కాడే? పాశ్చాత్యులలో దైవచింత యెంత యరుదుగా నున్నదో యంద ఱెఱిగినదే కాదా? వారికి దైవచింతకుఁ దీఱిక యొక్కడిదో? దైవనామస్మరణ మొనర్చుటకు నైనఁ దెఱిపి యొక్కడిది? పొగయంత్రములలో, నీటియంత్రములలో, వాయు యంత్రములలో, విద్యు ద్యంత్రములలో, సముద్రగర్భములో, సంతలలో, నక్కడ యిక్కడ యని లేక, సర్వతోము ఖముగఁ దిరుగుచు కణము పోయిన ధనము పోవు ననునాందోళనముతో నత్యాతురతతో దేవులాటయుఁ దిరుగులాటయుఁ బరుగులాటయు నెగురులాటయు బ్రాకులాటయు బొరలాటయు దక్కనంతకంటె మతేమియులేదె ధనిచింతా ప్రాబల్యమే కానిదైవచింతాలేశ మయిన నెప్పడైన నున్నదా?
మనకట్లా? దైవనామస్మరణ మొనర్చుచు నుదయమునఁ గనుదెఱచినది మొదలు, దైవనామస్మరణ మొనర్చుచు రాత్రికనుమూయు పర్యంతము మనము దైవము పేరు పెట్టు కొని చేయుచున్నపనులిన్నిన్నియా? కొడుకులకుఁ, గూతులకు, మనుమలకు మనుమరాండ్రకు దేవుని పేరు పెట్టుకొని నోరాజఁ బిలుచుకొనుచున్నాము కాదా? ఏదో యొక దైవముతో సంబంధింపని పేరు మనలో నెవరికైన నున్నదా? మత్స్యనాథరావు కూర్మానాథ రావు వరాహరావను పేళ్లగూడ మనలో వెందఱకో యున్నవికాదా? ఎటు వచ్చినను గడ్డయ్య-పెంటయ్య-పుల్లయ్య యను పేళ్లు కారణాంతరములచేఁ గొందరు శిశువుల కున్నను బాల్యగండములు దాఁటిన పిమ్మట వారినిఁ బవిత్రనామధారులుగా చేయుచుం డుట లేదా? ఏనుక్రీస్తుపై మహాభక్తిపాశ్చాత్యులలో నున్నదికదా-ఆతని పేరు కొడుకులకుఁ గూఁతులకుఁ బెట్టినవా రెందఱున్నారో యెఱుఁగమా? మొగములందు భుజములందు మనము దేవుఁడని నమ్మినవారి లాంఛనములను ధరించుచుండుట లేదా? మెడలో శంకర మూర్తులను ధరించు వారెందఱు లేరు. ఇంటిగోడలకు విష్ణుపాదము లంటించినవారెందఱు లేరు? ఎటుపోయినను దేవునిరూపమో, యెటువిన్నను దేవుని పేరో, యెటు చూచినను దేవునిగుఱుతో యెటఁ జదివినను దేవుని కథయో మనకు లేనిపరిస్థితి యీజాతి పుట్టినప్పటి నుండి యిప్పటివఱకున్నదా? ఇఁక ముందుండునా! ప్రహ్లాదునివంటి భక్తుఁ డితరప్రపంచ మున నుండెనా? హరిశ్చంద్రునివంటి సత్యవాదికథ పాశ్చాత్యుల గ్రంథజాలములో నొక్కటి యైన నున్నదా? భగవద్దాసు లని, బైరాగు లని, యతు లని, సన్యాసు లని, పరమహంస లని, యోగు లని, సాధువు లని, యింక వేమేమో యని దేశసేవచేయుచు నీదేశమున నెన్నిలక్షల జనమున్నదో చెప్పఁగలమా? ఈజనసంఖ్యలో సహస్రాంశమైన నితరదేశములం దున్నదా?
మరియొక్క విశేషము: ఏగ్రుడ్డివో యేనవో యేక్రూరమైనవో యేగొంతుకోఁతవో యగు భయంకర ప్రకృతిశక్తులనుగూడ శ్యామలాంబయని మరిడమ్మ యని పేళ్లతో మనము పూజిఁచుచుండుట లేదా? దైవముకొఱకే తను వంతయు మనస్సంతయు నాత్మ యంతయు నర్పణ మొనర్చుకొన్నజాతిమఱియొకటి ప్రపంచముననున్నదా? ఈభూతద యయు, నీదైవభక్తియు మహాపుణ్యమని యాచరించుచున్న యీ జాతి యెంత యున్నతస్టి తిలో నుండవలసినది? సృష్టిమహామూలశక్తికి దయాదాక్షిణ్యములే యుండునెడలఁ బుణ్యపా పవిచక్షణతయే యుండునెడల, ధర్మాధర్మవిభేదమే యుండునెడల, మనహ్పదయములోవి తన యందలి ప్రేమమును దెలిసికొనుటకు జ్ఞానమే యుండునెడల, మనయవస్థను