పుట:SaakshiPartIII.djvu/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కేవలశైవుఁడు. మిగుల వయస్సు గడచిన వాఁడు. బుద్దిశాలి. ఆతడు మాటలోనే వచ్చుచున్నాఁడు. లేచి నిలువంబడి యా మహాభక్తుని గౌరవింపుఁడు. (అంద ఱట్లొనర్తురు) అయ్యా శంకరభక్తాగ్రణీ! దయచేసి పీఠ మెక్కి యుపన్యసింపుఁడు.

శైవవర్యుని యుపన్యాసము.

శివభక్తులారా! సాక్షిసంఫెూపన్యాసములగూర్చి వినుచునే యున్నాను. ఇదివఱకు జంఘాలశాస్త్రి యనేకోపన్యాసము లిచ్చినాఁడు. జంఘాలశాస్త్రి మాధ్వుడు కాడు. శ్రీవైష్ణవుండు కాడు. అద్వైతియయ్యును హరభక్తినిగూర్చి యుపన్యసించి యుండలేదు. పత్తిక్కొల్లె నాచ్చియారువిశేష ముపన్యసించినాఁడు కాని బసవేశ్వర మహిమమును గూర్చి యుపన్యసించినాఁడా? ధనుర్దాసునికథ చెప్పినాఁడు కాని తేడర దాస్యయ్యకథ చెప్పినాఁడా? భక్తినిగూర్చి చెప్పిన యుపన్యాసములందైనను విష్ణుభక్తినిగూర్చియే చెప్పినాఁడు కాని వీరశైవభక్తినిగూర్చి చెప్పినాడా? శివుఁడు దేవుడు కాడనియా, శివభక్తులు భక్తులు కార నియా? ఆతని యుపేక్షకుఁ గారణమేమో తెలియ జాలకున్నాను. ఏకారణమైననేమి జరుగగూడని యుపేక్ష జరిగినది. క్షమింపఁదగని యుపేక్ష జరిగినది. శివభక్తులారా! ఈసంగతి మీతో మనవిచేసి మీకొక శివభక్తుని కథ నుపన్యసింప వచ్చితిని. సావధానచిత్తులరై వినఁగోరుచున్నాను.

అనంగ ననఁగ నొక వీరశైవుఁడు. ఆతనితల్లి యొవతెయో తెలియదు. తండ్రి యెవఁడో తెలియదు. ఇంటిపే రేదో తెలియదు. అతఁ డేగ్రామనివాసియో యదికూడఁ జెప్ప వీలు లేదు. బొండూరని కొందరు బోడూ రని కొంద ఱందురు. ఆతని పేరుమాత్రము బ్రహ్మయ్య, ఆతడు,

ద్వి.

వీరవ్రతై కనిష్ణారమణుండు-
సారశివాచారపారాయణుండు
లోకైకపూజ్యఁ డలో కానుసారి-
ఏకాంతభక్తి మహిష్టమండనుఁడు
నఘటితనాద విద్యాపండితుండు
నఘవినాశనకారణావతారుండు
విదితకారుణ్యసముదితానురాగ
హృదయుఁడు సర్వజీవదయాపరుండు

నని కవి యాతనిమహామహిమమును గానమొనర్చెను. ఆతఁ డనేకవిద్యల నభ్యసించినవాఁడగుటచే సహస్రవిధముల ధన మార్జించి యంతయును మహేశ్వరమూర్తులకర్పించి వారిని సేవించుచుఁ గాలక్షేపమొనర్చుచుండెను. ధనమంతయు నీరీతి వెచ్చ మొనర్చి క్షయించిన యాతండు శుద్ధినొందిన రసఘటికవలె దేజస్స్వరూపుఁడై వెలింగి పోవుచుఁ గిన్నరను జేతఁబుచ్చుకొని వీథివీథిని గాన మొనర్చుచుండెను.

“ఈశ్వరా! జగదీశ్వరా! పరమేశ్వరా కరుణాకరా' యని యీచ్చైస్స్వరమున మ్రోళ్లు చిగుర్చునట్లు గాలి స్తంభించి వినునట్టు కైలాసాధిపతిని గానమొనర్చునతఁ డాతఁడే మనస్సు నకున్న చెవిచే వినుచున్నారా?