పుట:SaakshiPartIII.djvu/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

13. పురుష ప్రయత్నము

పూర్వం ఒకసారి దశావతారాల గురించి ఉపన్యాసం ఇచ్చిన పిచ్చి మనిషిని చూడడానికి, మళ్లీ ఏమైనా చెపితే వినడానికి జంఘాలశాస్త్రి వెళ్లాడు. ఆయన పేరు ముష్టిచిట్టి వీరయ్యశాస్త్రి. అద్వైత విద్వాంసుడు.

పురుషకారం గురించి చెప్పమని జంఘాలశాస్త్రి ఆయన్ని అడిగాడు. అంటే ఈ ప్రపంచంలో స్వతంత్రంగా మనిషి చేసే ప్రయత్న మన్నమాట. దేనిగురించైనా ప్రయత్నాలు చేస్తాడు కదా! ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు.

దీని మీద వీరయ్యశాస్త్రిగారు చెలరేగి మాట్లాడాడు.

ఫలానికి పురుష ప్రయత్నం కావాలంటున్నావు. మళ్లి, అదే పూర్తిగా చాలదు, దైవ ప్రయత్నం తోడుపడాలంటున్నావు. అంటే దైవప్రయత్నానికి క్రింద చోటుగా పద్నాలుగు పాళ్లు పురుష ప్రయత్నం ఉండాలంటూవు! పూర్తిగా పురుషకారాన్నేగా గౌరవించాలి. పూర్తిగా దైవ ప్రయత్నాన్నేగా గౌరవించాలి. రెండింటిని తగల బెడుతున్నావు. పురుష ప్రయత్నం ఏమీ లేకుండా కేవలం దైవప్రయత్నాలేవీ లేవంటావా! పిడుగుపాటు, తుఫాను, భూకంపం వంటి వాటకి కారణం ఎవరి ప్రయత్నం!

ప్రపంచంలో ఒకేఒక్క అద్భుతశక్తి వుంది. అదే సర్వత్రా వ్యాపించి వుంది. మిగతా శక్లే ఇన్నివిధాల బహిర్గతమవుతోంది. అంతా అంధకారం. అంతా ఇంద్రజాలం. అంతా కల. అందులో బుద్ది వున్న వాళ్లమనుకొని స్వభావం కాని ప్రయత్నంతో మనం తిరిగే తిరుగుడు 'నిద్రలో తిరుగా డడం” దీని మీదే మనవాళ్లు సగుణ తంత్రాన్నంతా నిర్మించారు అని -ముగించాడు. మొత్తం మీద “మానవ ప్రయత్నం' అనేది ఒక మిధ్య అని తేల్చాడు.

జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.

నాయనలారా! దశావతారములఁగూర్చి యుపన్యసించిన పిచ్చివానిని జూడ మొన్నను వైద్యశాల కేంగితిని. ఆపిచ్చివాఁడు తనగది వెలుపలఁ గూరుచుండినాడు. నన్నుఁజూడఁగనే నమస్కరించినాఁడు. ఆశీర్వదించి నెమ్మదిగా నున్నదా యని యడిగితిని. రవంత పొడుమి