పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

67 రక్తపాతము

ధర్మానురక్తిచే సర్వము త్యజించువారికి పుత్త్రబలి లెక్కా? ఆ బలిమూలమున త్యాగమందు గౌరవము, ధర్మభావమును పరిపూర్ణత నొందడమే గాక మన కావీరులయెడ సానుభూతి జనించి వారివలనే ధర్మాసక్తీ విషయపరాఙ్ముఖతయూ మన హృదయముల మట్టుకొనును. అట్టియెడ పుత్త్రబలి పూరికైన సాటికాదు.

ఆర్యధర్మానురక్తి కేవల ఋషి చరితములందే కాక క్షాత్త్రవీరులందున్నూ కనబడును; పురాణములు చదివిన ఈవిషయము విశదమగును. కౌరవపక్షమున సమరా వేశుడై యుండుతరినికూడా కర్ణుడు దానవీరుడు కావున ధర్మ పాలనమున అకుంఠితుడై, అమోఘములగు తన కవచకుండలములను ప్రతివీరపక్షపాతియు వంచకుడునగు ఇంద్రున కిచ్చెను. ఇది విన్నవారికి థార్మికోత్తేజనము కల్గదా? ధర్మాను రక్తి అతిశయింపదా? దీనిమూలమున మానవప్రకృతి దోషాయత్త మగునా? లేక ఉన్నతధర్మాసక్త మగునా? ధర్మమునకును దానవీర్యమునకును మానవుడు సర్వస్వపరిత్యాగ మొనర్పవలయు నను విధి నిర్ధారితము కాలేదా?

ఇక ఉపపాండవుల హత్య - ఇది దుర్యోధనుని ఆసుర ప్రకృతియందు జనించిన పాపవ్యాపారము. ఇది ఘోరమనియు తామసికమనియు వ్యాసుడే వ్యక్తీకరించెను. ఈఘటనను పరివర్తన మొనర్చి పాపసమ్మార్జనము చేసి శిక్షాప్రదమగునట్లు కొందరు కావించిరి. ఆత్రమున జరిగెను కదా