పుట:SaakshiPartIII.djvu/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాక్షికి-నమస్కారములు-మీసంఘమున నిదివఱ కైదుగురుండెడివారు. ఇప్పడు మీతో నల్వురే యున్నారు. అయిదవవారి నెవ్వరి నైనఁ జేర్చుకొనుట కుద్దేశ మున్నదా? అట్ టియుద్దేశము మీ కుండునెడల స్త్రీని జేర్చుకొందురా? ఆస్త్రీ సత్యపుర గ్రామవాసినియే యైయుండ వలయునా? అక్కఱలేదా? ఈసంగతులు నాకుదెలుపగోరెదను.

చిత్తగింపవలయును, విధేయురాలు, సి. బాలనాగమ్మ, ఆనెగొంది, కమలాపురము పోష్టు, బళ్లారి జిల్లా.

సోదరులారా! ఈలేఖను వింటిరా? ఈసోదరీమణి మన యుపన్యాసములను విని సంతోషించుటయే కాక, మనసంఘములో నొక సభ్యురాలై మనసంఘోద్దేశ నిర్వహణకార్య మునందు మనకు సహాయయై శ్రమపడు చుండుట కుత్సహించుచున్నట్లు తోఁచుచున్నది. బళ్లారి జిల్లాలోనున్న హేతువుచేత నెప్పడో కాని మన కామె దర్శనమిచ్చుట కవకాశము లేనిదైనను, దనయభి ప్రాయములను దఱచుగ మన కామె పంపవచ్చును. అందుచేత నామెను జేర్చుకొనుటయే నాయభిప్రాయము, వాణీదాసా! నీ వే మందువు?

వాణీ- స్త్రీని సభ్యురాలిఁగఁ జేసికొనవచ్చునని మనసంఘ శాసనములలో నున్నదా?

జంఘా-చేర్చుకొనఁగూడ దని లేదు.

వాణీ- స్త్రీని గూర్చిన ప్రసక్తియే లేనప్పడు స్త్రీనిఁ జేర్చుకొనుటకవకాశముండదు.

జంఘా-సభాశాసనములకు విరుద్దము కాని పనిని జేయుట తప్పకాదు.

వాణీ-సభాశాసనములు చెప్పనిపని చేయుట తప్ప.

జంఘా-కవీ! మొండివాదము చేయకుము. మనసోదరీమణు లిప్పడు మిగుల నున్నతదశలలోనికి వచ్చుచున్నారు. విదుషీమణు లగుచున్నారు; గాయనీమణు లగుచు న్నారు; కవయిత్రు లగుచున్నారు; చిత్రలేఖిక లగుచున్నారు. వక్తృత్వమున వారిని మించిన వారు లేరనిపించుకొను చున్నారు. శాసనసభలలో, సంఘసంస్కరణసభలలో, మతవిషయక సభలలో, న్యాయసభలలో, రాజకీయసభలలో సభ్యురాండై లోలాక్షీమణు లెందఱు లోకక ల్యాణమునకుఁ దోడుపడుచున్నారో నీవెఱుఁగుదువా? స్త్రీలు సర్వసభలలో సభ్యురాం డ్రుగ నుండుట సభలకే కాక దేశమునకుఁగూడ నలంకారము. అందుచే నామె కోరునెడలం జేర్చుకొనుటయే నాయభిప్రాయము.

వాణీ- నాయభిప్రాయమేదో చెప్పితిని. మార్చుకొనవలసిన కారణము నాకగపడలేదు.

జంఘా-కాలాచారీ! నీయభిప్రాయ మేమి?

కాలా- నాయభిప్రాయమున కేమున్నది? నాకు స్త్రీయైన నొకటే, పురుషుఁడైన నొక్కటే, ఆరెంటిలో భేదమేదో నామనన్సున కెక్కలేదు. వేదాంతశాస్త్ర మాత్మకు లింగము లేదని చెప్పచున్నది. పైస్వరూపమువలననే యీ వ్యక్తి యాఁడుది, యీవ్యక్తి పురుషు డని పామరులు గ్రహించుచున్నారు. కాని పరమార్ధ మాలోచింపఁగ స్త్రీ పురుష భేదము లేనే లేదు. అందుచేత