12. సాక్షిసంఘ పునరుద్ధారణ
సాక్షిసంఘాన్ని పునరుద్ధరించే ప్రయత్నం మరోసారి జరుగుతోందని జంఘాలశాస్త్రి చెపుతున్నాడు. ఆంధ్రపత్రికలో సారస్వతానుబంధానికీ, సాక్షికీ అటువంటి సంబంధం ఏర్పడిందనీ, సారస్వతానుబంధం జరుగుతున్నంతకాలం సాక్షి సభలు జరగవలసిందేననీ సాక్షిసంఘం భావిస్తోంది.
గత పది సంవత్సరాలనుండి సాక్షి వృద్ధుడైనప్పటికి కూడ దేశాటనం చేస్తూనే వున్నాడని, రకరకాల ప్రదేశాలు, అక్కడ రకరకాల మనస్తత్త్వాలు పరిశీలిస్తేనే వున్నాడనీ జంఘాలశాస్త్రి చెప్పాడు. ఈమధ్యనే తటస్థించింది. కనక-అక్కడ రకరకాల విభిన్న అంతస్థుల మనుషుల్ని గురించి కూడా మంచిచెడ్డల్ని ముచ్చటించుకునే అవకాశం కొత్తగా ఏర్పడింది.
ఇంకో విశేషం కూడా వుంది. ఇక ఈఉపన్యాసాలు సత్యపురంలో కాక, మద్రాసులో సముద్రతీరంలో జరుగుతాయి. ప్రతి శుక్రవారం సాయంకాలం ఉపన్యాసం జరిగి ప్రతి శనివారం సారస్వతానుబంధంలో ప్రచురణ జరుగుతుంది. సముద్రతీరానికి విహారం కోసం వచ్చేవారి సొంత ప్రవృత్తులకీ, వారి కాలక్షేపాలకీ, ప్రలోభాలకీ, ఏ బంధం కాకుండానే ఆరుగంటల లోపలే ముగిసిపోతాయని జంఘాలశాస్తి "హామీ ఇచ్చాడు. ఏ సమయంలో, ఏవి షయం ప్రస్తావనకు వస్తుందోననే నిశ్చల దయతో సారస్వతానుబంధం చూడవలసిందిగా ఆంధ్ర మహాజనానికి శాస్త్రి విజ్ఞప్తి చేస్తున్నాడు.
'సాక్షి’ తమను నడిపే చైతన్యమూర్తి నాయకుడు అనీ, అతని సూచనలను బట్టి తన ఉపన్యాసాలుంటాయనీ జంఘాలశాస్త్రి విన్నవించాడు.
జంఘాలశాస్త్రి యిట్టు పలికెను.
ఆంధ్రపత్రికలోఁ దిరుగ సారస్వతానుబంధము శ్రీపత్రికాధిపతి ప్రచురించుచున్నం దులకు మహానంద మొందితిని. సారస్వతాను బంధమునకు సాక్షికిఁ గల సంబంధము సర్వాంధ్రలోకమునకు విదతమే. సారస్వతానుబంధ మున్నచోట సాక్షి యున్నాఁ డన్నమా టయే. సారస్వతానుబంధము జరుగుచున్నంతకాలము సాక్షి సభలు జరుగవలసినదే.