Jump to content

పుట:SaakshiPartIII.djvu/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బాఱిపోవఁ జూచుచున్నారు. గానుగయొద్దుల లాగున నందరు తిరిగినదారులలోనే యల్గాడు చున్నారు. ముందునకుఁ బోయినవారేరి? తెన్నా? కన్నా? ఏమున్నది? ఇంతలోఁ బటల ములు పటలములుగ బైకెగయుచున్న ధూమరాశిలో నుండి చిన్నచిన్న విస్పులింగములు చిటచిటాయమాధ్వనులతో మించిన కత్రములవలె రాత్రితమాలవృక్షమునఁజేరిన మిడుఁగు ఱులకోటులవలెఁ గానబడుచున్నవి. 'భయంకరగాఢాంధకారము రవంత పలుచఁబడినది. రవంత పాయయిచ్చినది. కన్ను కన్ను రవంత కనబడుచున్నది. అంతలో జండప్రచండ మగు జ్వాలాజాలములు కోట్లకొలఁది జిహ్వలతోఁ గొన్ని యెఱ్ఱగఁ గొన్ని పచ్చగఁ గొన్ని తెల్లగఁ గొన్ని నీలిగ బయలుదేరి యాకసమంత గ్రమ్ముకొనుచున్నవి. సాయంకాలమున సంధ్యారాగ కాంతిచేఁ బశ్చిమ పార్శ్వమున నాకాశ మెట్టుండునో యావదాకాశముగూడ నట్టే యున్నది. జను లాకాఁకాకు నిలువలేక, చర్మములు బొబ్బలెక్క, దాహముచే జిహ్వ లీడ్చుకొనిపోవ, నతికాంతిచేఁ గన్నులు చీఁకటులు గ్రమ్మ, దయ్యములు పట్టినవారివలెం బిచ్చివారివలె జట్టు పీఁకికొనుచు గుండెలు కొట్టుకొనుచు నట్టిట్లు పోవుచు నాకసము పగులునట్టాక్రోశ మొనర్చుచున్నారు. ఈయేడ్పులు విన్నవారెవరు? దయ యెవరికి? దాక్షిణ్య మెవరికి? ఆంధ్రప్రకృతిలోని యంధతరశక్తులకు జాలియే? కడవలంత బానలంత ద్రోణములంత చుట్టుగుడిసెలంత యెఱ్ఱగ గ్రాగినటాలు, సలసల తెల్లగ మరిఁగిన గంధక ధారలతో ధారాపాతముగ శతకోటిశతకోటిధ్వనులతో వర్షించుచున్నవే! చెదలున్నపుట్టలో దాటియాకు మంట పెట్టినయెడల నేమగునో యదియే యంతకంటె భయంకరముగ బీభత్సముగ నైనది. తెల్లవారుసరి కెటు చూచినఁ బదిమైళ్లవఱకు యున్నది. దానిక్రింద మహాశ్మశానమున్నది.

వాంతులతో భేదులతో మూత్రబంధములతో, నెక్కుపట్టిన నరములతోఁ, గంటిగుం టలతో, నొడలిచలువతో, నాసన్న మరణలాంఛనమగు నాభీలశిరోవేదనతో, భరింపరాని బాధలుపడుచున్న జనులనూడ్చిపెట్టుటకుఁ దోఁకచుక్క యంతబీపురు చేతబట్టుకొని మురికికాలు వలప్రక్కలను గోడిరెట్టలగుట్టలనడుమను గొట్టాలమ్మ తాండవించుచున్నదే! షడుప్తరశతపర్యంత మెగ బ్రాంకిన జూర్తిమహార్తితో నిముసనిముసమునకు నోరెండిపోవ జేయుచున్నదగవగతో బాహుసందుల బగిలిన, పగులుచున్న, పగులనున్న బొబ్బలవలని బొబ్బలతోఁ గన్న కొడుకైన నొద్దలేక, యెటులున్న దని యడుగువా రైన లేక, గుండెలు పగుల నేడ్చుచున్న నిర్బాగ్యులను గఱకఱ నమలి గుటుక్కున మ్రింగుదు నని యార్చుచు నోరుతెఱచి హాహాకారమొనర్చుచు మారికామహాదేవత మృతమూషకగిరిసింహాసనమునఁ గొ లుపుచేయుచున్నదే వీరి తోఁబుట్టువు లగు చుఱుకులమ్మ స్పోటకదేవత మొదలగువారు వారివారి పరివారములతోఁ బ్రజ పై దాడివెడలి భూమినంతయు నేడ్పులతో రక్తముతో శవములతో దుర్గంధముతో ధ్వస్త మొనర్చుచున్నారే ఇవి రోగము లని యిప్పటివఱకుఁ బాశ్చాత్యులు భ్రమించు చున్నారు కాని యివి ప్రకృతిశక్తులని, వీనికి మందీయ నక్కర లేదని, బ్రదికినవారు మందుచే బ్రదికినవారు కారని, చచ్చినవారు మందులేక చచ్చినవారు కారనియు, నేను క్రీస్తు పుట్టముందే మనవారు చెప్పినారు. ఎందుల కీశక్తులుండి యిట్లు చెలరేగవలయునో వానికే కారణములు తెలియనప్పడు మన కెట్లు తెలియును? అధర్మశిక్షకుఁ బాపనాశనమునకు నిట్టివి బయలుదేరి యుండునేమో యనుకొందమన్నఁ బాపాత్ములతోఁ బుణ్యాత్ములుగూడఁ బుంఖానుపుంఖములుగఁ బూర్వపక్షము లగుచు