పుట:SaakshiPartIII.djvu/90

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జంఘా- కాలాచారీ! ఇఁకఁ జాలించు. స్త్రీపురుషభేదము నీ మనస్సున కెక్కలే దని చెప్పితివి కదా! నాలుగేండ్లక్రిందట వివాహమాడుటకు దక్షిణదేశయాత్ర పోయి యక్కడ నీయలౌకికచర్యలచేఁ గారాగృహప్రవేశ మంది చావునకు సిద్దమయితివే. జ్ఞప్తి లేదా?

కాలా- అప్పడు నేను బుద్దిపూర్వకముగఁ బోయితి ననుకొంటివా? ఏదో యితరుల ప్రోత్సాహముచే నట్టు జరిగినది?

జంఘా- సరే. నీయభిప్రాయ మేమని నిర్ణయించెదవు?

కాలా- నాకుఁ బ్రత్యేకాభిప్రాయ మేమియు లేదు. పెద్దల యభిప్రాయమే నాయభిప్రా యము.

జంఘా- అది యేదో స్పష్టముగఁ జెప్పము.

కాలా- వాణీదాసుఁడు చెప్పినట్లు స్త్రీని జేర్చుకొనకుండిన మంచిది. నీవు చెప్పినట్టు చేర్చుకొనినను మంచిదే.

జంఘా- సరే నీయభిప్రాయము నపుంసకము కావున నది గణింపబడదు. వాణీదాసా! స్త్రీని జేర్చుకొనవచ్చుననియే సాక్షి యభిప్రాయము. ఆయభిప్రాయ మీలేఖమీఁదనే వ్రాయఁబడియున్నది. హెచ్చుసంఖ్యగల సభ్యులచే నామోదింపఁబడుటచేత స్త్రీని జేర్చుకొ నుటకే నిర్ణయింపఁబడినది.

వాణీ- సాక్షియభిప్రాయ మట్టున్నదని మొదటనే ఏల చెప్పలేదు.

జంఘా-ఇదిగో మeటియొక లేఖ-గంజాము జిల్లా-నరసన్నపేట పోస్టు-ఉర్ధాము గ్రామము నుండి యీలేఖ వచ్చినది. దీనిని జదివెదను.

సాక్షికి నమస్కారములు.

అయ్యా! మీరు చిత్రలేఖకుల దిగంబరవిగ్రహములఁ గూర్చి యిచ్చిన యుపన్యాసము లోని సంగతు లన్నియు బాగుగాఁ దెలిసికొంటిని. ఉపన్యాసము బాగుగనే యున్నది. అట్టిదోష మెంతశీఘ్రముగఁ బరిహరింపఁబడునో చిత్రకళ కంత క్షేమము. కొందరు స్త్రీలు కూడ నట్టివిగ్రహములను జిత్రించుచున్నారని తెలియు చున్నది. ఇది మరింత ఘోరము. ఇప్పటి చిత్రలేఖకు లేవో పిచ్చియూహలు పెట్టుకొని, చిత్రించుచున్న కన్నులనుగూర్చి యుపన్యసించెద నని చెప్పియున్నారు. ఆయుపన్యాసము కొఱకు వేచియున్నాము. తప్పకుండ నట్టి యుపన్యాసము త్వరలో వెడలవలయును. వారు చిత్రించుచున్న కన్నులను జూడ నెంత రోఁతయైనఁ గలుగుచున్నది. మీరు ముఖ్యముగా విమర్శింపవలయును. అదిగాక వంగీయకళ తప్పకుండ మీవిమర్శనమునకు గుఱి కావలసియున్నది. కాని యొకసంగతి. అనడుమను: గొంతకాల మెండి మొండైన చిత్రకళ నూతనముగ నిప్పడే యుజ్జీవింపబడు చున్నది. లేలేఁతరెమ్మలు వైచుచుఁ జిగుర్చుచు మొగ్గదొడుగుచు నెదుగుచున్నది. మీవిమర్శనము కేవలము ఖండకముగా నుండక, కొంత పరిపోషకముగా నుండవలయు నని చెప్పచు న్నాను. వెఱ్ఱిరవెఱ్ఱి తలలను గఱకు కత్తితోఁ దెగనఱకగూడ దని నాయభిప్రాయము కాదు. అట్టినఱకు వలన, మిగిలిన చెట్టు మునుపటికంటె బలముగలదియై, మునుపటికంటె