పుట:Sahityabashagate022780mbp.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శబ్దములను వ్యవహార సిద్ధరూపములతో వాడుట, చర్వాకుడు అనుటకు చాకుడు, త్రేది, ద్వేది-త్రివేది, ద్వివేది అనుటకు. కొన్ని శబ్దాలకు 'డు ' వర్ణమురాదని వ్యాకరణములు: మను, వటు, సటువంటివి. సోమనాధుడు పడువుడు అని ప్రయోగించెను. బమ్మెర పోతరాజు వటు శబ్దంమీద ప్రధమాడుజ్ వర్ణకం ప్రయోగించాడు 'ఇంతింతై వటుడింతయై ' ఈయ ప్రత్యయాంతరములను ఇయ్యగా పలుకుట. మహనీయ అనుటకు మహనియ్య, త్వదీయ-త్వదియ్య ఇట్లాంటివి. లమహద్వాచకము వర్ణము లోపింపచేయుట: తుది ఖండములు అనుటకు ఖండలు; అర్ణవఘోషణంఊ అనుటకు ఘోషణ, వ్యాకరణాలు దీన్ని గుర్తించాయి. దరెభాదులకు మువర్ణ లోపము. కొన్ని చిత్రరూపములు-కాళిదాసి, భక్తసమూహి (సమూహము అనుటకు), లింగవ్యత్యయము; వనితయ పూర్వలాంచనధారిణి యనుటకు లాంచనధారి అని ప్రయోగించడం, వల్లభకు వల్లభి, సంధియందును వ్యవహారానుసారిగా అధికస్వేచ్చ పాటింపనైనది. కూడడుకుట (కూడు+ఆడుకుట), పదమూడవేట (పదమూడగువేట), ఒప్పారినటూరి (ఒప్పారునినటూరి) స్త్రీవాచకములపై సంది. దుగ్గళవ్యనియే, చీరెల్ల (చీర+ఎల్ల), క్ర్వార్ధక ఇకార సంధిచేయనైనది. వెఱచుందుము. ఒల్చీడె (ఒలిచి+ఈడే) ఏతెంచారగించి, కూడుండు (కూడి+ఉండు), ఇకారాంత నామవాచకములమీదకూడ ఇట్టి సంధి కన్పించును. బగితేడ (బగితి+ఏడ), నావెఱుగని, కాకఱవులు కడాది శబ్దములమీద తత్సమములు పరమగునపుడుగూడ ద్విరుక్తటకారం చెయ్యడం కట్టుగ్రము, కట్తుగ్రలీం, కడాదుల మీద తెలుగు శబ్దములు వచ్చినప్పుడే ద్విరుక్తటకారము వచ్చుట విఅయాకరణమతము. సమాస వైచిత్రి. కర్మధాతయ సమాసము మహత్ శబ్దమునకు 'మహా ' ఆదేశము చేయకుండుట. మహద్గురుపుత్రుడు. నన్నెచోడుడుకూడ 'స్మహత్కాశాస్దనౌఘంబు ' అని ప్రయోగించియున్నాడు. షష్ఠినగాగంవిరహితరూపము; కరికాలచోడకు-చోడునకు అనదగినచోట. చోడ అను రూపమును కలదు. అప్పుడు చోడనికి కావలసి ఉంటుంది. తరువాతి కవులు కొందరు దీనిని ఆదరించారు. బచ్చింటి (బచ్చునింటి) అని తెనాలి రామకృష్ణుడు, షష్ఠీ సమాస సంధిలోకూడ విశేషం కనబడుతుంది. మహేశ్వరుల యిండ్ల అనుటకు మహేశ్వరులిండ్లు; యజమానులిండ్ల, కులహీనులెంగిళ్ళు, ఇంచుగా గమముతో సంస్కృత శబ్దాలను తెలుగు ధాతువులుగా మార్చుకొవడంలో సోమనాధుడు నన్నయాదుల పద్ధతినిదాటి వెళ్ళిపోయాడు. ఉత్సాహించు, అలంకరించి, అహంకరించి, శాపించు ఇత్యాదులు ఉపకృతి, సంవృతి, పరిణతిభేదమును విస్తరించుటచే ఇట్టి రూపములు సిద్ధించును.