పుట:Sahityabashagate022780mbp.pdf/11

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


సాహిత్యం - ముఖ్యరాసులు

చిన్న నియమాలు మహారాజలరాశి తరణంలో లెక్కకు రావు. ఒక చిన్న కావ్యమో ఖండికయో అయితే చిన్న చిన్న నియమాలు పెట్టుకొని కొంత సంయమనం పాటించవచ్చును. కవి దృష్టి దీనిమీదనే నిబద్ధమై ఉంటుంది గనుక ఆడే అష్ఠాదశ పర్వనిర్వహణ సంభృతమైన మహా రచన అయితే చిన్న చిన్న నియమాలు సాధ్యమూకావు; అవస్యకమూ కావు. అందుచేతనే నన్నయ భట్టారక్జుడన్నాడు:

                  "బుద్ది బాహు విక్రమమున దుర్గమార్థ జల
                    గౌరవ భారత భారతీ సముద్రము దరియంగ
                    నీదని విధాతృనికైనను నేరబోలునే".

    మహారచన చేసేటప్పుడు మరొక జటిల సమస్య తలయెత్తుతూంది. మహా కావ్య రచనకు కవలసిన ముడి సరుకు అంటే పదజాలం అంతా, నిత్య వ్యవహారంలో ఉన్నదా? లేదు. తెలుగులో ఇంకా తక్కువ. దీనికి చారిత్రక కారణాలు ఉన్నాయను కోండి. మన పూర్వ కవులు తెలుగును పెరగనివ్వవలసి నంతగా పెరగనిచ్చినట్లు లేదు. వారు విస్తారంగా సంస్కృతతాభిమానం కలవారగవడంచేత అపారంగా లభిసూన్న గీర్వాణ పదజాలాన్ని తెలుగులోకి దిగుమతి చేసుకొని తత్సమ భాషాభిముఖంగా పయనించారు. నన్నయనాడో అంతకుపూర్ఫమో, శివకవుల జాంతెనుగు ఉద్యమం తలయెత్తి ఉంటే తెలుగు సాహిత్య భాషా స్వరూపం మరొక విధంగా తన కాళ్ళమీద తాను నిలబడ కలిగియుండును. సంస్కృత సహాయం లేకుండా వర్దిల్లి యుండును. కాని అట్లా జరుగలేదు. జాను తెనుగు అను పేరుతో సంస్కృత భూయిష్టం కాని దేశ బాషను వ్రాయాలని ఉద్దేశించిన శివకవులు కూడా సంస్కృత ప్రాబల్యాన్ని త్రోసిరాజు అనలేక పోయాదు. వారు కూడా సంస్కృత బాహుళ్యాన్ని నిరసిస్తూనే దీర్ఘ సమాస భూయిష్టమైన శైలిని తమ కావ్యాల్లో ఆదరించారు. భాషా విప్లవాఅదియైన పాల్కురికి సోమనాధు?డు గీర్వాణ భాషా శృంఖలాన్ని వదిలించుకోలేకపోయాడు. అనగా అతని కాలానికే తెలుగు భాషమీద సంస్కృత ప్రభావం స్థిరపది పోయిందని విశదమవుతూంది. ముందు ముందు దీనిని యింకా చర్చిద్ధాం.
             సాహిత్యం - ముఖ్యరాసులు

సాహిత్యభాష విషయంలో మూడు ముఖ్య ద్రవ్యాల్ని పరిగణించాలి.

1. కవి, అతని చిత్తవృత్తి