పుట:Sahityabashagate022780mbp.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దేశి - మార్గములు - జాను తెనుగు

   "ధరణి నతిప్రతాప బలదర్శములన్ విననేన పెద్ద నె
    స్వరికినిమున్ భయంపడనివాడ భయార్తుడనైతి నిప్డు పం
    కరుహదళాయతాక్షి దయగావుమునన్నుభవన్నిమిత్తరు
    ర్భరతరపంచబాణహతి బంచత బొందక యుండునట్లుగాన్" ఆది-7-79

    నన్నయ పేర్కొన్న అక్షరరమ్యత శైలికి సంబందించినదని చెప్పవచ్చును. మనోహరమైన అర్ధముగ్ల సూక్తులు కూడ దీనిలో భాగముగానే పరిగణించవలెను. ప్రసిద్ధములు సులభార్ద బొధకములు అగు పదాలు ప్రయోగించడము.  సంస్కృత సమాసాలైనా ఎక్కువ జటిలంగా కూర్చలేకపోవడము చిన్నచిన్న దేశ్య సమాసాలు కూర్చడము, అన్వయ కాఠిన్య లేకుండా రచన సాగించడము, ఇత్యాదులు అక్షర రమ్యతకు హేతువులు సూక్తులు, లోకోక్తులు, జాతీయములు వ్యవహార భాషకుదగ్గరగా ఉండే పదబంధాలు-ఇవి కూడ నన్నయ శైలిని ప్రసన్నరమణీయం చేశాయి అర్ధాంతర వ్యాసాలు చక్కగా ప్రయోగిస్తాడు 'ముగ్దులరిపులు, మఱవరె బహుకార్యమగ్నులు కారే ' ఆది-4-69; గత కాలము మేలువచ్చు కాలముకంటెన్, ఆది-5-159; రోయుతీగ కాళ్ళందవలెన్ ఆది-5-220 వృద్దుల బుద్దులు సంచలింపనే సభా-2-9 ఇట్లాంటివి పెక్కులు.
    లోకసిద్ధములు ఈయన్న పౌష్యు ప్రోలికి, నిలువుండ; కానవచ్చిన, వడవడ పడంకు, ఎవ్వరిని మెచ్చక, ఇందుండి నసయక, ఋణము తీఱుట, కొడుకల్లడ యిడి, వీపులొలియ, కొలది యెఱుంగక, కలధనమెల్ల నాలుగేన్ పాడి కుఱ్ఱలు, పల్లేయని, నీ కోరినవరంబు, చూతము రండు, ఇట్టివి లెక్కలేనన్ని, సూక్త్లను గూర్చి నన్నెచోడుడు, ఎఱ్ఱాప్రెగడ మొదలైన వారుకూడా చెప్పారు.
                     దేశి-మార్గములు-జాను తెనుగు
   నన్నయ భట్టరకుని తర్వాత ఒక శతాబ్దిలోనే తెలుగు కవిత్వానికి, తెలుగు సాహిత్య భాషకూ  ఒక క్రొత్తమలుపు ఇవ్వడంపెట్తినవారు శివకవులు.  శివుని పరదైవంగా అరాధించేవారు శివకవులు, నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రెగడ, బమ్మెర పొతరాజు మొదలైన వారంతా అద్త్వితముపరులు.  వారు శివకేశవుల్ని ఉభయుల్నీ ఆయా సందర్భాల్లో  పరద్వైతములుగా కొలిచేవారు.  శివకవులు  వీరి పేరు ఎత్తకపోయినా వీరందరినె భవి కవులుగా భావిస్తారు.  అభవుడు ఈశ్వరుడు తదృన్నులు భవులు,