పుట:SaakshiPartIII.djvu/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మీరు బోధించుచున్న జాత్యైక్యముమాట ముందు చూచుకొనవచ్చును గాని మీలో మీ కేమాత్ర మైక్యమున్నదో సెలవిండు. ఒక్క తెగగా బయలుదేరిన దారుమాసములైనం గాకుండ రెండు తెలైనవిగదా? అవి యిప్పటికిఁ బదునాలుగైనవికదా? ఇంకొక పదునాల్గు చీలికలు పై సంవత్సరములోఁ గావని యెవరు చెప్పగలరు? క్రిందఁబడిన పాదరసపుబుడ్డివలె నిన్నిముక్కలైన మీరు వర్ణవిభాగమును మాన్పనుపన్యసించుచున్నారా? ముక్కలైన త్రాటితోఁ గట్టెలమోపుఁ గట్టవచ్చునా? మొన్న మొన్న విడిపోయిన తెగలను సవరించుకొన లేక యెన్ని వేల సంవత్సరములనుండియోయున్న వర్ణవిభేదములను మాన్పఁ బ్రయత్నించు చున్నారా? తలకుఁ దగని తలఁపులా? నోటికిఁ దగని మాటలా? చేతికిందగనిపనులా? చెప్పినమాటవినక నిల్లు విడనాడిపోయిన చంచలాక్షిమగఁడు ఆంధ్రపత్రికలో స్త్రీ వశ్యపుమందుఁ బ్రకటించునెడల మీరు వెకవెక లాడరా? అట్లే మిమ్ముఁ గాంచి పరులు వెకవెక లాడుదు రనుబుద్ధి మీకేల యుండక పోవలయును?

అదిగాక మీలో నెవ్వరైన సరే యొకని యగ్రయాయిత్వమున కంగీకరింతురా? ఏవ్యక్తికావ్యక్తియేగజ్జెకట్టి కలాపము వినిపింపవలయు ననుకుతూహలతతో నుండుటయే కాని యాతఁడు మననాయకుఁడు, ఆతని ననుసరించి మనము పోవుద మను శాంతిచిత్తత, సహనశీలత, మీలో నెవ్వని కున్నదో యొక్క నివ్రేలు మడఁచి చెప్పుఁడు? మీయేలుబడిలో ముందు దేశీయజనుల నుంచుకొనఁ దలఁచినవారు కదా? మీలో నొక్కఁడైన నొక్కనికి విధేయుఁడై ప్రవర్తింప లేకుండు నప్పుడు మీవలన మేము నేర్చుకొనవలసిన దేది? మీకు విధేయత లేనప్పుడు మావలన విధేయత మీ రెట్ల పేక్షింపఁగలరు? ఏలఁబడువాఁడే యేలికయ గుట కర్హుఁడు. విధేయతఁ జూపఁగలిగినవాఁడే యాజ్ఞనిచ్చుటకుం దగినవాఁడు. వినదఁదగినవాఁడే చెప్పఁదగినవాఁడు.

“ జంఘాలశాస్త్రి! నిన్నునే నెఱుఁగుదును. సాక్షి సంఘమున నీయుపన్యాసములు కొన్నిసార్లు నేను వింటిని ఇంత సేపటినుండి మాటలాడుచుంటిని గదా, నాయభిప్రాయము లతో నీవేకీభవింపక పోవచ్చును. కాని, నే నేమైన నున్మత్తుఁడు మాటలాడినట్లు మాటలాడి తినా” యని నన్నడిగెను. “నేను నందులకే యాశ్చర్యపడుచున్నాను. నీవిచ్చటికేల వచ్చితి" వని యాతని నడిగితిని. ఆతఁ డిట్లు చెప్పెను; “ఈ కొట్టులోఁ గొంతకాల ముండిన పిచ్చివాఁడు మామేనత్త కొడుకు వచ్చితిని. ఆతఁడు నన్నుఁ జూచి నాతోఁ గొన్ని యసందర్భపుమాటలాడి ' నీవిచ్చట! గొంత సేపు గూరుచుండుము. నేను జలస్పర్శమునకుఁ బోయివచ్చెద'నని పోయెను. ఒకగంట సేపు కూరుచుంటిని. ఆతఁడు రాలేదు. ఇంతలోఁ గారాగృహాధిపతి వచ్చి 'యింతరాత్రియైనను నీ వింక నిటనే కూరుచుంటి వేల' యని నా పైఁ దీండ్రించెను. 'అయ్యా! పిచ్చివాఁడు జలస్పర్శమునకుఁ బోయినాఁడు. నే నాతనిబావను. ఆతనికొఱకే చూచుచున్నా'నని కారాధీశునితోఁ జెప్పితిని. చేతిలోనున్న లాంతరు పైకెత్తి నామొగముఁ బరిశీలించి పిచ్చివాఁడు నా మేనత్త కొడు కగుటచేత నాతనిరూ పమునకు, నారూపమునకు భేద మెంతమాత్రమును లేకున్న కారణమున కొరడాతో నొక్క దెబ్బకొట్టి నన్నీ కొట్టులోనికిఁ ద్రోచి తలుపువైచినాఁడు. పదునెనిమిది మాసములనుండి యిచ్చటఁ బడియున్నాను. నే నెవ్వరితో నేమి చెప్పుకొన్నను లేశమైన వినియోగింపలేదు. వా కింతవఱకుఁ బిచ్చియెత్తలే దనుకొందును. ముం దేమగునో తెలియదు కాని