పుట:Sahityabashagate022780mbp.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ద్రోహంకాదబుఈం తెలుగుభాష నైజమే అటువంటిదనీ విజ్నులు తెలుసుకోగలరు. మనమిన్ని ఊహలు కల్పనలుచేసినా నన్నయ ఇది యిట్లని ఏమీ పలుకలేదు. తన భవ్యకవితా లక్షణాన్నిమాత్రం సంగ్రహంగా నిర్దేశించాడు.

       "సారమలిం గవీంద్రులు ప్రసన్నకధా కలితార్ద యుక్తిలో
       నారసిమేలు నా నితరులక్షర రమ్యత నాదరింప, నా
       నారుచురార్ధసూక్తినిధి నన్నయభట్టు తెనుంగునన్ మహా
       భారత సంహితా రచన లందురుడయ్యె జగద్దితంబుగన్" ఆది-1-26

   అతని కవిత్వ గుణములు ముచ్చటగా మూడు. 1. ప్రసన్న కధాకవితార్ధ యుక్తిత్వము  2. అక్షర రమ్యత 3. నానారుచిరార్ధ సూక్తి నిధిత్వము. అందులో కడపడి రెండును సాహిత్య భాషా లక్షణములు.
   కధానిర్వహణము ప్రసన్నముగా ఉండడం, పూర్వాపర వైరుధ్యాలు సరి చెయ్యడము, ఉపకధలను హద్దులో ఉంచడము.  దీర్ఘ వేదాంత రాజనీతి ప్రసంగాలను సంక్షేపించడం, వర్ణణలను తగుమాత్రంగా కురించడము-ఈ మొదలైనవి కధాప్రసన్నతను సాధించడానికి నన్నయ అవలంబించిన పద్దతులు.  మితరచన చెయ్యడం నన్నయ కవితా రహస్యము.  దేవయాని వృత్తాంతము చూతము.  కచుడు ప్రొద్ధుగ్రుంకినను ఆశ్రమమునకు రానందుకు దేవయాని ఆతురత. ఈ షత్కరుణము.

     "వాడిమయా ఖముల్ గలుగు వాడపరాంబుధి గ్రుంకె ధెనువుల్
     నేడితవచ్చెనేకతమ, నిష్ఠమెయిన్ భవదగ్నిహోత్రముల్
     పోడిగ వేల్వగాబడియె, బ్రొద్దును బోయెకచుండు నేనియున్ !
     రాడువనంబులోన మృగరాక్షస పన్నగ బాధనొందెనో" ఆది-2-112

    దీనిలో సంధ్యావర్ణనము, దేవయాని ఉత్కంఠ రమ్యముగా సంగ్రహింప బడ్డాయి.
  సంవరణుడను రాజు తపతియను కన్యతో తనకామెయందు గలిగిన ప్రేమను ప్రకటించుట-శృంగార సన్నివేశము.