పుట:SaakshiPartIII.djvu/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోయితిని. పూర్వమునఁ బురుష సౌందర్యమునుగూర్చి, సృష్టిపరిణామ క్రమమునుగూర్చి యుపన్యసించిన యున్మత్తునిఁ జూచుటకై యాతని కొట్టునొద్దకుఁ బోయితిని. ఆత డేమయ్యెనోకాని కానఁబడలేదు. కాని యాతనివంటివాఁడే యొక్కఁడా కొట్టులోఁగూరు చుండి యాస్తరణముగ నున్న తాటియాకు చాప యాకులను దీసి చీల్చుచున్నాడు. అయ్యా! యని యాతనిఁ బిలిచితిని. తన పైకెత్తి నాల్క రవంత కఱచికొని తిరుగఁ దల వంచుకొని యాకులను జీల్చుచుండెను. అయ్యా! యని మరియొకసారి పిలిచితిని. ఇంతలో నొకభటుఁ డేమూలనుండియో వచ్చి “ఎవ రక్కడ పిచ్చివానితో మాటలాడుచుంటివా? పో! ఆవలికిఁ బొమ్మని నన్ను గద్దించెను. ఆతనిచేతిలో నాలుగణా లుంచి, "రవంతసేపు వినోదమునం గాలక్షేపము చేయుదును క్షమింపు" మని యాతని వేడుకొంటిని. “సరే. అట్టేసే పుండుటకు వీలులే" దని చెప్పి యాతం డావలికిఁ బోయెను. "అయ్యా" యని పిచ్చివానిని బిల్చితిని. ఆతఁడు మాటలాడలేదు. సరికాదా, ఈసారి తలయెత్తనైన లేదు. “అయ్యా! తాటియాకు లట్టు చీల్చుచుంటి వెందుల" కని నే నంటిని.

పిచ్చివాని సంభాషణము

“సృష్టిలోనున్న యొక్కొక్కనియా కిట్టు చింపుచున్నాను. ఈ సృష్టినంత నాశమొన ర్చుటయే మంచిది. సృష్టి పనికిమాలిన సృష్టి, అర్ధము లేనిసృష్టి, నశించుటయే సమంజ సము. దీనిలో నొక యుద్దేశమున్నదా? నీతి యున్నదా? శాసనమున్నదా? ప్రేమయు న్నదా? ఒక క్రమమైన నున్నదా? మనఋషు లే మని చెప్పిరో వింటివా? సత్తులేదు, అసత్తులేదు. చావులేదు, శాశ్వతత్వము లేదు. పగలు లేదు, రాత్రిలేదు, ఒక్కటియే యున్నది. అది తనంత తానే యున్నది. దానికంటె వేరు లేదు. ఉన్న దనున దేదో దానినుండియే వచ్చినది. ఇట్లెందులకు వచ్చెనో దానికే తెలయును. అదికూడ నెఱుంగు నని చెప్పవలనుపడదు. ఇక్కడకు సృష్టికర్తస్థితి యెట్టున్నది? జ్ఞానమున్నది, లేదు. Will ఉన్నది, లేదు. ఉనికి యున్నది, లేదు. తననుండి సృష్టికలిగిన దనుసంగతి యని యెఱుఁగును, ఎఱుఁగదు. ఇట్టి తత్త్వమని మనఋషులు స్థిరపఱచినారు. ఇది తెలియుటా, తెలియకపోవుటా? తెలియుట కాదు, తెలియకపోవుట కాదు. తెలియకపోవుట, తెలియుట యనంగా నిదియే. సృష్టికర్తను గూర్చి యెఱుఁగకపోవుటయే జ్ఞానము. ఎఱుఁగుట యజ్ఞా నము. ఇవి మహావాక్యము లని మనవా రెల్ల రంగీకరించినారు. సృష్టిప్రారంభము నుండి యిప్పటివఱ కిట్టి మహోత్కృష్ట వాక్యములు పుట్టలేదు. ప్రథమ కారణమునుగూర్చి పాశ్చాత్యప్రకృత్యాది శాస్త్రములన్నియు దప్పులుచేసి దిద్దుకొని, తిరుగఁ దప్పులుచేసి మరల దిద్దుకొని, తుట్టతుద కీమహావాక్యములే సత్యము లని యంగీకరించు చున్నవి. అవి యంగీక రించుటచే మనకు ఘనత యున్న దని నేను జెప్పుటలేదు. కాని మనమహావాక్యముల ననుసరించియే మనవారిలో నూటికిఁ దొంబదుగురవఱకు నడచుచుండుటచే మనకు మహాఘనత వచ్చుచున్న దని చెప్పవలసి వచ్చినది.

మన కాప్రథమకారణమువలెనే జ్ఞానమున్నది, లేదు. ఉద్దేశమున్నది, లేదు. బుద్దియున్నది, లేదు. Will ఉన్నది, లేదు. పనిచేయుచున్నాము, చేయుచుండుట లేదు.

వర్ణవిభాగ మంత పనికిమాలిన యేర్పాటు లే దనియు, భారతీయుల బానిసతనమునకుఁ బ్రధానకారణ మదియే యనియు, నిట్టి యసందర్భమైన, యసహజ