పుట:Sahityabashagate022780mbp.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ప్రబంధయుగము - సాహిత్యభాష

ఉద్దండ సంస్కృత విద్వాంసుడయినప్పటికీ శ్రీనాధుడు తోచినచోట తెలుగు నుడికారము పుణికిపుచ్చుకొన్నట్లు వ్రాయగలడు. సంభాషణశైలి ఈతనిది మిక్కిలి సహజంగాఉంటుంది. కాశీఖండం చతుర్ధాశ్వాసంలో గుణనిధి కధయందు యజ్ఞదత్తుడు భార్యతో పలుకుట “యజ్ఞదత్తుం డర్ధముండితంబైన మార్గంబున నీర్కావిధోవతి నఱిముఱిజుట్టుకొని యింటికేతెంచి మొగంబుగంటువెట్టుకొని సోమిదమ్మ: ఏమిచేయుచున్నదానవు: ఇటురమ్ము, నీకొడుకెక్కడంబోయె, పోవుగాకేమి, వినుమని యిట్లనియె“

        ప్రబంధయుగము - సాహిత్యభాష
  కవుల భావములనుబట్టి, లక్ష్యాలనుబట్టి సాహిత్య భాష మారుతూండడం కడు సహజమైనది. నన్నయాదుల సాహిత్య లక్ష్యాలు కాలంగడిచిన కొద్దీ మస్రుతూవచ్చాయి. సంఘజీవితమే క్రొత్తరూపుధరించింది. నన్నయ తిక్కనల నాటి వేగిదేశము కాని, పాకనాడు గాని ఈప్పుడులేవు.’అనఘమై, శిష్టాగ్రహార భూయిష్టమై, ధరణీ సురోత్తమాధ్వర విధాన సమృద్దమైన ‘ పుణ్యదేశములుకావు అని ఇప్పుడు, దేశం చాలాభాగం ముసల్మానుల యేలుబడిలోకి వచ్చింది. వైదిక ధర్మానికి ఎట్టిదుర్గతి పట్టిందో ముసునూరి ప్రోలయనాయకుని విలస తామ్రశాసనము, అతనితల్లి కలువచేరుశాసనమివంటి వాని వలన తెలుస్తుంది. తుంగభద్రకు దక్షిణాన ఇంకావేదాది విద్యలు విజయనగర సామ్రాజ్యంలో తలదాచుకుని ఉన్నాయి. ప్రభువుల యొక్కయు ప్రజలయొక్కయు చిత్తవృత్తులు, వేషభాషాదులు, అభిరుచులు మారిపోయాయి. భొగపరాయణత్వం తలయెత్తింది. పెద్దపెద్ద రాజ్యాలవడంచేత రాజులకూ ప్రజలకూ నడుమ ప్రత్యక్షసంబందం తగ్గిందు. ప్రజాభ్యుదయ దృష్టి కొంత సడలింది. ప్రజలను వెంటతీసుకువెళ్ళే పరిస్థితులిప్పుడులేవు. రాజధానీనగరానికి, రాజాంత:పురానికి ప్రాధాన్యం అపారమైంది. నగరము అభిరుచులే పల్లెలకు మార్గదర్శకములు.
    ఇటువంటి సాంఘిక రాజకీయ పరిస్థితుల్లో కవులు గంటంపట్టి వ్రాస్తున్నారు. వారు మహారాజులు, సంపన్నులైన సామంతుల కోసం వ్రాయాలి. వారి అనుగ్రహం కలిగితే అగ్రహార, ఆందోళికాచ్చత్ర చామరాదులు లభిస్తాయి. లేకపోతే నిప్పచ్చరమైన పేదరికం అనుభవించాలి. రాజసభాంతరాళములందలి విద్వాంసులే కావ్యశ్రోతలు. వాటి గుణదోషనిర్ణేతలు. ఆస్థానపండితులు కాదంటే సాక్షాత్తు ఈశ్వరుడు వ్రాసిన పద్యానికైనా రాజసన్మానం దొరకదు.