పుట:Sahityabashagate022780mbp.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

56

      "ఈ రాజన్య్హుని మీద నే గవిత సాహిత్య స్పురనాధిడీ,  చారుప్రౌధిమ చెప్పి పంప విని మాతృర్యంబు వాటించి నత్కీరుం డూరకె తప్పుపట్టెనటయేదీ యలం కారంతో పదబంధమో రసమె చక్కంజెప్పుడా తప్పనన్ అని దూర్జటి కవీందుడు పరమశివునిచేత రాజుసభలో ఫిర్యాదు చేయించాడు.  పింగళి సూరనార్యుడు కూడా కళాపూర్ణోదయంలో ఇటువంతి సన్నివేశాన్నే కల్పించాడు.  ఈ కారణం చేత కవులు ఒకరిని మించి ఒకదు వైదుష్యం ప్రదర్శించడానికి, చమత్కారిత్వం చూపడానికి తాపత్రయపడేవారు.  ఈ ప్రయత్నంలో సాహిత్య భాష ఉన్నతోన్నత శిఖరాలని అధిరోహించి, కొంత కృతకము, సామాన్యులకు దుర్గ్రాహ్యముగా పరిణమించింది.   పూర్వ యుగాల్లో మృదు, కఠిన, కఠినతర భాషా శ్రేణులుండేవి.  ఇప్పుడు కఠిన, కఠినతర శ్రేణులు రెండేమిగిలాయి.  సంభాషకూడా ప్రధానమైన కవిత్వంలో కొంతమార్ధనం, జాతీయత, సామెతలు తప్పవు. ప్రబంధకవిత్వం విస్తారంగా వర్ణవాత్యకంగా ఉండడం చేత శైలిని మృగువు పరచవలసిన అవశ్యకత తగ్గింది.  కవిదారి కవిది.  పాఠకుని దారి పాఠకునిది.
    సాహిత్య లక్ష్యమేమిటి అనే విషయంలోకూడా కవుల్లో పెద్ద మార్పు వచ్చింది.  జగద్దితము, జన్మాంతర దు:ఖరాహిత్యం ఉ అనే లక్ష్యాలు సడలి పోయాయి.  శ్రీ కైవల్య పదంబు చేరుటనై చింతించెదన్ అనే ప్రయత్నము వెనుక పట్టింది.  అపూర్వ బావాలతోను అద్బుత సమాస ఘటనలతోనొ సభను దద్దరిల్ల చేయడమే కవి కోరుకొనేది.  దానివలన రాజసన్మానం లభిస్తుంది.  ధర్మబుద్ధి తగ్గక పోయినను దనిపై అంతనిష్ట లేదు.  కావ్యము ఉపదేశమియ్యవలెనను దృష్టిసన్న గిల్లింది.  అల్లసాని పెద్దనాగారు దిద్ది తీర్చిన ప్రవరుడు, శ్రీ కృష్ణదేవరాయలవారు వర్ణించిన విష్ణుచిత్తుడు వంటివారు బొత్తిగా లేకపోలేదు.  వేదాంతము, రాజనీతి ప్రసంగాలు ఆముక్తమాల్యద లోనే వినవస్తున్నాయి.  కృతికర్తలయు, కృతిభర్తలయు దృష్టి. శృంగారము వివిక్తముగా నుండదగినదే కాని బట్టబయలు చేయదగినది కాదు.  ఈ కారణంచేతకూడా భాష గోప్యంగాను వ్యక్తోక్తిప్రాచుర్యం గాను ఉండవలసిన అవశ్యకత ఏర్పడినది.  అలంకారాల్లో ఉత్ప్రేక్ష, అతిశయోక్తి, శబ్దేచిత్రాలు కవులకు శ్రోతలకు ఎక్కువగా రుచించినాయి.   ఈ యుగ నాయకులని చెపదగిన అల్లసాని పెద్దన, శ్రీకృష్ణరాయలు వీరిద్దరియందును ఈ లక్షణాలు చూదనగును.  వీరిలో ఒకరిపై ఇంకొకరికి అపారమైన గౌరవ ప్రేమలు, వీరిద్దరు ఒక నాణెముయొక్క రెందువైపులుగా కనిపిస్తారు.  ఒకరిది మింటిచూపు, మరొకరిది