Jump to content

పుట:SaakshiPartIII.djvu/77

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లతోనెన్నఁడైన మన కరమఱిక యుండెనా? వారు మనముంగిళ్లలోనికి, పెరళ్లలోని కెంత స్వేచ్చగా వచ్చుచు; బోవుచుండెడివారు? వారు మనయెడల నెంతదయతో, నెంతవిశ్వా సముతోఁ బ్రవర్తించుచుండెడివారు? దొంగలవలన మనయాస్తి కపాయము, వస్తువుల కపా యము సంభవించునప్పడు మనలఁ గంటికి తెప్పలవలెఁ గాపాడిన వారు వారే కారా? ఏవో జాతిసంబంధములైన పూర్వపు కట్టుపాటుల ననుసరించి తనువులు వేరుగ నుండెనుగాని వారికి మనకు మనస్సులయందెంత మైక్యముండెడిదో మీ రెఱుంగరా? వా రెఱుఁగరా? భారతదేశ రక్షక దేవత లెఱుఁగరా? వారికి మనకు నిప్పడు మూషకమార్థాలవైషమ్య మెందులకుఁ గలిగెను? మీ బుద్దిహీనోపన్యాసముల మూలమునఁ గలిగినది. వారియస్పృశ్యత తత్ కణము మానుపవలయుననియు, వారిని దేవాలయములోనికి వెంటనే రానీయవలయు ననియు, వారితో బం క్తిభోజనము లుత్తరకణముననే కానీయవలసిన దనియు మీరు లొడ లొడ యుపన్యాసము లిచ్చినంత మాత్రమున మీరు ద్వంద్వాతీతులైన మహావేదాంతు లొక్కసారి యైపోయినా రని వారనుకొనినారా? మీయుపన్యాసములోఁ జేవ యున్నదో, చెత్తయున్నదో వారెఱుఁగుదురా? ఆకస్మికముగ మీ కవతరించిన ప్రేమలలో గుల్ల యున్నదో, గట్టియున్నదో వారు కనిపట్టలేరనియే యనుకొనుచున్నారా? మీరు సమయా నుసారవ చోవిభవాభిరాములైన నటకశిఖామణు లని వారు గుర్తెఱుఁగ లేనంత మూఢులా? మీ నవ్వులు దొంగ నవ్వు లని, మీ యేడ్పులు మొసలి యేడ్పులని, మీరు స్వలాభోద్దేశము చేతనే యీమహామాయానాటక మాడుచున్నారని తెలిసికొన లేనంత బుద్దిహీనులా? వా రట్టిబుద్ది హీనులని మీరు నిశ్చయపజచుకొన్నట్టు వారు తెలిసికొని మీయందు మరింత యాగ్రహగ్రస్తులయి యున్నా రన్న సంగతి యెఱుఁగరా? స్వరాజ్య వాంఛాసమన్వితు లైన మీరు జాత్యైక్యము కొఱకు వారి నిప్పడు కూడఁగట్టుకొనుచున్నారు. స్వరాజ్యమువచ్చుట యెన్నఁటికైన సిద్దించునెడల గేదెకు గేదెయే, దూడకు దూడమే. అప్పడు తల్లి పిల్ల సంబంధము తెగవలసినదే యని వారికిఁ దోఁపక పోవునా? వారి మాట యెందులకు? మీతలపై రామాయణముఁ బెట్టి మిమ్మడుగు చున్నాను. మీకుఁబంచములపై స్వలాభచింతా శూన్యమైన యవ్యాజ ప్రేమ మున్నదా? వెల్ద మొగము వైచికొని, యూరకుందు రెందు వలన? మీలో నందeకి కట్టిప్రేమ ముండనక్కఱలేదు. ఒక్కనికైన నున్నదా? వట్టిమాట, లేదు. దేశభక్తులని బిరుదును నెత్తికిఁ గట్టుకొనఁ గలవు గాని బుద్దున కున్న ప్రేమము హృదయమునఁ బెట్టుకొనఁ గలవా? నీవు రామానుజఁడవైనప్పడు నీ కట్టినిర్వ్యాజప్రేమము కలుగును. ఇంక మాటలాడక, ఒక్కనిమిషమైన నాలస్య మొనర్చక, కలుపులాగివేసిట్టు, బిరుదు లూడదీసికొనుఁడు.

హిందూమహమ్మదీయ సఖ్యమును మీయుపన్యాసములే ప్రధానముగ బాడుచేసినవి. మహమ్మదీయులకు మనకు మతవిషయములైన భేదాభిప్రాయము లున్నను సామాన్య ప్రాపంచిక వ్యవహారములందైల్ల గావలసినంత సఖ్యము చిరకాలమునుండి యుండి యుండెను. మహమ్మదీయ చక్రవర్తి యిచ్చిన యీనాములను, రాజ్యములను ననుభవించువా రిప్పటివఱ కెందరున్నారో యెఱుంగరా? వారి రాజకీయవ్యవహారములందు మనవా రెంత తోడుపడి యుండిరో యెఱుఁగరా? వారికి మనకు నిచ్చిపుచ్చుకొను బాంధవ్యముకూడఁ బూర్వమున మండలేదా? ఏది యెటులున్నను బ్రత్యకమైషమ్య లేశమైన లేకుండం బదునాలుగు సంవత్సర ముల క్రిందటివఱకు సరళముగ, సౌమ్యముగ, సలక్షణముగ జరిగియుండలేదా? అప్రయత్న