పుట:Sahityabashagate022780mbp.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

62

హరించిన విషయం చరిత్ర ప్రసిద్ధమా, ఆంగ్లేయులు 1347 వరకూ ఈ దేశపరిపాల కులుగాను ఇప్పుడు మిత్రదేశీయులుగాను ఉన్నారు. ఈ సందర్భంలో మరొక్క భావనుకూడా, తెలుగునకు కొన్నిపదాలు ఎరువు ఇచ్చిన దానిని స్మరించవచ్చును. అది మహారాష్ట్ర భాష. మనకు ఉత్తరాన పొరుగురాష్ట్రంతో కాకతీయుల కాలాన్నుంచి కొంత సంబందం ఉంది. కాకతీయులకు సామంతులై మహారాష్త్రనాయకులు కొందరు అద్దంకి ప్రాంతంలోను, తెలంగాణాలో నల్లగొండ ప్రాంతంలోను పరిపాలన చేసేవారు. ఇంతకన్న ముఖ్యమైన సంబంధం తంజావూరు రాజ్యూన్ని మహారాష్ట్రులు ఏకోజీ మున్నగువారు పాలించినప్పుడు ఏర్పడింది. తంజావూరులో చెవ్నప్ప వంశీయులైన తెలుగు వారు క్రీ.శ.1674 దాకా పరిపాలన చేశారు. రఘునాధనాయకుడు, విజయరాఘవనాయకుడు ఈ వంశం వారే. తెలుగు నాయక వంశం అంతమొందిన తరువాత మహారాష్త్రలు తంజావూరు రాజ్యాన్ని ఆక్రమించుకొని సుమారు ఒక శరాబ్దం ఏలుబది సాగించారు. వీరి భాష మహారాష్త్ర భాష అయినప్పటికీ తంజావూరు మరాఠా రాజులు ఆంధ్ర భాషా సంపదకు ముగ్ధులై తాముకూద తెలుగును ప్రేమించి తెలుగులో యక్షగానాలు మొదలైన రచనలు చేశారు. ఈ విధంగా కొన్ని మహారాష్ట్ర శబ్దాలు తెలుగులో ప్రవేశించడానికి మార్గం ఏర్పడింది. నిజాము నవాబుల కాలంలో తెలంగాణమునందు మహారాష్ట్రుల ప్రాబల్యం అధికంగానే ఉండేది. మహారాష్ట్రులు ఉన్నతోద్యోగాల్లో నియక్తులయేవారు. వారికి పూనా పీష్వాల దర్బారు నుండి రాజకీయ బలం చేకూరేది. ఈ విధంగా కూడా మహారాష్ట్ర ఆచారాలు, సంప్రదాయాలు, భాషాపదాలు తెలుగును కొంత ప్రభావితం చేశాయి.

  ఇదంతా ఒకనాటిలో జరిగిన పరిణామం కాదు.  మూడు శతాభ్దుల కాలంలో అనగా 16,17, 18 శతాబ్దుల్లో పెక్కు అన్యభాషా ఉపనదులు వచ్చి ఆంధ్రభాషా మహానదిలో సంగమించి దానిలో అంతర్లీనమై పోయాయి. వీటిల్లో మేలైన శబ్దాలు కొన్ని సాహిత్యంలోకి కూడా ప్రవేశించాయి.  సాధారణంగా ఇవి వెదేశాలనుంచి దిగుమతి అయిన భోగ్యవస్తుల పేర్లు రూపంలోను, పడవలు, యుద్ద్ఝసాధనాలు, సైనికోద్యోగుల హోదాలు మొదలగునవిగా కనబడతాయి.  శాసనాల్లో తురుష్కభాషా పదాలు విస్తారంగా వస్తాయి.  తెలుగులో ప్రవేశించిన అన్యదేశాల్లో తురుష్కపదాలే హచ్చుగా ఉంటాయి.  ఇవి దేశీయులకు బాగా అలవాటు పడిపోవడంచేత ఈ శబ్దాలు కొన్ని ధాతురూపాలుగా వాడుకలోనికి వచ్చాయి.  పిలాయించు, దుకాయించు, బనాయించు, రపుడాయించు ఇత్యాదిగా ధాతు వ్యవహారం కూడా తెలంగాణాలో బాగా వినబడుతుంది.