Jump to content

పుట:SaakshiPartIII.djvu/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వచ్చినదయ్యా? నేను బ్రతిపాదించిన పూర్వపక్షము నీకు బోధమైనదా? తెలివిమాలిన మొగముతో నట్టు నిరర్ధకమైనజూపు చూచెదవేమి? బ్లాక్ హెడ్ ! అదికాక వితంతువు మైనవస్తువును మన మంటగూడదు. కావున నాచారకాండ ననుసరించి దానిని విసర్జింతము. వదలితివికదా! ఇంక నావైపున నాశపెట్టుకొనవుకదా! సరే పుణ్యస్త్రీనే తీసికో, ఉభయతారక మైన పద్దతిని మన మవలంబించుటకు సందేహమేల? ఇప్పటి పుణ్యస్త్రీలకుమాత్ర మందఱకుఁ గొప్పన్నదా? ఉంగరాల గిరజాలుంచుకొన్నంత మాత్రముచేత నువిదతన ముడాయించినదా? క్రాపువెండ్రుక లుంచుకొన్నంతమాత్రము చేత ప్రధానమైన సుదతీ త్వము సున్నయైనదా?

పదము 'మెడను గుత్తికకంటు లేదోయి నాస్వామి
మొగముమీదను బొట్టు లేదు
కప్పకొప్పబదులు క్రాపోయి నాస్వామి
మగడు మిగిలిన కురిడిసఱకు"

“ఇంకఁ జాలింపవయ్యా ఒక్కశేు పనికిమాలిన ధోరణియా? ఉపన్యాసము లిచ్చువారి గొంతు కోసెదనంటివే. దానికిఁ గారణ మేమని నే నడిగితిని."

"జ్ఞప్తిలేక మానివేయలేదయ్యా! స్టుపిడ్ ! జ్ఞప్తియుండియే మఱచిపోయినాము. చూచి తివా, విరోధాభాసాలంకారమునకు మన వాణియే ప్రాతిపదిక.

ఆగజానన పద్మార్కం గజానన మహర్నిశం,
అనేకదంతం భక్తానా మేకదంత ముపాస్మహే.

గజదంత మని గ్రంథములలోఁ బ్రయోగమున్నది. "తత్రహేతు రదంతతా" యను టచే మనుష్యదంత మని ప్రయోగమున్నది. మేకదంత మను ప్రయోగ మేమిరా? నీమొగ మని సాగదీసి యొక్క లెంపకాయ నిన్నుఁ గొట్టునెడలఁ గవికి బుద్దివచ్చును. చెప్పవచ్చినవా నిని జెంపకాయ కొట్టినప్పడు పైయూరివా రా పాముకాటు నిమ్మదించినదా లేదే? మే మసంబద్దముగా మాటలాడువారము కాము. మాకు మతి లే దనుకొనుచున్నావు కాఁబోలు. మతి లేకపోవుట నీకా, నాకా? నామతిలేని మాటవలన దేశమున కేమినష్టి వచ్చినదో నీవు చెప్ప, మీమతిలేని మాటలవలన దేశమునకెంత దుర్గతి వచ్చినదో నేను జెప్పదును. కాచికో, చూడు. ఆ. ఇప్పడు తెర రవంత తొలగిన ట్లున్నది. మన స్సిప్పడు రవంత నిర్మలముగా నున్నది. ఈసమయములోనే చెప్పవలసిన దేదో యొక్కవాయలో నలగఁ గొప్టెదను.

పదిపదునాల్గు సంవత్సరముల క్రిందట దేశములో నింత యశాంతి యున్నదా? ఇన్ని మతక్ష లున్నవా? ఇన్ని శాఖావైషమ్యము లున్నవా? ఇన్ని తిట్టులాట లున్నవా? ఇన్ని కొట్లాటలున్నవా? ఇంత రక్తపాతమున్నదా? ఇంతమహారోదన మున్నదా? మీతెలివిమాలిన యుపన్యాసములే దేశము నింత భ్రష్టపఱచినవి. ఇంతకుముందు బ్రాహ్మణులు నబ్రాహ్మ ణులు నెంత కలసి మెలసి యుండెడి వారు. అన్నా, మామా, బావా, యను వరుసలతో వొకరి నొకరు పిలుచుకొనుచు నొక్క కుటుంబములోని వారివలె నుండెడివారు కారా! వీరి వారి స్త్రీ లత్తా, వదినా, అక్కా యనువరుసలతో నొకరినొకరు పిలుచుకొనుచు నీరక్షీరన్యా యముగా నుండెడివారు కారా? ఇప్పడు గజకచ్చపన్యాయము గానున్నారా లేదా? పంచము