పుట:Sahityabashagate022780mbp.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48 తలు, దేశ్యపద బంధాలు కూర్చాడు. అవసానపర్వాల్లో రాజనీతి, వేదాంత ప్రసంగాలు విస్తారంగా వచ్చినప్పుడు తెలుగు సంగ్రహణ శక్తిని రుచిచూపించాడు. ఈ వైవిధ్యాన్నిబట్టి మనం గ్రహించచగిన అంతరార్ధం ఏమిటంటే సాహిత్యభాష అనేది అన్ని సందర్భాల్లోను ఏకరీతిగాఉండదు ఒకే చందస్సుకూడా అన్ని శైలులకు అనుకూలంగాఉండదు. ఇదే తిక్కన సోమయాజి తెలుగువారికిచ్చిన భాషా సందేశం. శతాబ్దులుగా తెలుగువారు దీనికి కట్టుబడియే ఉన్నారు. కవిబ్రహ్మ డేశిశైలికి మచ్చుగా రెండు మూడు పద్యాలు.

    "ఏదిరిం దనుయట్టులకా !
    మది దలచిన బౌసగుగాక, మాకుంగుడుమిం !
    డిదెమీరు ప్రక్కగొనుడని !
    చదురడిచిన, మనసుపొందు చక్కంబడునే!"
                             విరాట. 1-313
    "పరుసదనముమెయి సరిగొన !
    జొరదగదరి, పొదుగుగోయుచొప్పగు, వినుపా !
    ల్గురియించు కొనదలంచిన,
   నరయవలదె గోవుప్రజయ నట్టిద యధిసా!"
                                 శాంతి-2-299
   "కోరి తోటవాడు కుసుమఫలంబులు
   గోయనట్లు రాజు గొనగవయు
   నప్పనముల్, నఱికి యంగారములు సేయు
   భంగియైన భూమి పాడుగాదె".
                                    శాంతి-2-800

   నన్నయ తెలుగు సమాసాలు, తెలుగుకృత్తద్దితాలు, పదబందాలు వీటిమూలంగా జాను తెనుగు లక్షణాన్నితిక్కన నిలబెట్టాడు.  శివకవుల అసాధారణ ప్రయోగాలు, వైరి సమాసాలు, మారుమూల పదప్రయోగాలు, ఏకైక చ్చందోనిరతొ ఇత్యాదులు దేశ్యతా సిద్ధికి ముఖ్య సాధనాలు కావని నిరూపించాడు.  ఇటు బుధజన సంతోషమూ సాధింపబడింది; అటు సామాన్య ప్రజలకు సాహిత్య అందుబాటు లోనికి వచ్చింది.