పుట:Sahityabashagate022780mbp.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తెలుగు శబ్దాలలో పద మధ్యాచ్చులను లోపింపచేయుట తరుచు కన్పించును. కుర్వర్, కుస్వు, కడ్గి, తర్గు, కుర్యునే, కన్నెర్కము, ఇన్ము, ఉర్కు, వంటివి. అంత్యవర్ణ లోపము చ్?ఏయుట-ఏగెడువార్ జంగములు, అనియెదర్, బహువచన దువర్ధమున నన్నయకూడ ఉకారలోపము చేసెను: తత్సాలుర్ భయంబందగన్, కర్మణ్యర్ధ్గమునకు, స్వార్ధముననుకూడ పడు ధాతుప్రయోగము సోమనయందు కలదు. సంబోధనమునందు పురుషవాచకములపై 'రో ' వాడుట! బసవరో,వీరభధ్రయ్యరో, తరువాత్గి కాలమున ఇది మహతీవాచకములమీద వచ్చును: అమ్మరో, చెలియరో, కారకవైచిత్రి కనిపిస్తుంది., జన్నంబు వెడలన్, నీకు మెచ్చితి, వ్యవహారమేగు, పోదందు (మనము పోవుదము) చూతండు (మనము చూతము) అవదారణార్ధకము 'అ ' యనియె సోమన వాడాడు. 'తత్వామృతంబయ చన్నుబాలు ', తాను, నేను అనునవి కళలుగా పరిగణింపబడి గసడదవాదేశం చెయ్యడం కనబడుతుంది. ఎను వోయెద, ఈ యదేశముసాంస్కృతిక పరుషములకును వచ్చును. ముల్లోక విభుండు సక్రి. వ్యవహరమునందు సంస్కృత్6ఆంద్రపద సమ్మిశ్రమముచే ఏర్పడిన సమాసములు కన్పింపగా సోమనాధుడు వానినట్లే గ్రహించి ప్రయోగించినాడు. ఇవి విఅరిసమాసమములని వైయాకరణులుభావింతురు. అదికుమ్మరి ఇతరవేల్పులు, చౌదశాబ్దము, దీపగంబములు. ధర్మకవిలె, నిత్యపడి ' పంచవన్నియలు, పుడమీశుడు ఇత్యాదులు పెక్కులు. సోమనాధుడు ప్రయోగించినంతగా దేసి-తెలుగు పదాల్ని తెలుగు సాహిత్యంలో మరెవ్వరూ వాడలేదు. ఆయా విద్యలు కళకకు సమబధించిన పదాలు ఎన్నో అతడు వాడినాడు. అవి యిప్పుడు వ్యవహారభ్రష్ఠములవడంచేత అతని బాషాప్రయోగమంతా మనకు అర్ధంకాదు.

    మొత్తంమీద నన్నయభట్టునకు సమీపకాలంలోనే శివకవులు దేశ-జాను తెనుగు ఉద్ఘోషణముతో అతని సాహిత్య భాషమీద బలవత్తరమైన తిరుగాటుంఛె లేవదీశాడు ' నన్నయ మార్గము విస్కృతమయే స్థితివచ్చింది.  ఇంతలో కవిబ్రహ్మ తిక్కన సోమయాజి వ్యూహముఖమున నిలిచి అచంచలస్థైర్యంతో నన్నయ భారత భాషకు బ్రహ్మాండమైన బలం కల్పించాడు.  తిక్కన సోమయాజికూడా శివవకవుల త్రాసుపళ్ళేంలో నిలబడినట్లైతే తెలుగు సాహిత్య భాషావికాసము మరొకలాగ ఉండేది.  జాను తెనుగుపేరట అప్రసిద్ధ వ్యవహారరీతులు సాహిత్యంలో కాలూడి విలబడేది.  దానివలన సార్వజనికంగా ఉండవలసిన సాహిత్యభాష మాండలికదశకు దిగబడి సాహిత్యం ఇవ్వవలసిన నిర్మలా