పుట:Sahityabashagate022780mbp.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భావించి తనయిచ్చవచ్చినట్లు ప్రయాణిస్తాడు. వేదాంతపరిభాషలో చెప్పలంటే సాత్విక కవి తల్లిమార్జాలమువంటివాడు. మర్జాలము తన పిల్లల్ని వాటి ప్రయత్నాలకు విడిచిపెట్టక నోట కరుచుకొని వెడుతుంది. సత్వికకవి సహృదయుని లెక పాఠకుని తన వెంట తీసుకుపోయేదృష్ఠి పెట్టుకుంటాడు. రాజకవి, తల్లి మర్కటము వంటివాడు. కోతిపిల్లలు తల్లికడుపు నంటిపెట్టుకొని తల్లితో ప్రయాణంచేస్తాయి. తల్లి వాటిని నోటకరచుకొని వెళ్ళదు. రాజసకవి సహృదయుడు లేక పాఋహకుడు తనవెంటనంటి రావలెననే దృష్టి పెట్టుకుంటాడు. రాజసకవి తన భావైహాయన గమనాన్ని గమనించుకుంటూ పాం?డిత్య శిఖరాగ్రాలకు తనతోపాటు పాఠకుడూ ఎక్కిరావాలంటాడు. ప్రాచీన కవులు నన్నయ, తిక్కన, ఎఱ్ఱాప్రెగడ, బమ్మెర పోతన, అల్లసాని పెద్దన వంటివారు సాత్వికకవుల కోవలోకి వస్తారని స్థూలంగా భవిద్దాము. పాల్కురికి సోమన, నాచన సోమన, శ్రీనాధుడు, రామరాజభూషణుడు తెనాలి రామకృష్ణుడు వంటివారు రాజసకవులని స్థూలంగ భావిద్దాంఉ. వారి గుణ విశేషాన్నిబట్టి వారి వారి శైలి భిన్నంగా ఊంటుంది. భాష ఆ శైలిని అనుసరింఛె ప్రవహిస్తుంది. అందుచేత సాహిత్యభాషలో సాత్విక రాజస భేదం మనము గుర్తుపె"ట్టుకోవచ్చును.

     కావ్యవస్తువునిబట్టికూడా భాష భేదించవలసివస్తుంది.  విస్తృతమైన వస్తువిన్యాసం కల కావ్యంలో పరిమిత శబ్దజాలంతో నడక సాగదు.  నడక కుంటుపడి పునరుక్తిదోషం రావడమో, లేక భావమంతా అక్లిష్టంగా రేకులువిప్పిన కమలంలా అందాలు ఈనక ముకుళితప్రాయమై ఉండిపోవడమో జరుగుతుంది.  ఉత్తమ కవిత్వంలో కొంత తరద్చాటు తప్పదు.  బావాన్నంతటినీ వాచ్యంచెయ్యడం కవితాశోబకు న్యూనత అని తజ్ఞులు భావిస్తారు.  అందుకోసమె ధ్వనిప్రస్థానం సాహిత్య్హంలో కుదురుకొన్నది.  కొందరు కవులు తాము ఉద్దేశించిన బాన్నంతటినీ చక్కగా వ్యక్తీకరింపలేక  తాము చెప్పజాలక విడిచినది ధ్వన్యర్ధం అని సమర్ధించుకుంటారు.  కాని ఇది గ్రాహ్యముకాదు.  పదార్ధములు అన్వయించిన తరువాత వాక్యార్ధ సౌందర్యంకోసం చెప్పగలిగిన విశేషార్ధం ధ్యన్యర్ధం అనిపించుకోంటుంది.  కాని అర్ధమెకాని పద్యంలో ధ్వన్యర్దహ్ం చూసుకొనుము. అనడం కుందేటికొమ్ముకోసం వెతకడం వంటిది.  వసువైఫల్యాన్నిబట్టి భాషావైఫల్యం ఉండవలసివస్తుంది.  లేకపోతే రచనావైవిధ్యం ఉండరు.  రచనయందు వైవిధ్యం లేకపోతే అది నిస్సారంగా ఉంది.  చందోవైవిధ్యంచేత వస్తువు అప్పటికప్పటికి నూతనత్వ మాపాదించుకొంటుంది; కవిత్వం శ్రవణయోగ్యంగాను, పఠనయోగ్యంగాను ఉంటుంది.