“ఆముదముండగా నెనీమా (Enema) యెందులకు? కడుపులో నున్నకల్మషములు ద్రోచివైచుట కది మంచిదా, యిది మంచిదా? అధోమార్గమున నెక్కించిన నీ రేమాత్రము లోని కెక్కఁగలదు? ప్రేగుల చుట్టలోని చిట్టచివర భాగములోఁ గొంతవఱకేయొక్కగలదు కాని యంతకుఁ బై కెక్కగలదా? అందువలన నచ్చటి కల్మషమే తొలగి పోవును గాని పైనున్న ప్రేఁగులలోని కల్మషముమాట? నోరు స్వాధీనము కాకుండ నున్నప్పడు, పండ్లు గట్టిగ దగ్గఱబడినప్పడు రెండవ మార్గ ముండనే యున్నది కాని, గిన్నెలకొలఁది కాఫీ త్రాగుటకు, బుడ్డ కొలది సోడా త్రాగుటకు, పుంజీలకొలఁది నారింజపండ్డు మ్రింగుటకు దినములకొలఁదినుండి యుపచారములను జేయువారిని జెడమడ తిట్టుటకు నోరు విచ్చలవి డిగ విశృంఖలముగఁ బనిచేయుచుండఁగ గోచిలోపల గొట్టమెందులకు? పోనీ! ఎక్కించితివ య్యా-పసరు పోయినదా-క్రిమిపోయినదా? ఆమము పోయినదా? ముంగిలి తుడిచినంతమా త్రమున నిల్లంతయు శుభ్రపడినదా? అదిగాక జ్వరభేదమువలననేమి, ప్రేగులలోని వేడిమి గల నీరే రోగుల కందఱ కుపయోగపరుచుచున్నారే. అందుచేఁ గొందరగ్రేసేవు లుష్ణాధిక్యముచేఁ గుమిలిపోవుచున్నవి-కొందఱప్రేవులు హీనోష్టతచేఁ బచ్చిచేసి పట్టుపట్టుచు న్నవి. ఉష్ణాధిక్యము చేసిన ప్రేవులనుండి రక్తము పడుచున్నది. పచ్చిచేసిన ప్రేవులలో శూల యారంభమగుచున్నది. కొందఱ కేబాధయు లేక సరిపోవుచున్నది. పోనీ! కొందరైన సుఖముగా నున్నారని సంతోషింతమన్న, వారి బ్రదుకు లెట్టున్నవో చెప్పదునా? ప్రాతఃకాల మున యథాపూర్వముగ మలమోచనము జరుగదు. ఎప్పడు జరుగును? చిలుకకొయ్య కెక్కిన సీమ యినుపరేకుడొక్క గొట్టముతోఁ గ్రిందికి దిగవలయును. పంచపాళిలోఁ గ్రాంగుచున్న నీరు దానిలోఁ బడవలయును. నపుంసకుఁడు పెండ్గాముగదిలోనికిఁ బోయి తొంగిచూచి గిరుక్కున మరలినట్లు గొట్టపుఁగొస యాసనములోనికిఁ బోయి మరలవల యును. అప్పటికిఁ గృతార్థత-అప్పటికి మహేంద్ర పదవి-అప్పటికి సప్తపురుషాంతరములం దలి పెద్దలు తరించుట! ఆహా! ఎంతపనికిమాలిన బ్రదుకు బ్రదుకుచుంటి వయ్యా! ఆరు పైసల యాముదము నీకు, నీయిల్గాలికి, నీకొడుకునకుఁ గూడ నర్ధసంవత్సరమువఱకు వచ్చునే స్వదేశీయమై, సర్వవిధముల నీకు సరిపోవు నాముదమును మాని, మాసననాళధ మని నంటగట్టుకొని బ్రదు కడవి యధ్వాన్నము చేసికొంటివే. మూర్ఖా! నిన్నేమి చేయవలయును? పొరుగూరికిఁ బోవలసివచ్చునప్పడు చెంబుకంటె, గుడ్డలమూట కంటె, బ్రక్కచుట్టకంటె, భోజనపాత్రల దొంతరకంటె, దేవతార్చనపు బెట్టెటకంటె నీవిరేచ నపుడొక్కు ముందా?
రామరామా! కొందఱాడువారుగూడ నీప్రయోగమున నద్వితీయ లనిపించుకొను చున్నారే పెండ్లికిఁ బోవునప్పడు పన్నీటిబుడ్డికంటె నీపాయిఖానాపాత్ర ముఖ్యమైనదే అయ్యయ్యో! ఆరోగ్యముమాట యటుంపుడు. బ్రదుకుమాట యటుంపుడు. అన్నిటి కంటె ముఖ్యములైన సిగ్గుబిడియములు బుగ్గియగుచున్నవే! అంతటనుండి పెండ్లిండ్లలో వియ్యపురాలి యలంకారములలో, నాఁడుబిడ్డ కట్నములలో, నీయ మాంగళ్యపు గొట్టము చేర్తురు కాఁబోలు! అల్లుని కెక్కుటకు గుఱ్ఱములతోబాటు, బండ్లతోఁ బాటెక్కించుకొను టకు నీబహిర్దేశపుఁ దిత్తిని జేర్తురుకాబోలు! మనబుద్దు లింత పాడగునప్పడు దేశసౌభాగ్యము తొలఁగిపోయె ననఁగ నాశ్చర్య మేమి? తాను తనది యనునభిమానము పోయినపిమ్మట మోక్షమైన రావలయును, బైక్ష్యమైన రావలయును. మన స్వార్థపరిత్యాగము పదార్థస్వీ