పుట:Sahityabashagate022780mbp.pdf/53

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


47 ఉందనే రహస్యం తిక్కన గ్రహించాడు. నన్నయ 'ఆంధ్ర కవిత్వ విశారదుడు, విద్యాదయుతుడు, మహితాత్ముడు ' అని మిత గంబీరంగా ప్రశంసించారు. కవిత్వ పధంలో తిక్కన సోమయాజిని మెప్పించడం దుస్సాహసం అన్నాడు కేతన కవి.

  'కవిత జెప్పి యుభయ కవి మిత్రు మెప్పించు టరిదిల్ బ్రహ్మమైన ' అని బెరుకుగా అన్నాడు. అటువంటి ఉభయ కవి మిత్రుడు మహాభారతాన్ని నన్నయభట్టు దక్షతతో వ్రాశాడని తలయూపడము ఏతన్మాత్రస్తుతికాదు. మహా భారత రచనా సందర్శమున తిక్కన సోమయాజి ఎటువంటి భాషా నియమాలు ప్రకటించ లేదు. అసలు లేవని కాదు. వాటిని ఇదమిత్దమని ప్రకటించకుండా వ్యంగ్యంగా సహృదయులకే వదలి వేశాడు. భారతము నందు కుకవి నిరాసము కూడ చేయలేదు. రెండు పద్యాల్లో మాత్రం తన ధ్యేయాన్ని ముక్తసరుగ చెప్పాడు. 'తుదిఘట్టన్ రచియించు టొప్ప బుధసంతోషములు నిండారగన్ ' (విరాట-1-7) అనిన్నీ, 'భారతామృతము గర్జపు టంబులనారగ్రోలి యాంద్రావలి మోదముంబొరయ ' (విరాట-1-30) అనిన్నీ మాత్రమే పలికాడు. బదులు సంతోషించాలి జనసామాన్యం దేశం నాలుగు మూలల వారు సంతోషించాలి. తనకు 'జన్మాంతర దు:ఖములో దొంగునట్లుగ ' (విరాట-1-12) మరియొక ఉదాత్త లక్ష్యము వీనికి తగ్గ బాష సంస్కృతాంధ్రముల వివేకయుతమైన సమ్మేళనంఉ, అట్లే దేశ మార్గముల సంయోజనము అని ఆయన నిశ్చయించుకొని రచన సాగించాడు. మరి శివకవుల జాను తెనుగు - దేశిలక్ష్యము మాటేమిటో. వీటి విషయంలో తిక్కన సోమయాజి దృష్టి ఎటువంటిది అని ప్రశ్నిస్తే, ఆ పదముల పేరు ఎత్తకుండానే వాటి తత్వాన్ని తన కవిత్వంలో ఇమిడించాడు. రమమును రసశబ్దంతో చెప్పకూడదట. ఇది శృంగార రసము. ఇది కరుణ రసము అని పేరెత్తి చెప్పుట వాటిని వాచ్యము చెయ్యడం అవుతుంది. ఆ సందర్భాన్ని చిత్రించడంలో చూపిన నైపుణ్యం చేతనే అది శృంగారమని, కరుణమని సహృదయ హృదయవేద్యం కావాలి. నన్నెచోడుని వలె తిక్కన ప్రబందోచిత వర్ణనలూ చేశాడు. ఉదా|| సింహబలుడు ద్రౌపది విషయమై విరహం అనుభవించడం. దేశీయాచారము లను చక్కగా చిత్రించి దేశ్యతాసిద్ధిని ప్రదర్శించాడు. అభిమన్యు వివాహఘట్టంలో ఆంధ్రుల వైవాహిక మర్యాదలను చొప్పించాడు. యుద్ధఘట్టాల్లో వీర రసానుగుణంగా ఓఱశ్శైలిని కొంత చిందించాడు సంభాషనల్లో ఉక్తిప్రయుక్తిని, నానుడులు, సామె