పుట:SaakshiPartIII.djvu/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కరణముకొఱ కైనది కావున మన కీరెండవది దాపురించినది. కావున మొదట బాగుచేసికొనవ లసినది దేశము కాదు, బుద్ది వదల్చుకొనవలసిన బానిసతనము దేశసంబంధమైనది కాదు, మనస్సంబంధమైనది. దేశములో నీవు లేవు-నీలో దేశమున్నది.

మఱియొక సంగతి. పుప్పిపటించే బాధపడునపు డేమిచేయుచున్నావు? దంతోద్ఘా టన ప్రవీణుఁడగు దామోదరన్ దగ్గఱకుఁ బోయి పంటినూడ దీయించుకొనుచున్నావా? -పంటిలోఁ బురు గూడం దీయుంపవలయునా? ప న్నూడఁదీయింపవలయునా? రేపు ముక్కునకు బాధకలిగినయెడల ముక్కూడం దీయింతువా? కంటిలోఁ బూవువేసిన యెడలఁ బూవును హరించుట వైద్య మగును గాని కంటిని బెఱుకుట వైద్యమగునా? ఏకోశ మున నైన దోషమేదైనఁ జేరునప్పడు దోషసంహరణ మొనర్చుట తగునుగాని కోశసంహ రణ మొనర్చుట తగునా? గోరుచుట్టు వేసినయెడల వ్రేలూడదీయవలసినదే! ఇది చికిత్సాక్రమమేనా? ఇది మనుష్యపద్దతియేనా? మనుష్యపద్దతి మాటయటుంపుఁడు. తోఁకపై నీఁగవ్రాలినయెడల దానిని వదల్చుకొనుటకై కుక్క తోకను జెటకాయించును గాని కొఱికివైచుకొనునా? అధమ ప్రాణిపద్దతికిఁగూడ వ్యతిరేకమైన యీ పద్దతి మనకెందులకు? పురుగు చేరినదంతమును బెఱికివేయుటే-పూచిననాల్కనుగూడ లాగించుకొనలేకపోయి నావా? దంతములో బురుగు నూఁడదీయుట కెన్ని చికిత్సలు లేవు? అవి యన్నియు నిరుపయోగము లనియే యెంచితివా? అట్టి చికిత్స లేర్పాటు చేసిన యవతారపురుషులు వెఱ్ఱిముండకొడుకు లనియే యెంచితివా? ఒక్క యోషధిలోని కాకర్షింపఁబడునే! ఎంతమహి మగల యోషధియో యొకసారి పరీక్షించుటకైనను నీకు బుద్ది పుట్టనప్పడు నీకు మొదలే బుద్దిపుట్ట లే దనుకొనవలయును గాని బుద్ది కొంతకాలముండి తరువాతఁ బోయిన దనుకొనుచున్నావా? వ్రణములలోని క్రిమిజాల మంతయుఁ బైని కట్టినమూలికలవలన వెలుపలికి వచ్చునే? మఱియొక చిత్రము: ఒకని కొడలినిండఁ గుఱుపులు వేసినవి. ఒకవైద్యుఁడు వచ్చి యొకమూలికను దెచ్చి దాని నాతని యొడలికిఁ దగిల్చి బురదనీటిలోఁ బ్రాతిపెప్టెను. రెండుదినముల కామూలిక చచ్చెను. వెంటనే రోగి శరీరమందలి కుఱుపుల న్నియు నంతరించెను. శరీరమందలి రక్తములో నున్న యాటవిక జ్వరసంబంధమైన క్రిమిన మూహమునుగూడ వనమూలికలు చంపగలవు. దినమునకు రెండుసారులు, దినము విడిచి దినము, మూడుదినముల కొకసారి వచ్చు చలిజ్వరము లవలీల నుచ్చాటన మొనర్పఁగల మూలికలు మన కుండ, రక్తములోనికి విషమును సూదితో నెక్కించుకొని తపించి తపించి యేలచావునకు సిద్దమగుదువు? నాడీస్థానమునఁ గట్టిన యోషధివలన నాళమందలి రక్తము లోని పురుగు చచ్చుచుండంగా దంతములోని పురుగుకొఱకు దంతమును గారుచే లాగించు కొంటవా? దంత మూడిపోయిన దనియు, దెఱపీని బడితిమనియు సంతోషించు చున్నావేమో కాని యందువరన నీనరములలో నెన్నిరోగములకు బీజము వేయ బడినదో గ్రహించుకొంటివా? మెదటికిఁ దగిలిన యదట్లువలన నీకుఁ దలతిరుగుడు రావచ్చును. ఉన్మాదముకూడ రావచ్చును. దృష్టి సున్న కావచ్చును. ముక్కునుండి రక్తస్రావము కలుగవచ్చును. ముఖమునకుఁ బక్షవాతము రావచ్చును. మూర్చ రావచ్చును. పన్నూడదీ సిన యుత్తరక్షణముననే పక్షవాతము వచ్చినవారిని, మూర్చవచ్చినవారిని నేను జూచితిని. ఒక్కమూలికతో నిర్మూలన మొందవలసిన పంటిరోగము కొఱకుఁ బ్రాణమున కింత ముప్పు తెచ్చుకొనుట తగునా?