పుట:Sahityabashagate022780mbp.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

లైనవి ఉన్నాయి కుండలు కావలసినవాడు కుమ్మరివాని వద్దకుపోయి తనకు కొన్ని కుండలు మూకుళ్ళు చేసి ఇమ్మని అడుగవచ్చును. ఆ విధంగా ఒక కవిగాని రచయిత గాని విఅయాకరణుని దగ్గరకు వెళ్ళి నాకు కొన్ని శబ్దాలు నిర్మించి పెట్టమని అడగడం లేదు. ఘటకరావములవలె శబ్దములు ఉత్పాద్యములు కావు. అది లోకమునందే ఉన్నాయి. వాటి అర్ధాలు కూడా నియతమై ఉన్నాయి. లోకమునుండే భాషా సామగ్రిని గ్రహించి ప్రయోగించాలికాని ఎవరికి వారు ఎంత గొప్పవారైనా భాషను క్రొత్తగా నిర్మింపలేరు. ఈ భావాన్నే ఆంధ్ర శబ్ద చింతామణి కూడా 'సిద్ధిర్లోకాత్ దృశ్యా, లోకోనన్యాదృశశ్చనిత్యశ్చ ' శబ్ద సిద్ధి లోకమునుండే చూడవలెను. లోకము మార్పు నొందునదికాదు. నిత్యమైన, భాష యొక్క అద్యంతము లెవరికి తెలియవు గనుక అది నిత్యమని ఒప్పుకోవచ్చును. భాష మార్పు నొందదు అనే విషయం ఆధునికులు ఒప్పుకోవడం లేదు. కాలక్రమాగతంగా భాష మారుతూనే ఉంది. వేధ భాషకును తన కాలపు సంస్కృతానికీ గల భేదాన్ని పాణిని మహర్షి గుర్తించి సూత్రబద్ధం చేసియే ఉన్నాడు. వేదభాషను చందస్సు అనీ తనకాలపు పలుకుంబడిని 'భాష ' అనీ ఆయన సంకేతం చేసుకొన్నాడు. లోకంవలనే శబ్ద సిద్ధి అవుతూంటే ఇంక వ్యాకరణం వ్రాసే శ్రమ ఆధ్యయనం చేసే శ్రమ ఎందుకని ప్రశ్నించుకొని పతంజలి దానికి సమాధానం చెప్పాడు. సుశబ్ధాపశభ్ద జ్ఞానం కోసం వ్యాకరణం తెలుసుకోవాలి. వ్యాకరణము వినా ఈ జ్ఞానం కలిగే మార్గం లేదు, అన్నాడు.

   చింతామణికారుడు కూడా దీనినే అనుకరించాడు.  'అని యనూద్గ్రామ్యహి- యత్వపభ్రంశ: '. భాషా ప్రయోగమును వ్యాకరణాదులచే నియమింపకపోతే అది గ్రామ్యముగా తయారవుతుంది.  దానినే అపభ్రంశమంటారు.  అది ప్రయోగార్హము కాదు.  ఆంధ్ర భాష నాలుగు విధములని చెబుతూ- తజ్జా, సమా, దేశ్యా గ్రామ్యా- తద్బవ, తత్సమ, దేశ్య, గ్రామ్య విబాగాలను చింతామణి పేర్కొంది.  ఇందులో గ్రామ్యం కావ్య ప్రయోగార్హం కాదని ప్రాచీనుల మతము.  అధర్వణుడనే మరియొక విఅయాకరణుడు-తిక్కన కాలము వాడని భావిస్తాడు- ఈ విషయంలో మరికొంత విశాల దృష్టిని ప్రకటించారు.
   "సామరాది ప్రయుక్తం యత్త ద్గ్రామ్యమనిదీయుతే కవితోపాశ్రితం దోషం నైనకించిత్సహామహే అహెయ మన్యదేశీయం యత్తదేవ ప్రయుజ్యతఏ గ్రామ్యము తత్త ద్విధే సాధు కరకంఠీ ముభాహితా:"