న్నారే ధర్మహీనులతో ధర్మసహితులుగూడ దండోపతండములుగ మండిపోవుచున్నారే కుటుంబములు కుటుంబములు నామహీనముగ నశించిపోవుచున్నవి కదా! అన్ని కుటుంబ ములోనొక్క పాపదూరుడైన లేకపోయెనా! పెద్దవాండ్రు, పాపాత్ములు తఱచుగా నగుచుందురు. కావున వారు శక్తిచే శిక్షితులై యుండవచ్చును గాని మూఁడుదినముల గ్రుడ్డుకూడ మృతినొందనేల?
అది యసత్యము. ఆశక్తుల కొకరిని శిక్షించు నుద్దేశము లేదు. వాని కేవిధమైన క్రమములేదు. ఎందులకో చెలరేగుచున్నవి. గ్రుడ్డి త్రోపుగ నొక్కపెట్టున నన్నిటినిఁ దుడిచివైచుచున్నవి. దానిదారిలో నున్న వన్నియు నశింపవలసినదే! దయలేదు. పగలేదు. ధర్మములేదు. అధర్మము లేదు. చిన్నలేదు. పెద్ద లేదు. పుణ్యము లేదు. పాపములేదు. క్రమములేదు; ఆక్రము లేదు. సృష్టిశక్తులస్వభావ మిట్టున్నది.
“క్రమములేదు క్రమములేదని యింత గింజుకొందువేల? సూర్యచంద్రగ్రహాదుల యుదయాస్తమయము రొక్కని మేషమైనవ్యతిరేకము లేకుండ జరుగుచున్నవికాదా? ఋతు క్రమము ననుసరించి పుష్చఫలాదులు కలుగుచున్నవి కాదా? పైకెగురవైచిన బరుగువస్తువు భూమి మీఁదనే యెల్లప్పడు పడునుగాని పై కెగిరిపోవుచుండుట లేదుకదా?" యని నీ వందువుకాబోలు. ఇదియా నీకున్నపట్టు? మహోన్నత్తుని ప్రలాపములలోనైనఁ గొన్నిటి యందు గ్రమముండునే! ఆంత్రజ్వరితుని యసాధ్యసన్నిపాతపుఁ గేకలలోనైనఁ గొన్ని కారణబద్దములై యుండునే అత్యసత్యాలాపియుగూడ “నీమెయేనా నిన్నుఁగన్నతల్లి' యని యడుగ, సత్యమాడక తప్పదే! అంధుడు వైచిన పదిరాతి విసరులలో నొక్క ఱాతివిసరుచేనైన మామిడి కాయయొక్కటి రాలవచ్చునే సిరాలో మునిఁగిన సాలెపురుగు కాగితముమీఁదఁ బ్రాకినప్ప డన్ని చికిబికులలోను బ్రమాదమున నొకయక్షరముండవ చ్చునే! ఇంతయేల? అగిపోయిన గడియారమైనను దినమునకు రెండువేళల సరియైన కాలము చూపునే అక్రమములో నక్కడక్కడ క్రమముండక తప్పనే తప్పదు. అక్రమము, క్రమము ననునవి యన్యోన్యాశ్రయస్థితులుగాని స్వతంత్రమును కావే! మనము చూడవలసిన దేదనంగా సృష్టికిఁ గ్రమము సహజమా, యక్రమము సహజమా యనునది. అక్రమమే సహజమనుట సిద్దాంతము.
సృష్టికర్తనుగూర్చి చెప్పవయ్యా యని యెందఱు సన్యాసులో బతిమాలఁగ బుద్దదేవు డేమనియెనో విందువా? ‘ఈమూలతత్త్వమున్నప్పటికి మీ కది లేనట్టిదే. ఆతత్త్వమునకు మీముక్కు మూఁతల సమాధు లక్కఱకు లేదు. మీనిలువుకాళ్ల తెలివితక్కువ ప్రార్డనము అక్కఱలేదు. మీపసిఁడికుండల దేవాలయము లక్కఱలేదు. మీకర్పూరపుహారతు లక్కఱ లేదు. మీసాతాళించిన సెనగ లక్కఱలేదు. మీ పుణ్యములఁ గాంచి మీమ్మాతఁడు తొడపైఁ గూరుచుండఁ బెట్టుకొనువాఁడు కాడు. మీ రాతత్త్వమును దలపెట్టనక్కఱలే"దని చెప్పలేదా? చెప్పినఁగాని వలనుపడ దని యామహానుభావుని నిరోధింపఁగ నాతఁ డేమని యెనో విందువా? "ప్రపథమమున సత్తున్నది. ఇది కేవలము జ్ఞానశూన్యమైనది. ఈయవిద్యా మహాసముద్రమునఁ గొన్ని యంధశక్తు లుద్బవించిన” వని యాతండు పలికినాఁడు. సత్తులేదు, ఆసత్తులేదని మనవారు చెప్పినారు. సత్తున్నది కాని యది యసత్తుకంటె భిన్నముకాదని యాతం డనినాఁడు. శక్తు లజ్ఞము లని వారు వీరుకూడ నంగీకరించినారు.