పుట:SaakshiPartIII.djvu/70

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీ. త్వత్పదారాధకులు ముష్టిదాసరయ్య
లగుటో? నాస్తికుల్ వారల మొగములందు
నుమియుటయొ! యేమి యిది కన్ను లున్నవె? మతి
యున్నదే? యుంటివే? చేయుచున్న దిదియె?

సృష్టిలో నిట్టివ్యత్యస్తత యున్నదనుమాట సత్యమే కదా! ఒక్కొక్క వ్యక్తికిఁ గొన్నివ్య త్యస్తపరిస్థితులు సిద్దింపవచ్చును. మనము జాతిమీద జూచుకొన్నగాని సత్యమును నిర్ణయిం పలే మని నీ వందువేమో? మనజాతిస్థితియే యోజింతము. మనజాతి యెంత ఘనమైనదో ప్రపంచమంతయు నెఱిఁగిన సంగతియేకదా! విశ్వవంద్యములగు వేదములు మనజాతిమూల పురుషులవలననేకాదా యుద్బుద్దము లయినవి? ప్రపంచమున నొక్క చదరపుటడుగులో నూఱంగుళములు వ్యాపించిన మతమును బోధించిన బుద్దభగవానుడు మనలోనివాఁడే కాదా? ప్రపంచమం దేదేశమందయిన నేకాలమందైన ధనము తీసికొనకుండ విద్యాప్రదాన మొనర్చుట జరిగియుండెనా? మనభరతఖండమున జరిగినది ఇప్పటికి జరుగుచునే యున్నది. బిచ్చగాండ్రకు నన్నమిచ్చుట, బియ్య మిచ్చుట, డబ్బిచ్చుట యొచ్చటనయిన జరిగియుండెనా? ఇచ్చట జరిగినది. ఇప్పటికిని జరుగుచున్నది. ఇతరదేశములందు భిక్షకులు వీథిలోఁగనఁబడునెడల రక్షకభటులు వారినిఁ గారాగృహములం దుంతురు. మనము భుజించుచుండంగా మాధుకర మొనర్చుకొను నాతండు సీతారామాభ్యాం మనః యని జోలితో రాంగ మనము నోటి కెత్తుకొనుచున్న కబళమును దిరుగ విస్తరిలోనుంచి, యాయతిథి కన్నమిడిన తరువాతనే యాకబళమును నోటఁ బెట్టుకొన వలయునన్న నిబంధన మొక్క భరతఖండమునం దక్క మఱెయొచ్చటనయిన నుండుట కవకాశము న్నదా? అతిథికి ముందు పీట, ముందు విస్తరి, ఆతం డాపోశన మొనర్చి ప్రాణాహుతు లయినఁ దీసికొన్న తరువాతఁగాని యేగృహస్టుడైనఁ బరిషేచన మొనర్చునా? ముందుగ గాకబలి, శ్వానబలి లేకుండ నెవఁడయిన మెదుకు నోటఁ బెట్టునా? ఆతిథ్యములో నత్యంత సూక్మము లయిన యేర్పాటు లిచ్చటఁ గాక మఱి యొచ్చట నున్నవి? ఇందువలన నాతిథ్యగుణము మనదేశమున నెంత పరిపూర్ణముగ బరిపోషింపఁబడినదో తెలియవశమా? చీమలకుం బిండి బెల్లము ప్రతిదినము వైచువా రెంద ఱున్నారో యెఱుఁగుదువా? తుదకుఁ బాములకుఁ జిమ్మిలి, పాలుపోయుచున్న కాంతలెంద ఱున్నారో యెఱుఁగుదువా? శత్రువులకుగూడ నాతిథ్య మిచ్చినవారు మనజాతివారే కాదా? నూతేసి యంతరువుల మేడలున్న యమెరికాదేశ మొకదేశమా? దోమకుట్టుబాధ నివారించుటకుఁ బశువులకయి. రాపిడి స్తంభములున్న మనదేశమే దేశ మగునుగాక! జాతి కుండవలసినది భోగవాంఛయా? భూతదయయా? మనజాతి కీసుగుణసంపత్తియుంతయు నున్నది కదా! ఇది నీమతానుసా రముగఁ బుణ్యమే కదా! సరే.

సాలగ్రామములపై నిర్మాల్య భారమును దీసివేయనివాఁడు ధరాభారముగ నెన్నఁబ డుచున్నాడు కాదా? మైలుమైలున కొక్కదేవాలయ మున్నదే. ఫర్గాంగు ఫర్గాంగున కొక్క భజనమందిర మున్నదే! ప్రతిదినము నేదో యొకవేళ నయిన దైవధ్యాన మొనర్చని భారతీ యుడెవఁడయిన నున్నాడా?

అబుద్దిపూర్వకముగనైన దైవనామస్మరణ మొనర్పనివా డీపుణ్యభూమిలోనివాఁడు