పుట:Sahityabashagate022780mbp.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కరణం అన్నారు. దీని వలన సంస్కృత సూక్తులు అనుకరనం చేసి యధాతధంగా తెలుగులో వాడుకొనే సౌకర్యం ఏర్పడింది. 'అంగాదంగా త్సంభవని ' యను వేద వాక్యాన్ని (ఆది-1-96) నన్నయ వాడినాడు. ఆంధ్ర శబ్ద చింతామణిలో వాచ్యంగా చెప్పబడక పోయినా మణిప్రవాళ శైలి తెలుగులో విషిద్ధమయింది. మణిప్రవాళమనగా సంస్కృత విభక్తితో కూడినశబ్దాన్ని తెలుగులో యధాతధంగా వాడటం. ఆశబ్దానికి తత్సమ రూపంచెయ్యకుండా సంస్కృతవిభక్తితో ప్రయోగించడం. ఇట్టిశైలి కవిలోకంలో కొంత ప్రచారంలో ఉండేది. మలయాళ భాషయందు ఎక్కువగా కలదని చెప్పుతారు. తెలుగుశాసనాల్లో కూడా ఒకటి రెండుచోట్లవచ్చింది. గొగ్గిభటరళ దక్షిణ భుజాయమానుంఱయిన ఉజేని పిశాచనామధేయంఱు...ఏఱువవిషయంబేళన్ తస్యమాతా(త్రా)దత్తం గొవృషాణ భట్టారహో శతపంచాకతిక్షేత్రం—విక్రమాదిత్యుని తురిమెళ్ళశాసనము. నన్నయ అట్టిశైలిని ఆదరించలేదు. పాల్కురికి సోమనాధుడు తన వృషాధిప శతకంలో ఉదాహరణగా పేర్కొన్నాడు.

  ఆంద్రశబ్ద చింతామణి సూత్రాల ప్రకారం సాధురూపాలుగా కనపడుతూ నన్నయలో నేడు కాన్పించనివి ఒకటి రెండు కలవు. పదాదియందు య కారముండటం సాధువవుతూంది. యెవడు నంటివి. ముద్రిత భారతంలోఇవి కనపడవు. అట్లే బహువచనంలో డ్డు వర్ణాంత రూపాలు ఇప్పుడు భారతంలో లేవు. శాసన భాషలో ప్రచురంగా ఉండేవని చూపెట్టియున్నారు. అడ్లు, ఊడ్లు, ఎంగిడ్లు వంటివి. వీటిస్థానంలో ఊళ్ళు,ఎంగిళ్ళు రూపాలే చెల్లుతున్నాయి. ద్రుతానికి అచ్చుపరమైనప్పుడు ద్వితం రావడం కూడా నన్నపార్యునకు సమ్మతము. అను+ఇష్ట సఖియను దానిని అన్నిష్ట సఖియని ఆచార్యుడు సంధిచేసినాడు. దీనినిబట్టియే పోతనాధులు ‘సర్వమున్నతమని దివ్యకళామ్యమంచు ‘ వంటి ప్రయీగాలు చేశారు. అయినా ఇది సార్వత్రికము కాదు. కధాచిత్కము.
  కావ్య భాష విషయంలో ప్రాచీనులు పెట్టుకొన్న మొట్టమొదటి నియమము సుశబ్ద ప్రయోగము. అప శబ్ద నిరాకరణము. ఈ సుశబ్దాపశబ్ద విచారం సంస్కృతం నుంచి తెలుగుకు వచ్చింది. పతంజలి మహాభాష్యంలో దీనిని యుక్తి యుక్తంగా అసాధారణ వైదుష్యంతో సుదీర్గంగా చర్చించి నిర్ణయించారు. సుశబ్ద ప్రయీగాన్ని ఇట్లా ప్రసంసించారు. ఏకశ్శబ్ధ:సమ్మక్ జ్ఞాత: సుష్టు ప్రయుక్త: స్వర్గే లోకే కామ ధుగ్బవతి“ అపశబ్దం! ప్రయంజానో రౌరవంనరకం వ్రజేలి-నమ్లేచ్చితవై నాప భాషి