Jump to content

పుట:SaakshiPartIII.djvu/84

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తిరుగాండ మొదలిడినాఁడు. మహారాజు ప్రాణముపై మహారాజు వైద్యుల కందల కంతయభి మానము, నంతయాదర ముండవలసినదే. కాని చికిత్సా పద్దతియం దంతకంటె తెలివిమాత్ర ముండవలయును.

చిట్టచివరకు దేమనగా, చీటికి మాటకి శస్త్రచికిత్స చేయఁదగదు. శస్త్రచికిత్సాసా ధనము లాయుర్వేదమునం దక్కువగానున్న వని దాని నధిక్షేపించుట పరులయాచారమై యున్నది. అది దానికలంకము కాదు-అలంకారము. అది దానితప్ప కాదు-ఒప్పు. అది దానియధిక్షేపణము కాదు-అభినందనము. శస్త్రవైద్య మంతయావశ్యకము కాదనియే యాయుర్వేదాభిప్రాయము. ఏవో కొన్ని జాతి వ్రణములకు మాత్రమే యది యావశ్యకము. మిగిలిన వ్రణములన్నియు నోషధీమాహాత్యముననే మాన్పందగును. అంగసంఘాతములో నొక్కయంగము చెడిపోయి మిగిలిన యంగముల బాడుచేయు ననుభయము కలిగినప్పడు శస్త్రవైద్య మావశ్యకము. రాచపుంటికిఁ గూడ శస్త్రవైద్య మక్క ఆలేదు. శస్త్రవైద్యమునఁ గాని యది లొంగదను నభిప్రాయము సమంజసము కాదు. దాని కొక్కచిత్రమైనచికిత్సా పద్దతి కలదు. ఆకుఱుపు సంబంధమైన కదు మెంతవఱకు వ్యాపించునో యంతవఱకుఁ జట్టు నొకమూలిక పసరు రాయుదురు. కొన్నిగంటలైన పిమ్మట గోడమీదనుండి పిడుక యూడిన ట్లాభాగ మంతయు నొక్కదిమ్మలాగున నుండి పడిపోవును. పిమ్మట నామూలి కయే నూనెలోఁ గాచి యావ్రణమునకుఁ బూయుచుండ వలయును. కొలఁదిదినములలో మాను పట్టి మచ్చపడును. ఇది విచిత్రమైన చికిత్సాక్రమము. ఇట్టు చేయునాతండు జోలార్ పేటలో నున్నాడు.

శాస్త్రవైద్యము కోటి కొక్కమాఱు విధిలేకుండునప్పడు మాత్రమే జరిగింపవల సియుండఁగా నిప్పడు దాదాపుగా నన్నిరోగముల కదియే యవలంబించు చున్నారు. ఇంజెక్షను శస్త్రవైద్యము కాదా? నెత్తుటిలోనికిఁ బోయినది సూది యైన నేమి, కత్తి యైన నేమి? మందేమి, విందేమి-నోటిగుండం బోవవలసినదే. నోటి ద్రవములతోఁ గలసి పదనై పరిపక్వమై యుదరకోశములోనికిఁ బోవలసినదే. అచ్చట వివిధము లగుజాఠ రరసములతో మేళన మొంది రక్తములోఁ జేరి యన్ని కోశములందు సహజమై సంచలన మొంది సౌఖ్య మీయవలసినదే—ఈక్రమమా వస్థలలో మందున కేలోపము కలిగినను నది సహజమైన గుణ మీయదు. భగవంతుఁ డేర్పాటుచేసిన క్రమ మది. దానికి వ్యతిరేక మగుపద్దతి యసహజము కావున ననర్హము, అనుచితము. తాత్కాలికముగ ఇంజెక్షనువలనఁ గొంత గుణ మగపడినను నది ప్రబలాపాయమునకు ముందు ముందు కారణము కాకమానదు. ఇంజెక్షనువలని యపాయము లిప్పటి పాశ్చాత్యశాస్త్రజ్ఞలు కొందరుకనిపెట్టి యాచికిత్పాపద్దతికి నిరు త్సాహ మిచ్చుచున్నారు. మసూరిటీకాలుమాత్రము? వానియందు జనుల కెంతగౌరవ ముండెను? ఎంతనమ్మక ముండెను? పాశ్చాత్యులలోనే టీకాలు ప్రాణాపాయకరము లని వాదించు నొకతెగవారు బయలుదేరినారా, లేదా? అసహజములైన పద్దతు లన్నియు నప్పడో, యటుపిమ్మటనో యపాయకరములే; అనువినాశకము-అందుచే ననవలంబనీయ ములే, నిద్రకింజెక్షనా? నిద్ర కింజెక్షను తీసికొన్నవారికి రక్తమందసహజమైన వేడిమి బయలుదేఱికి పిత్తాధిక్య మొనరించి, కార్డెమును బాడుచేసి యెంత శాశ్వతమైన యపకృతి నాచరించినదో యెరుఁగుదువా? ప్రజల కన్నివిషయములందుఁగూడ శాంతి, యోపిక,