పుట:Sahitya Memamsa, Sripada Kameshwar Rao.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66 సాహిత్య మీమాంస

కూడా ప్రవేసిస్తూన్నవి. ఇంటింటా పిన్నలు పెద్దలు వాటినే ప్రశంసిస్తున్నారు.

మహాభారత రామాయణములు చదివిన ఫలము

ఆంగ్లసాహిత్య పక్షపాతులు ఆర్యసాహిత్యమున మాత్రము హత్యలు మొదలగు హానికరములగు కృత్యములు లేవా అని యందురేమో? లేకేమి? పుష్కలముగా నున్నవి. కురుక్షేత్రసంగ్రామమున, రామరావణయుద్ధమున, ఉపపాండవుల వధయందు, శిబికర్ణదధీచుల దానములయందున్నూ హత్యలు తక్తపాతములును కలవు, కాని మన దృశ్యకావ్యములం దట్టివి కానరావు. శ్రవ్యములకూ దృశ్యములకూ ఈవిషయమున చాలాభేదమున్నది. ఇట్టిదృశ్యము లార్యదృశ్య కావ్యములలో లేకుండుటచే కురుచిప్రచార మార్య సాహిత్యదర్శమున లేదని చెప్పవచ్చును.

రామాయణ మహాభారతములు పఠించుటవల్ల ఫల మత్యంత శుభావహము. ప్రకృతమున మనసంఘమున ప్రబలియున్న ధర్మప్రభావము ఈగ్రంథములు చదువుటవలన కలిగిందని నిశ్చయించవచ్చును. ఈ రెండుగ్రంథముల జీవరూప మగు ధర్మతేజము ధర్మబలమున్నూ మనసంఘమునకు మూలాధారములై బరగుచున్నవి. దానవీరులు పుత్త్రబలి నొసగడము జూచునపుడు మన మానసములను ధర్మప్రభావ మావేశించి తదితరభావముల డిందుపరచును. వారి దాన వీర్యము ధర్మాసక్తియు మనల భక్తిపరవశుల జేయును.