Jump to content

పుట:SaakshiPartIII.djvu/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనుష్య జాతిమీఁద నాకుఁ గలిగిన యసహ్యత యింత యంత కాదు. గుణ గ్రహణమును మానివైచి యెంత సేపు దోషగ్రహణమే చేయుచు, మనుష్యులనెల్లఁ దిట్టుచుఁ గాలక్షేపముఁ జేయుచున్నాను. నీకుఁ జేతనగునెడల నాస్థితిని వెల్లడించి నన్నీ చెఱనుండి విడిపింపుము " అని చెప్పి యాతఁ డూరకుండెను.

హరిహరీ! పిచ్చివాఁ డైనమఱఁదిని జూచుట కితఁడు వచ్చుట యేమి, పిచ్చివాఁడు పారిపోవుట యేమి, పిచ్చిలేనివాని కీ కారాబంధన మేమి! ఏమిచిత్రము! కర్మమార్గము దుర్గ్రహము కదా?

ఓం శాంతిః శ్శాంతిః శ్శాంతిః