పుట:Sahityabashagate022780mbp.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నందం ఇవ్వలేకపోయేది. తెలుగు సాహిత్యాన్ని ఈ ప్రమాదాన్నుంచి తిక్కన సోమయాజి ఎట్లా తప్పించాడో చూద్దాము. అట్టి మహత్తరసేవకే కవులు ఈయనను కవి బ్రహ్మ అని ప్రశంసించారు. రామరాజభూషణుడు 'కుండలీంద్రుండు తన్మహనీయస్థితిమూలమై నిలువ ' అని జోహారులర్పించారు.

తిక్కన సోమయాజి

      ఈ మహాకవి తెలుగు సాహిత్య భాషను విషమ మార్గాల నుంచి తప్పించి విశాల సమసుందరమైన మైద్లానంలో తెచ్చి విడిచినాడు.  తెలుగు సాహిత్య భాషా ప్రగతిని రేఖా చిత్రంగా గీయాలంటే ఈ విధంగా ఉండవచ్చును.  నన్నయకాలంలో ఈ బాట సమరుచి రగతితో కొంత దూరం నడిచింది.  ఇంతలో శివకవి భాషా విప్లవం అనే ఒక లోయలోనికి దిగింది, అక్కడ పారిజాట వృక్షాలూ ఉన్నాయి.  తుమ్మిచెట్లు ఉన్నాయి.  విషమ మార్గము, తెలుగు సాహిత్యపు బాట తిక్కన సోమయాజి మహాభారత రచనలో తిరిగి సమర్చిర విశాల నూర్యాంతపోజ్జ్వలమైన మైదానాల్లోంచి సాగిపోయింది.   వెళ్ళి వెళ్ళి నాచన సోమనాధ, శ్రీనాధ కవులచే మైలురాళ్ళ వద్ద కొందలెక్కడం ప్రారంభించింది.  తరియలు ఎక్కిఎక్కి ప్రబంధయుగంలో పర్వతశిఖరాన్నంటి భూమి మీద చూడక చుక్కలవైపే చూస్తూ సాగిపోయింది.  మళ్ళీ దిగుడు ఆరంభించి తంతావూరు యుగంలో చేమకూర వెంకటకవి అనే మైలు దగ్గర సమతలం మీదకి అవరోహణ చేసింది.  ఆధునిక యుగంలో గురజాడ రేవునుంచి మృధుపవన సంబాషితమై చుక్కలు కనపడని రమ్యోద్యాన వీధుల్లోంచి ప్రయ్లాణం సాగిస్తూంది.
     తిక్కన పేర మిగిలిన గ్రంధాల్లో-నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర మహాభారతం-ఆయన తన మొదటి గ్రంధంలో సాహిత్యభాషా స్వరూపాన్ని కొంత చర్చించాడు.  దిక్ర్పదర్శనంగా కొన్ని నియమాలు ప్రకటించాడు.  మలిగ్రందమైన మహాభారతంలో విజ్ఞతా భరితమైల్న మౌనం పాటించి, ఆదరణలో ఉత్తమ సాహిత్య బాషా లక్షణాలు ప్రదర్శించి, నిర్వచించుకొనేభారం పాఠకులకే వదిలివేశాడు.  తొలి గ్రంధంలో ఆయన పెట్టుకొన్న నియమాలు కొన్ని "కవిత్వము తనకు నచ్చితే చాలదు.  అవ్బరి కవిత్వం వారికి ఇంపుగానే ఉంటుంది.  అది భూరివివేకచిత్తుల హృదయానికి ఎక్కాలి.   తామర పువ్వు విచ్చుకునే దళాల ద్వారా తనలోని సౌరభం