పుట:SaakshiPartIII.djvu/86

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాచికొనుటయందు వీరి కున్న శ్రద్దలో సగమైన మందాగ్నిని గుదుర్చుకొనుటలో వీరి కున్నయెడల వీరి కొంటిపూటసాపాటు లుండునా? భర్తల కణాబిళ్లలపై సంతకము లుండునా? బిడ్డల కూసరపాట్టలు సుద్దకట్టు లుండునా? అగ్నిమాంద్యమున కాయుర్వేదౌష ధములు సేవింపలేక, యథావిధిగాం బథ్యము సేయలేక, జిహ్వాచాపల్యము నడఁచుకొనలేక, యంతకంతకు రోగవృద్ది చేసికొను చున్నారు. మన మందులు మంచివి కావని మహర్షులను దిట్టుచున్నారు. ఆసుపత్రులకుఁ బోయి యానీ రీనీరు త్రాగుచున్నారు. దొరసానులచేఁ బరీక్ష చేయించుకొనుచున్నారు. వారిచేఁ గడుపు కోయించు కొనుచున్నారు. మరణో న్ముఖలై బిడ్డల పుణ్యమున మరల బ్రదుకుచున్నారు. మందాగ్ని తగ్గినదా? దేహమునకుఁ బాటవము తగ్గినది. నరములలో శక్తితగ్గినది. మొగములోఁ దేజస్సు తగ్గినది. కంటికి దృష్టి తగ్గినది. మనస్సులో నుత్సాహము తగ్గినది. బ్రదుకునం దపేక్ష తగ్గినది. అంతేకాని మందాగ్ని తగ్గుటే! జిలజిల మని జిల్లుమని జాఠర రసములు కడుపులోని కూరుట లోనికిఁ దీసికొన్న రసాయనము వలనను, గల్పముల వలనను గలుగవలయును గాని కత్తికోఁతవలనఁ గలుగునా? భగవంతుని నిర్మాణము ననుసరించి కడు పెట్టున్నదో దాని నష్టే యుండనీయ వలయును గాని దానిని మామిడికాయతరిగినట్టు తరిగితరిగి కుట్టి దానిని గురూపను జేసినతరువాత నది సహజమైనపని చేయఁగలదా? భగవంతుఁ డేర్పఱచిన సంచలనము దాని కిప్పడు చెడినదా లేదా? లోని యాహారమును నొక్కగలశక్తి, నలుపఁగల శక్తి గిరగిర త్రిప్పంగలశక్తి ముందునకుఁ ద్రోయ గలశక్తి కత్తివ్రేటు తిని కుట్టుపడిన కడుపునకు దైవసం కల్పమున నుండిన ట్లుండుట కవకాశ మున్నదా? పంటకుసి (దంతకుసి) కత్తిచేఁ గోయించుకొనుటచే దౌడపై నరయంగుళము లొట్ట యున్నవాఁడు సెనగలు నీయంత విశృంఖలముగ నమల గలఁడా? ఏయవయవమునకుఁ గత్తికోఁత కలిగినదో యాయవయవములో దీఱనిలోపము చేరిన దన్నమాట. మూలశంకరోగమునకు శస్త్రచికిత్స చేయించుకొన్నవాని కాసనరం ధ్రము మునుపటికంటె శాశ్వతముగాఁ దగ్గినదా లేదా? గంటల కొలఁది వీరు పెరళ్లలోఁ గూరుచుండి విరేచనము తెమలక పోవుటచేత, నెంతకు సంతుష్టి లేకపోవుటచేత బ్రదు కెల్ల భ్రష్టమైనదని యేడ్చుచున్నారా లేదా? మూలశంక నిర్మూలన మైనమెడల నీయేడుపులు గణింపవలసిన పని లేదు. పోయినదా? ఆ. సొమ్ము-సుఖమొందుదు మనునాశ–అంతేకాని యది పోవుటే? తిరిగి పిలుక బయలు దేరుచున్నదే. గులాబికొమ్మ మొదలంట గత్తిరించి తిమి. తిరుగ నంకురించినదా లేదా? మొవ్వులోని కనటిని నఱకి వైచితిమి-తిరిగి మొలకెత్తి నదా లేదా? "కాటరైజు’ (కాల్చుట) చేసితిమికాన నింకరాదని వైద్యులు చెప్పినమాట నమ్మవలదు. భూమిని గాల్చివైచినను జికిలింత మొలవలేదా? చీపురుమొక్క తలయెత్త లేదా? కాల్చుటచేత మరింత శీఘ్రముగ, మఱింత యెత్తుగ నంకురించినది. అటులే కడుపు కోయుటచేతనే యజీర్తి మఱింత వృద్దియగుచున్నది.

కడుపులో గుల్మములు, గడ్డలు మొదలగునవి యన్నియు లోనికౌషధమును తీసికొని కరఁగించుకొని నిర్మూలించుకొనఁ దగినవేకాని కత్తిచేఁ గోయించుకొన దగినవి కావు. తాత్కాలికమగు దోషమే కత్తిని వారింపఁగలదు కాని దోషకారణమును నాశమొనర్పఁగలదా? కారణమును గనుఁగొని దానిని భేదించిన యెడలఁ గార్యముఁ నాశనమగును గాని కార్యమును దొలగించినయడల గారణము నశింపఁగలదా? చింతచెట్టును జంపఁ దలంచినవాఁడు తల్లివేరు తెగ వ్రేయవలయును గాని చింతాకు దూయునా? ఈసందర్భమున నొక్క సంగతిమాత్రము చెప్పి విరమింతును.