పుట:SaakshiPartIII.djvu/78

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ముగ బాగుగ నున్నస్థితిని బ్రయత్నమునఁ బాడుచేసితిరే? మీరుపన్యాసము లీయకుండునె డల నిట్టియిక్కట్టు తటస్టించియుండునా? ఏకీభావమున నుండినప్ప డుపన్యాసము లెందులకు? మీ యుపన్యాసములే సందేహమునకు, విశ్వాసరాహిత్యమునకు, మనస్సులోని మాయకు నిదర్శనములై యుండలేదా? కిక్కురు మనకుండ నూరకుండినయెడల యథాపూ ర్వకముగ దినములు దొరలిపోయి యుండునే? జాతికి మరింత యైక్యమును సంకల్పించు కొని మీయుపన్యాసముల మూలమునం బ్రయత్నించిన తరువాతనే జాతి కింతవిభిన్నత కలిగినది; జాతిలో నిన్నివైషమ్యము లేర్పడినవి; ఇన్నికల్లోలములు కలిగినవి. జాతిలో నైక్య మభిమానముచేత, నాదరణముచేత, నన్యోన్యసానుభూతి చేత, నునురాగపూర్వకములైన యాచరణములచేతఁ గలుగునుగాని గొంతుచింపుకొని నందువలన, బల్ల గ్రుద్దినందువలన, గంతులు వైచినందువలనఁ గలుగునా? దేశభక్తులారా! జాతిసర్వాంగకముగఁ జచ్చునంతటి యాపదకు దానిని దెచ్చినారు. ఇప్పడైన మీయుపన్యాసములకు శాంతిఁ జెప్పెదరా? ఇంక మాటలాడ మని శపథ మొనర్చుకొనరా? మీ రిఁకఁ బెదవులు గదల్పకుండునెడల మనస్సులలోఁ గలిగిన నఱుకులు, తమంత తా మదుకు కొనును. చిత్తమునం గలిగిన పుండ్లు తమంత తాము మానును. సన్నిపాతరోగికి నిద్రపట్టినతరువాత దేహము స్వస్టమైనట్లు దేశము సొమ్మసిల్లి రవంత శాంతిపడి, తనంత తానే సుఖస్థితికి రాగలదు. మనము చేయవలసినపనియేమి? మనము చేయుచున్నపని యేమి? “సర్వేజనాస్సుఖినోభవంతు, లోకాస్సమస్తా స్సుఖినో భవం తని సర్వదా సర్వేశ్వరుని బ్రార్ధింపవలసినవారము కామా? ఇంతవిశాల హృదయమైన ప్రార్ధన ప్రపంచమున నెచ్చటనైన నున్నదా? మీరట్టు దైవధ్యాన మొనర్చుకొనుచు మాటలాడకుండ నుందురా? ఒక్కటే మాట-రాట్నపు ధ్వనితప్ప నోటి మాట భారతదేశమున నీదినమున నుండి వినఁబడఁగూడదు. అట్టు మీరాచరింపఁగలరా? అయ్యయ్యో, ఆచరింపరా? ఆచరింపరా? దేశకర్మ మిఁక నింతే? జాతికర్మ మిఁక నింతే? ఇంతే?”

అని యాయున్మత్తు డేడ్చుచు లేచినాడు. “అయ్యా కూరుచుండు'మని నే నంటిని. "నాకు నీబలాత్కారమా Rascal, డొక్క చీల్చెదను. జాగ్రత్త యని యాతండు నాచేయి విదల్చుకొని పాఱిపోయినాఁడు.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.