పుట:Sahityabashagate022780mbp.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సాహిత్యం- ముఖ్యరాసులు

2. వస్తువు దానికి ప్రాణమైన రసము

3. సహృదయడు లేక పాఠకుడు.

    మూడసరాశియైన సహృదయుడు సాహిత్యభాషను రూపొందిచడంలో ప్రత్యక్ష పాత్ర వహించకపోయినా పాఠకదృష్టిగల రచన ఓకవిదంగాను, అతణ్ణి ఉపేక్షించిన రచన మరొకవిధంగాను ఉండడానికి అవకాశముంది కావుంహ పాఠకుణ్ణి సాహిత్యభాషా నిర్మాణంలో తటస్థద్రవ్యంగా గ్రహించవచ్చును.  ప్రధానద్రవ్యాలైన కవి - వస్తుప్రమేయాన్ని కొంత తరచిచూద్దాము.  'ఆపారే కావ్య సంసారే కవిరేన ప్రజాపతి: ! యధాస్త్మెరోచతే విశ్మం తధేదం పరివర్తతే ' అన్న ప్రాచీన భాషణము నిరాకరింపరానిది. కావ్యప్రపంచంలో కవియే ప్రజాపతి.  అతనికి రుచించినట్లే అది రూపుదిద్దుకొంటుంది.  కవి తనవ్యత్వాన్ని అధ:కరించుకొని సామాజికదృష్టిలో వ్రాయాలని ఆధునికులు భావిస్తారు.  కాని ఇది కొంతవరకే సాధ్యం అని చెప్పాలి. కవివ్యక్తిత్వంలేని కావ్యము చంద్రుడు లేని ఆకాశంలా ఉంటుంది.  కావ్యానికి అలంకారికులు చెప్పిన పెక్కుప్రయోజనాల్లో 'సద్య:పర నిర్వృతి: కాంతా సమ్మితమైన ఉపదేశము ' అను రెండును ముఖ్యతమమైనవని అన్ని కాలాల్లోను, అన్ని దేశాల్లోను జనం సంఖ్యాకులు ఒప్పుకోంటున్నారు.  సద్య:పరంర్యృతి - అనగా తత్కాలమునందే అపొరానందము ఇవ్వగల సాహిత్య లక్షణము.  అయితే ఈ పరనిర్వృతి కవికి సంబందించినదా, సహృదయులకు ఉభయులకు సంబందిచినదనే చెప్పాలి.  కవిలో ;పూరభావజన్యమైన నిర్హేతుకానందము లేకపోతే అతడు తన రచనయందు దాన్ని ఎట్లా నిక్షైపిస్తాడు.  సహృదయునిలో దాన్ని ఎట్లు ఉదృద్దహ్ము చేయగలుగుతాడు.  కారణములేని కార్యము ఉండదుగదా, అయితే ఈ ఆనందనుభూతిని ఇతరులతో అనగా పాఠకులతో పంచుకోవాలనే సత్వవృత్తి కవియందు ఉండకపోతే ఆ కావ్యం లోకహితాన్ని సాధించలేదు.
   కవియొక్క చిత్తవృత్తిని బట్టి కావ్యశైలి లేక భాష మారుతుంది.  సాత్వికులైన కని, సాత్వికుడైన బాటసారివంటివాదు!  సత్వస్వభావం కల బాటసారి తాను నిష్కంటకమైన ఋజుమార్గమున ప్రయాణించడమేకాకుండా తోటిప్రయాణీకుల్ని నిష్కంటకమైన ఋజుమార్గమున ప్రయాణించడమేకాకుండా తోటిప్రయాణీకుల్ని నిష్ప్రమాదమైన మర్గాన్ని తీసుకుపొతాడు.  రాజసుడైన కవి రాజసుడైన బాటసారివంటివాడు.  రాజసుడైన బాటసారి తాను ఋజుమార్గమున ప్రయాణిస్తాడు.  కాని తోటిబాటసారుల్ని తనతో తీసుకుపోయె బాధ్యత వహించడు.  వారు తనవెంట రాగలరనో, రావలనో