పుట:SaakshiPartIII.djvu/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ్మని సంజ్ఞచేసి చేయి చాంపినాఁడు. నాయొద్ద నస్యము లేదయ్యా యని యంటెని. ఆవలికిం బొమ్మను నట్టాతండు సంజ్ఞచేసినాఁడు. ఏదైన నుపన్యాస మిమ్మని యడిగితిని. పొడుము తీసికొనివచ్చి మరిమాట లాడవోయి పూల్ ఆమాత్రపు పరేంగితజ్ఞాన మక్కఱలేదా? నోరార్చుకొనిపోయినప్ప డక్కలకఱ్ఱ, ముక్కులార్చుకొనిపోయినప్పడు పొడుము, ఇంతకంటెఁ బరమహంసక్రియలు మరెక్కడివి? Well get up Right about turn March, left right left right అని యాతండు లేచినాడు గదిలోపలికిఁ బోవునేమో! పోయెనయెడలం దిరుగరాఁడేమో యని భయపడి " అయ్యా! ఇక్కడనే కూర్చుండుడు. ఒక్కనిముసములో నస్యము తెచ్చి యిచ్చెదను. అని పరుగెత్తి నస్యము తెచ్చి యాతని కిచ్చితిని. రా! ఆలాగున దారిలోనికి రా. అంతే! మన మనంగాఁ బ్రజకు గడగడ. ఆమాత్రపుఁ బటుత్వము లేకుండ నన్నికోట్ల జనమును బరిపాలించుట లేదయ్యా. ఇప్పటి ప్రజలు తమంతం దామే పరిపాలించు కొందురట! వెఱ్ఱిముండకొడుకులు! తమంతం దాము తినవచ్చును. తమంతం దాము భార్యయొద్ద బండుకొనవచ్చును. అంతే కాని తమంతం దాము పరిపాలించుకొనుట యేమోయి? మతిలేనిమాట! పరిపాలకుఁడు వేరు. పరిపాలితుడు వేరు. ద్వైతవిష్టాద్వైతము లంగీకరించిన యంశమే కాదా? వారిద్దఱకు భిన్నత్వమే. ఇద్దఱకు తేజస్తిమిర న్యాయమే. తాను తానునై మరియొకడు గూడ నగుట యెట్టు సాధ్యము? ఇందులో నున్న తిరకాసు కనిపెట్టితివా? తన్ను తా నెందులకుఁ బరిపాలన చేసికొనంగూడదు. అది నీవు నాతో వాదింతువా? మాటలాడ వేమి? ఓ! వాదభిక్ష నిచ్చుటకు సిద్దముగా నున్నాము. పెట్టు, నీమాధుకరపు జోలియక్కడం బెట్టు. అదిగో పెట్టుమనంగాను! తన్నుఁ దాను పరిపాలించు కొన్నవాడెంతవాఁడయ్యా? అట్టివాఁడు పాప భూయిష్టమైన భారతదేశమున కర్హుడా? పరమపదమున కర్హుండా? ‘అహందేహో నచాన్యోస్మి, బ్రహ్మైవాహం నశోకభాక్, సచ్చిదా నంద రూపోహం, నిత్యముక్త స్వభావవాన్."

"అయ్యా! అయ్యా! ఈపనికిమాలిన గొడవ నాకెందులకు? ఏదైన విజ్ఞానబోధ మొనర్పఁదగు నంశమునుగూర్చి యుసన్యసింపుము. ఎంతయో ప్రయత్నముచేసి నిన్నుఁ జూడవచ్చితిని" అని నే నంటిని.

తప్ప తప్ప, నన్నుఁ జూచుటకు నీవు ప్రయత్న మొనర్చితివా? నీవు ప్రయత్నము చేయుట! ఓ! ఎంత యహంకారివి! నీకేదైనఁ జేయుటకు స్వాతంత్ర్యమున్నదనుకొనుచు న్నావా? కన్ను లెంతమీఁదికి వచ్చినవి! నీవు నన్నుఁ జూచుటకు గొప్ప ప్రయత్న మొనర్చి తివా? సరే, మాట వరుస కొప్పకొందము. నేను నీకొఱ కేమి ప్రయత్నము చేసితి నని నీవు నాయెదుటికి వచ్చితివయ్యా? నీవైపునఁ బ్రయత్నము కావలసినపని నావైపున నప్రయ త్నముగ నేల యయ్యెను. పరమార్థ మేమనఁగ నిద్దఱవైపునఁగూడ బ్రయత్నమే లేదు. ప్రయత్నము చేసితినని నీయందుఁ గర్తృత్వమును బుద్దిహీనుఁడవై యారోపించుకొనుచు న్నావు. దైవశక్తి మహిమను నమ్మి నేను కిమ్మనకుండ నూరకుంటిని.

"అదేమి? అదేమి? ప్రయత్నము లేకుండ కార్య మెట్టగును? పురుషకార మని వినియుండలేదా' అని నే నంటిని.

పురుషకారమా? స్త్రీకారముకాదేమి? అర్ధములేని మాట లావలికిఁ ద్రోచివేయవోయి! వైష్ణవసంప్రదాయపుఁ జచ్చుమాటల ద్వైతసిద్దినొందినవానియొద్ద నఁటోయి! చిత్రాన్నము '