పుట:Sahityabashagate022780mbp.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

తవై" ఇత్యాదికావ్యాలు ఉన్నాయి. ఒక సుశబ్దాన్ని చక్కగా ప్రయోగిస్తే అది కామ ధెనువు వలె స్వర్గ లోకము నందును భూలోకము నందును అన్ని కోరికలకు ఇస్తుంది. అపశబ్ద ప్రయోగం చేత గౌరవాదికరములు పొందుతారు. మ్లేచ్చుల వలె ఆచరింపకూడదు. అనుశబ్ద ప్రయోగం చెయ్యరాదు. ఇంతగా నుశబ్దాపశబ్ద స్తుతినిందల చేత ప్రాచీనులు భాషా పారిశుద్ద్యాన్ని సంరక్షించడానికి యత్నించారు. అయితే ఒక సమస్య వారినె ఎదుర్కొన్నది. ఈ నిష్ఠ ఎల్లప్పుడూ సాధ్యమా నిత్యజీవితంలో అనగా నిత్య వ్యవహారంలో అపశబ్దం ప్రయోగించకుండా జరుగుతుందా. ఇది ఆచరణ సాధ్యమా అని ప్రశ్నించుకొని సమాధానం కూడా వారే ఇచ్చారు. 'సర్వోవప శబ్దనిషేధం|| క్రత విషయఏవన తు వ్యవహార విషయ 'అపశబ్ద ప్రయోగ నిషేధము యజ్ఞ సంబంది అయినది. వ్యవహార విషయము కాదు అని పరిష్కారం చేశారు.

   అయితే సారస్వతమునందే నియమము పాటించాలి.  ఇది క్రతువుకాదు. నిత్య వ్యవహారమా ! అదీకాదు.  సాహిత్య సందర్భంలో ఏ విషయము పాటించాలి అన్నప్పుడు వాల్మీమి దగ్గరనుండి కవిసమాజం అంతా సుశబ్ద ప్రయోగంపైనే మ్రొగ్గింది,. కాళిదాసమహాకవి రూపకాన్ని 'కాంతం క్రతుంచాక్షుషం ' అని వర్ణించాడు.  దేవతలు నాటక ప్రయోగాన్ని మనోజ్ఞము, కంటికి సమబందించినది అయిన క్రతువుగా మునులు పరిగణిస్తారు అన్నాడు మహాకవి.  సారస్వతము రస:ప్రమేయము కలది.  రసము బ్రహ్మ స్వరూపము.  అందుచేత కావ్యమునందలి భాషకూడా సుశభ్దఘటితమై ఉండాలి అనేది అనాదిగా కవిలోకంలో  ఏర్పడిన అలేఖ్య నియమము.  కావ్యనిర్వచనంలో దీనిని అలంకారికులు ఘటించారు.  తద దోషా శబ్దార్దో, క్తతు విషయంలొ అపశభ్ద ప్రయోగం వలన దేవతలు అసంతృప్తి చెందుతారు. లౌకికమైనకావ్యంలో ఏమాత్రపు అపశబ్దం దొర్లినా అది కావ్యసౌందర్యాన్ని విచ్చేదం చేస్తుంది.  నన్నయభట్టారకునకు ఎన్నో శతాబ్దములముందే ఈ సంప్రదాయం ఏర్పడి ఉంది.  అతడు దాన్ని విశ్వసించినాద్.  అనుష్టించినాడు. అతడు అన్యధాచేస్తే సమకాలిక విద్వాంసులు ఆ కావ్యాన్ని మెచ్చరు.  'దేవా! నీయనుమతంబునను, విద్వజ్జనంబుల యనుగ్రహంబునను నానేర్చిన విధంబున నిక్కావ్యంబు రచియించెద ' అన్నాడు నన్నయ.
    ఈ సుశభ్ద నిర్ణయం చెయ్యడం ఎట్లాగ, భాష ఎక్కడ ఉన్నది. వైయాకరణులు దానిని సృష్ఠించగలరా ఇత్యాది ప్రశ్నలకు ప్రాచీన భారతీయులు శాస్త్రీయమైన సమాధానాలు కనుగొన్నారు.  మహాభాష్యమునందు 'సిద్దే శబ్దార్ధ సంబందే ' అనె ఘట్టంలో తలస్పర్శగా దీనిని చర్చించారు  లోకంలో కొన్ని వస్తువులు ఉత్పార్యము