పుట:Sahityabashagate022780mbp.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మొదలైన కారణాలచే శబ్దస్వరూపం అప్రయత్నంగానే మార్పుకు లోనవుతూ ఉంటుంది. 'ప్రవాహినీ దేశ్యా ' అన్నారు గనుక దేశభాష ప్రజల నోళ్ళలో క్రొత్తరూపాల్ని ఆదరిస్తూ ఉంటుంది. పండితులు సాధారణంగా పూర్వతరపు రూపాల్ని ఆదరిస్తూ ఉజ్ంటారు. అవి కొంత స్థైర్యమును సంపాదించుకొని ఉంటాయి. శిష్టజనము ఉచ్చారణలో భాష స్తిమిత వేగంతో మారుతూంటుంది. వారు అవధానముతో మాట్లాడునప్పుడు మూలశబ్దరూపం భాసిస్తూనే ఉంటుంది. ఈ నాటి వ్యవహరంలో కూడా వచ్చాడు, వచ్చినాడు రూపాలు శిష్ట వ్యవహారంలోనూ, ఒచ్చాడు, అచ్చాడు, అచ్చిండు వంటి రూపాలు పామర జన వ్యవహారంలోనూ వినబడతాయి. నన్నయ నాడు కూడ ఈ స్థితియ్?ఏ జరిగి ఉం?టుంది.

    3. ఆయన ప్రతిభా విశేషం,మిత్రుడు అష్ఠభషాచక్రవర్తి అయిన నారాయణ భట్టు సహాయం. నన్నయనాటికే కన్నడ కవిత్వం పరాకాష్ఠచెంది ఉన్నది గనుక సాహిత్య భాషను రూపొందించడంలో రత్నత్రయ మహాకవులు అవలంబించిన రీతులు నారాయణభట్టు నిర్దేశించి ఉంటారు.  వాటిని యథోచితంగా నన్నయ తెనుగునకు అనువర్తింపచేసి ఉంటాడు.  నన్ననార్యుని భషాసంబంధియైన విజ్ఞత, సూక్ష్మదర్శిత్వము, రసానుకూల పదస్వీకార సామర్ధ్యము ఇవి ఆయనకేకాక తెలుగు భాషకు కలకాలమూ శ్రీరామరక్షగా పనిచేశాయి.  మహాకవి మనస్సు శ్రవణేంద్రియము అలోక సామాన్య మైత్రితో పనిచేస్తాయి.  ఏరూపం బాగుంటుందో, ఏది నప్పదో వ్యాకరణం నుంచి మహాకవి నేర్చుకోనక్కరలేదు.  అది స్వతస్వైద్ధమైన 'భాషా పరశేషలోగిత్వము ' గుణదోష విచారణచేసి మాత్సర్యం లేకుండా మేలైన దానిని నిరూపించిచెప్పే పండిత పరిషత్తులు ఆయనకు లభించాయి.  లేదా ఆయన సమకూర్చుకొన్నాడందము. పరమ చాంధసుడైనా నన్నయభట్టు  మృదుభాషి. మితహిత సత్యవాక్య రచనా చతురుడు.  అట్టి సజ్జనునకు శత్రువులు ఉండబోరు.  "వాక్పారుష్యము చనెనుమహాదారులు మది విషముకంటె దహనముకంటెన్ "(సభా-2-17) అనేది ఆయన భవ్యవాణ్నియమము.
    ఆయా సాధన సంపత్తిని జతచేసుకొని విపుల శబ్దశాసనుడు బహుశాంధ్రోక్తిమయ ప్రపంచానికి శాశ్వతమైన బాటవేసిపోయినాడు.  ఎవరెంత చీదరించుకొన్నను ఆయన పన్నిన భాషావ్యూహంలో కాలుపట్టక తప్పడంలేదు.  కాలుపెట్టి మొగ్గరము గడిచిరావడం సాధ్యం కావడంలేదు.  అది శివకవులు కానీండి, సంస్కృతాన్ని అనుసరించడం భాషాదస్యమని 

డిండిమములు వాయించిన ఆధునికులు కానీండి -- నన్నయ నుడికారపుగిరిలో పడడం తప్పడంలేదు. అనగా అది నన్నయచేసిన భాషా