Jump to content

పుట:SaakshiPartIII.djvu/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గప్పగంతులలో నాకర్షణపు టీలలలో గుఱ్ఱపు సకిలింపులలోఁ బొంచి కాచుటలలో నట్టె గ్రహించుటలలో నలికిడి ననుసరించి యిట్టె పరిహరించుటలలో మీకు నిత్య మగుచున్న కాలక్షేపపు గడియలు నాలుగే యథార్థముగఁ గృతార్ధములైనవి. మీజన్మ రాహిత్యమున కెన్నఁటికైన నవియే తోడ్పడును. పురుషులైన మీకు మీసొంత స్త్రీలపై నింతవైరాగ్యము, నవ్యవ్యక్తిపై నింత యనురాగము వంటివె మీ స్త్రీలకు మీయందేల యుండంగూడ దనుజ్ఞానము మీ కున్నయెడల నింత యవకతవ కచర్య కవకాశముండునా? ఉభయపక్షముల వారు రాజీపడి యుందురా యని యనుకొనఁ దగినంత మితి మీఱి యున్నదే. అటులైనఁ జేపలశాల వెనుక నొక పక్షమువారు, మేరీపాఠశాల కెదుట నొకపక్షమువారు, విశాలరంగమునఁ జెఱి యొక వైపున నేకాంక నాటకము లాడుచున్నారా? అట్టి మీమహానంద మున కడ్డురాకుండ మాయుపన్యాసము నాఱు గంటలకు లోపలనే ముగించుకొందుము. మనుష్యత్వము పశుత్వమునకు దిగిపోవునంతవఱకు మీ రానందము ననుభవింపవచ్చును.

ఇట్టి నియమశూన్యత, యిట్టి నిరంకుశత, యిట్టిపనితనము, నిట్టి దిగదీంత, యిట్టికమము, నొక్క మీనీతియందే సిద్దించినవా? దేహశక్తి యందో మనశ్శక్తియందో హృదయశక్తియందో యాత్మశక్తియందో కల్పమునందో గానమునందో చిత్రలేఖనమునం దో-యిప్ప డవియన్నియు నేల? సోదరులారా! ఒక్కటే ప్రార్థన-ఏవిషయమును గూర్చి యొప్ప డేవిసరువచ్చునో చూతమను తలంపుతో మాయందు నిశ్చలదయ గలవా రయి సారస్వతానుబంధమునకై యుత్సాహముతోఁ గనిపెట్టుకొని యుండవలయును. సారస్వతా నుబంధ విజయము మీయాదరణములలో నున్నది. కాని మావంటివారిలో లేదు. సారస్వతా నుబంధ మంత మహాదీప్తితోఁ బ్రకాశించును. మాకధికారి యగు సాక్షియొక్క తత్త్వమును నేను గొంత యెఱిఁన వాంను గావున నిట్టిమాట లనుచున్నాను. నేను గేవలము శక్తిహీనుఁ డను. సాక్షి నాయందలి యనురాగముచేత సూచించు సూచనలనుబట్టి యాకాశమంత నోటితో నే నుపన్యసింతును. అదియే నాలోని విశేషము. అది లోపమందురా? మీయిష్టము. సోదరులారా! మొదటిసాక్షి యట్టే దీర్ఘముగ నుండఁగూడదు కావున సెలవు.

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః.