పుట:Sahityabashagate022780mbp.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఎట్లా ప్రకటిస్తుందో అల్లాగే కవియైన వాడు తన భావ సౌరభాన్ని మాటలచే రేకుల ద్వారా సున్నితంగా ప్రకటించాలి. కుకవియైనవాడు పాతబడి పోయిన మాటలు ప్రయోగిస్తూ రసభంగం చేసి నవ్వుల పాలవుతాడు. అతనికి మార్గపద్దతి కాని దేశపద్దతికాని సరిగా అవగతం కాదు. తెలుగు కవిత్వం చెప్పేటప్పుడు వశి ప్రాసనియమాలు పులిమిపుచ్చకూడడ్. సంస్కృత శబ్దాలు తెలుగులో ప్రయోగింప దలచినపుడు లింగవచన వ్యత్యయం చెయ్యకుండా వ్రాస్తే బుధణనము మెచ్చుకుంటారు ఇక్కడ తిక్కన ఏమి ఉద్దేశించాడో నిష్కర్షగా చెప్పలేము కాని విశేష్య విశేషణ సంబంధంలో లింగవవన నియమం తపక పాటించాలన్ ఇ ఆయన భవంగా తోస్తుంది. ఉదాహరణకు శివకవులు తెలుగు విశేష్యంతో సంస్కృత విశేషణం మార్చేటప్పుడు లింగనియమాన్ని ఉపేక్షించారు. 'వనిత-ల్లంచరధారి ' అని పాల్కురికి సోమనాధుడు ప్రయోగించాడు. నియమానుసారంగా లాంచన ధారిణి అని స్త్రీ పత్యయం చేయవలసి ఉండెను. బహుశా ఇట్టి లింగవ్యత్యయాల్నే తిక్కన ఉద్దేశించి ఉంటాడు. ఈ సందర్భంలో ఒక్క విశేషం గుర్తించాలి. 'లింగవచనములు భేదింపమికి ' అని తిక్కన చెప్పుతూ విభక్తివ్యత్యయాన్ని పేర్కొనకపోవడంలోని ఆంతర్యంఏమిటంటే తెలుగు నుడికారం ప్రకారం సంస్కృత పదాల్లోకూడా విభక్తి వ్యత్యయం సమర్ధనీయం అవుతుంది. 'పార్ధివ ప్రాగ్రనరుడు ధర్మనుతుపస్సు ' అనే ప్రయోగంలో షష్ఠీవిభక్తి గతమైన ధర్మసుతు అనే దానికి విశేషణనమైన పార్ధివప్రాగ్రసరుండు అనేది ప్రధమావిభక్తిలో ఉంది. కేవలం సంస్కృతంలో పార్ధివప్రాగ్రసరుని పనుపు అని షష్ఠీగతంగా ప్రయోగించవలసి వస్తుంది. తెలుగులో ఆ నియమంలేదు. బుద్ధిమంతుడు రామునకు అంటాముకాని బుద్ధిమంతునకు రామునకు అననక్కరలేదు. దీనిని మనస్సులో పెట్టుకొనియే కాబోలు తిక్కన లింగవచనములు భేదింపమికి అని వ్రాశాడు. మరొక పద్యంలో 'జాత్యముకామి నొప్పయిన సంసకృత మేయ్యెడజొప్ప ' అని వ్రాశాడు. సంస్కృత భాషలో లింగవచన విభక్తుండే ఒక శబ్ధము నిర్ధుష్ఠమయినప్పటికె తెలుగు నుడికారానికి అది కుదరనప్పుడు సంస్కృతముమీది గౌరవంచేత దానిని ప్రయోగించను అని కవియుద్దేశంగా తోస్తుంది. ఈ నియమము మణి ప్రరాళశైలి నివారించుటకని విజ్ఞలు భావిస్తున్నారు. అట్లాగే 'సపదాన్యవ్యయ ' ఇత్యాది సూత్రంచే ఆంధ్ర శభ్ద చింతామణి నిషేధించిన్ అ కేవల సంస్కృత ప్రత్యయవంతములైన శబ్ధాలుకూడా కావచ్చును. వచనంలేకుండానే పూర్వాపర సందర్భాలు కలుపుతూ కవిత్వం చెప్పవచ్చుననీ