పుట:Sahityabashagate022780mbp.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉంటుంది. హరవిలాసం శివకవి సంప్రదాయాలకు దగ్గరగా ఉండి దేశీయతాముద్ర ఎక్కువ కలిగి ఉంటుంది.

  శ్రీనాధుని కాలానికి ఆంధ్రదేశంలో ముసల్మానులు ప్రమేయం అధికమయింది. కాకతీయ సామ్రాజ్యం అస్తమింది ఇంచుమించు ఒక శతాబ్దం కావచ్చింది.  దాని స్థానంలో ఏర్పడిన ప్రాగాంద్రమునందలి రెడ్దిరాజ్యము పశ్చిమాంధ్రమునందలి పద్మనాయక రాజ్యము బహమనీ సుల్తానులతో ఒకప్పుడు మైత్రి ఒకప్పుడు వైరమూ వహించేవి.  వారియాస్థానమునకు నీరును, వీరి సభాంతరములకు వారును వచ్చిపోవుట జరిగేది. ఈ విధంగా రాకపోకలచే సాంఘిక సంబంధాలుకూడా ఏర్పడ్డాయి ' ఒకరి భాషలు ఒకరు నేర్వవలసివచ్చేది.  శృంగారనైషధ కృతిపతియు పెద్దకోమటివేమారెడ్డి మంత్రియు ఐన మామిడి సింగనామాత్యుడు తురుష్కభాషలు కొంత నేర్చినాడు.  బహమనీవారి సభాంగణంలో ఆయన పారసీ భాషలోనే ప్రసంగించి యుండవచ్చును,  కావుననే 'యవనాధీశసభా నిరంకుశవచోవ్యాపారపారాయణా ' అని ఈ మంత్రిసత్తముడు సంబోదింపబడ్డాడు. రాజమహేంద్రవర రెడ్డి రాజ్యపు అమాత్యుడైన బెండపూడి అన్నమంత్రి బహుభాషావేత్త. ఈయనకు అరబీభాష, పారసీ, ఓడ్రము, కర్ణాట భాష మొదలైన పెక్కుభాషలు చక్కగా వచ్చును.  వాటిని వ్రాయడం చదవడం ఆయనకు బాగా పట్టుబడ్డాయి.  రాజకీయ సంబంధాల మూలంగా హిందువులకు ముసల్మానులకు ఆచార వ్యవహారాల్లోను భాషాపద్దతుల్లోను కొంత అదాన ప్రదానం జరగడం ప్రారంబించింది.  శ్రీనాధుడు, శుద్ధశైవుడూ, వైష్ఠికుడైననూ వ్యవయారజ్ఞానం కలవాడు.,  సమయానుకూలంగా వేషం మార్చగలవాడు.  విజయనగర ఆస్థానానికి వెళ్ళినప్పుడు శుద్ధశోత్రియ వేషంమార్చి దర్భారీవేషం ధరించినట్లు తుల్లాయుంచితి, కోకచుట్టితి, మహాకూర్పాసమున్ దౌడ్గితిన్ ' అనే చాటువులో చెప్పుకొన్నాడు.  ఆంధ్రభాష తురుష్కభాషలూ కొన్ని పదాలు ఇచ్చిపుచ్చుకోవడం కూడా ప్రారంభమయింది. అన్యదేశ్యాలు తెలుగులోకి రావడానికి ఇది అరుణోదయ సమయము. బ్రాహ్మీ దత్త వరప్రసాదుడైనా శ్రీనాధుడు పరివర్తన సహమైన సంస్కారం కలవాడు.  అతనికి నచ్చిన మ్లేచ్చపదాల్ని మిక్కిలి సహజంగా తెలుగు పద్యాల్లో పొదిగి సంస్కృతీ సమంవయానికి బీజాలువేశాడు.  హరవిలాసంలో బహమనీరాజు ఫిరోజుషాను గురించి ప్రసంగంరాగా, "ఖుసిమీరన్ సురధాణి నిండుకొలువై కూర్చొన్నచో" అని ఖుషి సంతోషము అనే శబ్దాన్ని ఒడుపుగా వాడుకొన్నాడు.  ఈ యాదానప్రధాన పదతి ఉత్తరోత్తరా చాలా బలపడింది.