పుట:SaakshiPartIII.djvu/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనము వినుట లెక్కయేమి? శంకరభగవానుడంతరిక్షమునఁ బ్రత్యక్షమైయానంద నమున నుప్పొంగుచుఁ గిన్నరబ్రహ్మముఖోర్గత మధుర గీతానుసార తాళానుగుణముగఁ దాండవించుట కుత్సహించి డమరుకమును వాయించుట కుద్యమించుచున్నాఁడే! గజచర్మ పుముడుతలలోఁ దలల నిమిడ్చి, కునుకుచున్న సర్పములు శిరముల నట్లె యదల్చి పడగలువిప్పి, జిహ్వలు ముందునకు ద్రోచి కన్నులు మాత్రమేకాక యొడలంతయు జెవులు చేసికొని వీరశైవుఁడగు బ్రహ్మయ్య గౌరీశ్వరగానమును విని పరవశము లగుచున్నవే! మహేశ్వర జటాజూటస్థ యగు చంద్రరేఖ మహా గాయకగీతామాధురికిఁ జొక్కి చొక్కి అమృతమను పేర నానంద బాష్పములను విడుచుచున్నదే. ఈమహాసన్నివేశమున కనాహూ తులై వీణాధరులైన తుంబురునారదులు విచ్చేసి మహాగానామృతము నందలమున్కలగుటచే నుక్కిరిబిక్కిరియగుచు గ్రుడ్డుస్తంభింప నిశ్చేతనులగుచు నిలువబడినారే! వీరశైవశిఖామణీ! భక్తియనఁగనీ దేయగునుగాక! గాన మనిన నీదే యగునుగాక! జన్మమనఁగ నీదేయగును గాక! మహా దేవుఁడు నీకు బిరుద మిచ్చినాడా! అందుచేతనే కిన్నరబ్రహ్మయ్య వైతివా?

ఆహా! భక్తికి గానమున కెంత చేరువ? భక్తి హృదయమున నంకురింపఁగనే గొంతుక లోని తంత్రులు తమంతతాము, మేళవించుకొని సిద్దముగ నుండునే భక్తి హృదయకోశ మును రవంత సంచలింపఁ జేయ నా యూపుతో రైరై మని భైరవియో, శంకరాభరణమో యాలాపింప నారంభించునే. భక్తి హృదయమునఁ దాండవింప నప్రాపంచికగాన మమృతరంగ ములతో నాకస మంతయు వెల్లివిరియనే! చెట్టు చిగుర్చునే! శిలలు కరగునే! నదులు పొంగునే! అగ్నిజ్వాల లంతరించునే! వాయువు చల్లబడునే భవరోగములన్నియుబటా పంచలైపోవునే! సృష్టియంతము ప్రేమదృష్టిచే నార్ద్ర మగునే?

గానశక్తి లేనివాఁడు గానమునకుఁ జెవి లేనివాఁడు కిరాతహృదయుఁడు, నరఘా తుకుఁడు, జీవద్రోహి యని యొకయాంగ్లేయకవి చెప్పినాఁడు. ఆమాటలు నా కంత నచ్చలేదు. ప్రపంచమున గానశక్తిలేనివాఁడెవఁడు? గానానుభవశక్తిలేని వాఁడెవఁడు? ఒక్కని గానఁ బరుపఁగలరా? కంటికి నచ్చిన కాంతను జూచి కూనురాగము తీయలేని మొద్దుముండ కొడుకెవఁడయిన నున్నాడా? ఈకూనురాగములో గానమున్నదా? లేదా? తుంబురునార దులు పాడినట్టు పాడినగాని గానము కాదా యేమి? ఆడుకోడి నాకర్షించుటకు మగకోడి యెంతచిత్రముగ గానమొనర్చునో వినలేదా? మగకుక్క యాడుకుక్కపై దాట బోవున ప్పడు కుయికుయికుయిమని గాన మొనర్చుచుండుట లేదా? కాలువయొడ్డునఁ బొద లోని కీచురాయి యెందులకుఁ బైస్థాయిలో గానమొనర్చుచున్నది? ఆడుపురుగు నాశ్లేషము నకే కాదా? ఐహికానందరసము ననుభవించుట కేజీవము పనికిరాదో దానికిమాత్రమే గానము లేదు. సుఖదుఃఖముల కధీనముకాని ప్రాణ మొకటియైనఁ బ్రపంచమున నున్నదేమో చెప్పఁగలరా? నిశ్చేతనములకుఁ గూడ సుఖదుఃఖానుభవమున్నదని యిప్పటి ప్రకృతిశాస్త్రజ్ఞులు సిద్ధాంతీకరించుచుండం, జేతనములమాట సందేహింప నేల? ప్రాపంచికానందమువలన గాన ముద్భవించును. పరమేశ్వరానందమువలన గాన ముద్భవించును. రక్తిచే గానముద్భవించును. భక్తిచే గాన ముద్భవించును. సాంసారికానందమువలనఁ గలిగినగానము నిష్ఫలము. గుడిగుడి త్రాగుటచే గలిగిన మబ్బు తెరవంటి కైపుచేఁ బుట్టిన మోతాదైన యానందమున పాదుషాయిాల వేయుట యెట్టిదో పణ్యవనిత తలదువ్వుకొనుచు విటుని వశపఱచుకొంటి