పుట:Sahityabashagate022780mbp.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తానట్లుచేయుదుననీ మహాకవి తన మొదటి గ్రంధంలో ప్రతిజ్ఞచేసి నిర్వహించుకున్నాడు. కాని 'అస్టాదశ పర్వనిర్వహణ సంభృతమై పెనుపొందు ' మహాభారతం వంటి హద్దులు కనబడని సాహిత్యసాగరంలో విహరించేటప్పుడు ఇటువంటి చిల్లర ప్రతిజ్ఞలు అనవసరమని భావించి ఉంటాడు. ఆ మాట ఎత్తలేదు. ఆ నియమం పాటించలేదు. తుదిమాటగా తిక్కన అన్నాడు. లలితములు హృద్యములు అయిన పద్యములతో చిన్న చిన్నఖండములకూర్పుతో నాగటిచాలువలె రచన సాగిస్తానని చెప్పాడు. తిన్నగా తీర్చిదిద్దినట్లు అని బావంగా తోస్తుంది. స్వర్గీల్య సురవరం ప్రతాపరెడ్డిగారు ఇక్కడ కాహల(శ) సంధించిన విధముగా అని ఉపమాన స్వారస్యం చెప్పేవారు. బాకాధ్వని మొదట చిన్నచిన్న తుంపులుగా మొదలిడి చివరకు దీర్ఘస్వరంతో విరమిస్తుంది. ఇదొక చమత్కారము. చిన్నచిన్న సమాసాలతోను వ్యస్తపదాలతోను పద్యం మొదలు పెట్టి ఉత్తరార్ధంలో దీర్ఘపటిష్ఠ సమాసంతో ముక్తాయింపు పలికించడం, విరాటార్వం- 2-133 భీమునికోశం వర్ణిస్తూ 'కనుగొని కోపవేగమున ' అనే పద్యంలో ఈ చమత్కారం చూపెట్టాడు. అయితే కావ్యం అంతా ఇట్లా ఉండదు. ఉంటే రసభంగం అవుతుంది. కావ్యంలో అనేక విధములైన శిల్పాలు ఉంటాయి. 'అమలోదాత్త మనీష ' (నిర్వ-1-13) అనే పద్యంలో తాను ఉభయ కావ్య ప్రౌఢి బాటించు శిల్పములో పారగుడు అని ఆయన చెప్పుకొన్నాడు. పాల్కురికి సోమనాధుడు మహా విద్వాంసుడు, అమిత వచోవేగం కలవాడై నప్పటికీ అతనియందు మత ప్రచారదృష్ఠి శిల్పదృష్ఠికన్న బలీమయవడంచేత కవిత్వంలో ప్రసన్నత కొరవడింది.

   మహాభారత రచనా మహూర్తమునకు తిక్కన సోమయాజిలో వేదాంటపరమైన అద్వైతమే కాకుండా భాషా పరమైన అఎద్వైతం కూడా కురుదుకొంది.  తిక్కన గారి హరిహరాద్వైతము సర్వవిదితము.  కావ్యభాష విషయంలో కూడా ఈయన సంస్కృతాంద్ర భాషా సామరస్యాన్నిసాధించడానికే మహాభారతంలో పూనుకొన్నాడ్.  తెలుగు కవిత్వానికి నన్నయ తీసిన దారులే ప్రసస్తమైనవనీ, ఫలవంతములైనవనీ, తెలుగు భాషా జీవితానికి ఆయువు పట్టులనీ కవిబ్రహ్మ దీర్ఘాలోచన మీదనిర్ణయించాడు.  ఒక జాతి రసహృదయాన్ని పసిబట్టడంఆ జాతి భాషాకవులకే కుదురుతుంది.  ఇది ఇట్లా అని సూత్రీకరించడం సాధ్యంకాదు.  శివకవులు నన్నయ పేరు కూడా ఎత్తడానికి ఇష్టపడలేదు. ఆయన మార్గాన్ని అన్యాపదేశంగా నిరసించి క్రొత్త మార్గం తొక్కాడు.  కాని ఆంధ్రుల హృదయం తత్సమ భాషాబిముఖంగా