పుట:SaakshiPartIII.djvu/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మైన, యపకారమైన బంధము లేని యితర దేశీయులు స్వతంత్రులై, జ్ఞానసంపన్నులై, సౌఖ్యవంతులై సర్వజనసములై కాలక్షేపము చేయుచున్నారనియు, నిది మనచేతి కరదండ ములుగ, గాళ్ళకు సంకెలగ, గంటికి గంతలుగ, మనస్సునకు దిగపీకుడుగ నుండుటచే మన మొదుగు బొదుగులేక, శరీరమున నల్పులమై, జ్ఞానమున నంధులమై, కార్యమునఁ గాతరులమై, చిత్తమున బానిసలమై యున్నామనియు, నీపిశాచమునుండి యెంతత్వరగ విముక్తినొందుదుమో యంతత్వరలో మనకు సమస్తజనసోదరత్వమే కాక, సర్వజీవసోదరత్వ మును గ్రహింపఁ గల్గుదు మనియు, నట్టాచరించుటకుఁ దగిన వీర్యము, వెన్నెముక, విదగ్ధత కలవారమగుదుమనియు, మనదేశమునకు, మనజాతికీ యథార్థముగ మనుజజన్మమునకుఁ గూడ లాఘవకరమైన, లజ్ఞాకరమైన యీ “నన్ను ముట్టుకొనకుఁదనపు", బుద్ధిహీనపుపశు ప్రాయపు టేర్పాటెప్పుడు పరశురామప్రీతి యగునో యప్పడే మనకు జాత్యైక్యము సంభవిం చుననియు, జాత్యైక్యముతో శరీరపాటవము; శరీరపాటవముతో సౌఖ్యసంపదయు; సౌఖ్యసంపదతోఁ జిత్తవికాసము; చిత్తవికాసముతో బుద్ది స్థైర్యము; బుద్ది స్థైర్యముతో నాత్మస్వాతం త్ర్యము సిద్దించు ననియు మన ముపన్యాస పీఠములపై సింహగర్జనము లొనరించుచుండుట లేదా? ఇట్లు జాత్యైక్యసమారిజనసంరంభ మొకవంక జరుగుచునే యున్నది. వేరొకవంక, తూర్పు మంగళ్లకొక్క కాన్పరెన్సు, పడమటి మంగళ్ల కొక్క కాన్పరెన్సు, వ్యాసరాయమఠ స్థుల కొక్కటి, కాసలనాటి వారికొక్కటి, వేంగినాటివారి కొక్కటి, మెరవీథి తెలగాల కొకటి, పల్లపువీథి తెలగాల కొకటి, సపాదవైష్ణవుల కొక్కటి, నిష్పాదవైష్ణవుల కొక్కటి, పెదమాలపల్లి యాదిద్రావిడుల కొకటి, చినమాలపల్లి యాదిద్రావిడుల కొక్కటి జరుగుచునే యున్నవి. ఒక తెకవారి కట్టుపాటులు వేరొక్క తెగవారి కనిష్టములు పరిపూర్తిగ ననిష్టములు.

గీ.

తెల్లరసుద్దకు మరి విభూతికి బడదు
సుద్దముక్కల రెంటికిఁ జుక్కయెదురు
పగిలిన విభూతిపండులోఁ బ్రబలతమము
లైనతెగల రెంటికిని షష్ఠాష్టకంబు
బొగ్గుదారి బొగ్గుది సుద్దబూడిదలకు
దాని కెప్పడు నైధనతారవరుస
అరవలకు నాంధ్రులకు గ్రుద్దులాటధాటి
పైఁగ బ్రాహ్మణాబ్రాహ్మణభండనంబు.

సభావేదికలపై సామరస్యము, గృహాంతరముల గ్రుద్దులాట, పలుకులలో మిత్రత, పనిలో శత్రుత, బోధనములో భూతదయ, ఆచరణలోఁ గత్తికోఁత.

(ఆతఁడొక్క త్రుటికాల మాఁగి గొంతు సవరించుకొని నావంకఁ జూచెను. ఈతఁడు పిచ్చివాఁడువలె మాటలాడుట లేదే యని నేను మనస్సున ననుకొంటని. ఆంతలో నాతండు తిరుగ నారంభించినాఁడు.)

ఇంతటితో సరిపోయినదా: ఊహుఁ మరియొకచోట నె ట్లుపన్యసించుచున్నారు? 'బెడ్డవ్రేట్లను సహించి రేగుచెట్టు మనకుఁ దీయని ఫలము లిచ్చుచున్నవి. పట్టులేక గాలిలో సర్వశ్రమములం బొంది యల్లాడుచు మేఘములు మనకు సుధాసన్నిభము లైననీరము లిచ్చుచున్నవి. కత్తికోఁతను సహించుచు మేకలు మన కాహార మిచ్చుచున్నది. తమగడ్డి