Jump to content

పుట:SaakshiPartIII.djvu/75

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సుమా! నీవెప్పు డుంటివో నే నప్పుడున్నా నన్నమాటయే. నీవు నా కాధారము, నేను నీకాధారము. అన్యోన్యాధారము మన కెక్కడకుఁ బోయినను దప్పనేతప్పదు తెలిసినదా? అంత తప్పనియాధారమున్నను గేవలము మందభాగ్యముచే దార్కికులకుపాదానకారణము కలిగినది. భవతి భిక్షాం దేహి యని భగవంతునైనను మోక్షమును గూర్చి యాచించుట తప్పయినపుడు మారాజ్యము మా కిమ్మని సర్కారువారిని యాచింతుమా. థూ; అదినామర్దా I am the monarch of all I survey; నిన్నడ్డుకొన్నవా డెవడు? నీయిష్టము వచ్చినంత రాజ్యము పరిపాలింపవయ్యా. ఈప్రపంచములో నీదికాని దేమున్నదయ్యా! మూడుడవై బానిసవై తుచ్చుఁడవై భికుకుడవై దేహి యని చేయిచాచెదవా? చాచినచేతితో బ్రహ్మరంధ్రము మీఁదఁ గొట్టుకొని ప్రాణములను విడువుము. అది నీకు గౌరవము, అది నీకు మనుష్య ధర్మము. అంతే కాని తెలివిమాలిన యుద్యమము లెందులకు? హరతాళము లెందులకుఁ జేయుచున్నారు? ఏమి యూహము? ఏమి ప్రయోజనము? అంతకంటెఁ దెలివిమాలిన యూపన్యాసము లెందులకు! ఇంక నుపన్యాసము లిచ్చినయెడల నీగొంతుకోసెదను. హె హె హె ఖబర్ దార్. దారులలోకెల్ల జమీందారీయని పిచ్చిరామశాస్త్రి చెప్పిన మాట జ్ఞప్తియున్నదా? ఒక్కజమీందారియాస్థానములో నొకదాసి గుఱ్ఱది పెంపఁబడు చున్నది. పదుమూఁడేండ్లది, బనారనుకాజా! గులాబ్జామిన్! బురాఖ్ బొమ్మ-వహవ్వ సుజపండిత సాంబయ్య చెప్పినట్టు తులముతులము మోతాదు చొప్పన గుటుకు గుటు కున మింగిఁ దగినది. దానికిఁ గన్నె చెఱ బావుటకై యెవఁడైన మహారాజపుత్రుని దెచ్చితివేని మాజమీందారీ నీకు దానవిక్రయాది సర్వస్వాతంత్ర్యములతో ధారాదత్త మొనర్పనియెడలఁ జెవి కదపా."

“అయ్యా, అంతటితో నాగుము. తప్పధోరణిలోఁ బడిపోవుచున్నావు. దేశభక్తిని గూర్చి, జాత్యైకమత్యమునుగూర్చి యుపన్యాసము లీయవలదని యెందులకు చెప్పినావు? రవంత మనస్సు శాంతపఱచుకొని చెప్పడు' అని నే నడ్డు తగిలితిని.

“ఉపన్యాసముల సంగతియేనా? చెప్పకుందునా? తొందరపడకోయి పూల్. ఉపన్యా సము, ఉపన్యాసము, సన్న్యాసము, సన్యాసము. సన్న్యాసి యగువాఁడు అధవా విధవాశ్రేష మను నాపకన్యాయముచేత విటుడైనప్పడు వితంతువు యోగినియైనట్టా? సన్యాసి సంసారి యైనట్లా? ధర్మసూక్ష్మ మాలోచించి మరిచెప్పము. శూద్రుఁడు యజ్ఞోపవీతధారణ మొనర్చినాఁడు; గాయత్రికి శూద్రత్వము వచ్చినట్టా? శూద్రునికి బ్రాహ్మణత్వము వచ్చి నట్లా? బ్రాహ్మణుడు మహమ్మదీయమతానుసారముగ నుపనయనము చేసికొన్నప్పడు బ్రాహ్మణునకు మహమ్మదీయత్వ మెంత వచ్చి యేడ్చినదో శూద్రునకు ద్విజత్వ మంత వచ్చి యేడ్చినది.

“విద్యావినయసంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని
శునిచైవ శ్వపాకేచ పండితా స్సమదర్శినః.

అను భగవద్గీతాళికమున కిక్కడ బప్పడుక దయ్యా, తెలిసినదా. కం. “పప్పేపస బ్రాహ్మణులకు, నుప్పే పస రుచులకెల్ల నువిదలకెల్లన్, గొప్పేపస' యన్నాడుగదా. ఇక్కడఁగవియువిదతనమునకుఁ గొప్పనకు నవినాభావ సంబంధము చెప్పినాడుకదా! వితం తుత్వము వచ్చినప్పడు కొప్పెగిరి పోయినది. పోలేదా? కాని స్త్రీత్వమున కేమిలోపము