పుట:SaakshiPartIII.djvu/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ్యాప్తికలదియై, మునుపటికంటె హెచ్చుచిగుళ్లు, హెచ్చు మొగ్గలు కలదియై యుండునట్టు మాత్రము చూడవలయును. అది నాకోరిక.

మరియొకసంగతి-ఆడుదాని మర్యాదకు భంగకరములైన పటములను జిత్రించు చిత్రలేఖకులను భారతమాత చేతికొరడా వ్రేటున నట్టిశిక్ష కర్హతరులైన కవుల నుపేక్షించి, చిత్రలేఖకులమీఁదనే మీరు దాడివెడలుట తగదు. ఆడువారి యవయవరహస్యముల బయటబెట్టుటలోఁ గవులకుఁ జిత్రలేఖకు లందుదురా? ఒక్కొక్క యవయవమున కెన్నేసి పద్యములను జెప్పినారు. వారు వర్ణింపని యవయవమున్నదా? చిత్రలేఖకుల పటములలో నాభి కానబడుచున్నదని మీరు వారి సంతతీవ్రముగ విమర్శించితిరే! నాభిపై నొక్కొక్కకవి యెన్ని యెన్ని శ్లోకముల నెన్నెన్ని పద్యములఁ జెప్పియుండలేదు? చెలమలని, దిగుడుబావు లని, కొండబిలము లని మఱి యేమో యని యెన్ని వర్ణనములు కవులగు వారొనరించి యుండలేదు? అంతట నాగిరా? నాభిపై నున్ననూగారు, దిగువనున్న నూగారుగూడ వర్ణింపలేదా? “నూగారు గూఢపదమా చెలికిన్" అన్న వా రెవ్వరు? ఇంకఁ బయోధర వర్ణనములకు హద్దుపద్దున్నదా? మనసులోని యుబలాటము తీఱునట్లు, నోటికసితీఱు నట్టు, చేతిదురద తీఱునట్టు పయోధరవర్ణనము లెంతబహుళముగా గ్రంథములందు వ్రాసినారు? ఎంత పెద్దవి యని చెప్పినను హృదయమున కింక సంతుష్టి లేక, అబ తీజక, తాటకాయ లని, కుండ లని, కొండ లని, వారిమొగ మని మొఱపెట్టినవా రెవరు? కవులు కారా? పిరుదులను వర్ణింప కుండిన కవి యొక్కడైన నుండెనా? అవి పెద్దదిబ్బ లని, యిసుకతిప్పలని, మెట్టులని, గుట్టులని వర్ణించి వర్ణించి, యంతటితో దయ్యపు టాకలి శాంతింపక పోవుటచే, భూవలయముతో వాని నంట గట్టలేదా? కాంతల రహస్యావయవము లను వర్ణించుటలోఁ గవుల కున్న రాక్షసవాంఛ చిత్రలేఖకుల కున్నదా? పిరుదులవర్ణనలతో సరిపుచ్చిరా? ఎందులకు సరిపుత్తురు? సరిపుచ్చి యూరకుండఁగలరా? సరిపుచ్చి బ్రదుకగ లరా? సరిపుచ్చి కవు లనిపించు కొనఁగలరా? ఆకారముకాదు, రంగుగాదు, మఱియేదో కాదు, ఇంకేదో కాదు-ఎన్నెన్ని వివరములతో నోపికగా, శ్రద్దగా, భల్లూకపుబట్టుతోఁ దలఁపఁగూడని యవయవములను, గానరాని యనయవములను మనయదుటఁ బెట్టలేదు; పోనిమ్ము. అంతటితో నాగిరా? ఆగుటే? హాహాకారమెత్తి నప్ప డాగుటే-స్మరింపరాని సంభోగవర్ణనములను సంతనగ సాపుగ సముజ్జృంభణముగ సాగింపలేదా? అంతటితో నయిన శాంతిపడి మిన్నక పడియుండిరా? ఊహుఁ “పునారతికౌతుకంబుతో లేచి గంటములు చేతఁ బుచ్చుకొని బింకముగఁ గూరుచుండిన ముసలికవు లెందరు? ఈ ఘోరచర్యలోఁ దిరుగవేసి మఱుఁగవేసి, ఉల్టాసీదాల సౌభాగ్యము జూపినవారెందరు? చీ చీ! ఏచిత్ర లేఖకుఁడయిన నిట్టిసన్నివేశమును జిత్రించి సంతలోఁ బెట్టినాఁడా? ఈమోట మొండివ్యాపా రమునఁ గవులకంటెఁ జిత్రలేఖకు లెంతతక్కువ? చిత్రలేఖకులు కొరడా వ్రేటుల కర్హులయి నప్పడు కవులు కొఱత మేకుల కర్హులు కారా?

ఆంధ్రకవిత్వములో మాత్రమే యిట్టున్నదా? సంస్కృతములో నింతకంటె బా గేమైన నేడ్చిన దేమో యని చూడఁగ, నది యింత కంటె నధ్వాన్నముగ నున్నదే. జగన్మాతల స్తవరాజములలో గుహ్యాంగకములకుఁ బ్రత్యేక మొక్కొక్కస్తబకమా? తల్లిదండ్రు లగుపార్వతీ పరమేశ్వరుల సంభోగమును వర్ణించుటకు సాహసించినవారు సంస్కృత