్ని, సాహిత్యాన్ని, విజ్ఞానాన్ని అన్ని రంగాలను గాఢంగా స్పృశించింది.

   16-18 శతాబ్దాలు - సాహిత్య భాష కొంచెం వెనుకకు మరలి ఈ మూడు శతాబ్దాలల్లో సాహిత్యబాష పొందిన పరిణామాన్ని పరిశీలిద్దాము.  విజయనగర యుగంలో కృష్ణదేవరాయలు, అల్లసానిపెద్దన అలంకరించిన సాహిత్యసింహాసనాన్ని తంజావూరు యుగంలో రఘునాధ భూపాలుడు, చేమకూర వేంకటకవి అలంకరిస్తున్నారు.  రఘునాధరాయలు చేసిన వివిధ రచనల్లో ప్రసిద్ధమైనది వాల్మీకి చరిత్రము.  చేమకూర వెంకటకవి విజయ విలాసము, సారంగధర చరిత్ర సాహిత్యపరులందరి మన్నలనూ పొందాయి. ఇదివరలో మేము చెప్పినట్లు ఆంధ్రసాహిత్య వాహిని తంజావూరుయుగం నాటికి ప్రబంధ పర్వత శిఖరాలనుండి సమతులంమీదికి దిగి జనులకు ఉపాసనాయోగ్యమయింది.  ఉన్నత సంస్కృత శైలి సడలింది.  తెలుగుమార్ధవాన్ని, భావ ప్రకటన సామర్ధ్యాన్ని, చమత్కార శెలతను కవులు అనుభవంలోకి తేవడానికి పూనుకున్నారు.  జానుతెనుగు అని శివకవులు పూర్వం భావించిన దానికే ఈనాడు కవులు ఆ పేరు పెట్టకుండా చిలుకుతున్నారు.  కవిత్వము వినగానే రసానందం కలిగించలనీ, అరిమళాలు గుభాళించాలని రఘునాధనాయకుడు వాల్మీకి చరిత్రలో అన్నాడు.

     చెప్పవలె గప్పురములు
        క్లుప్పలుగా బోసినట్లు, కుంకుమపైపై