Jump to content

పుట:SaakshiPartIII.djvu/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నను నానందమున "చిన్నదానరా" యని జావలి పాడుట యట్టిదే. పాదుషాయిాల యెంత ప్రయోజనమో పణ్యవనిత జావళి యంతప్రయోజనము ఐహికానందమును గాన మొనర్పలే నివా రెవ్వరు? ఇట్టిగానము జీవుని మరింత ప్రకృతిబద్ద మొనర్చుటకే పనికివచ్చును. సంసారసాగరమున జీవుని మరింత ముంచుటకే యక్కఱకువచ్చును. గానము లేనివారు క్రూరులు, ద్రోహు లని చెప్ప వలనుపడునా? గాన మొనర్పగలవారు లోకోపకారులై మిడుకుచున్నారా? సాలెపురుగు నాల్గువందలనంబరును మించిన మహాసూక్ష్మ తంతువులచే నిర్మింపఁబడిన తన పద్మవ్యూహపు మహలులోని చంద్రశాలలోఁ దాను గూరుచుండి మధురగీత మాలాపించు టెందులకు? చుట్టుపట్టులనున్న యీఁగల నాకర్షించి మింగుటకే కాదా? ఇది గొంతుకోత గానము కాదా? పాషాణ హృదయుల మధుర గానమున కాసపడి యెంద ఱమాయిక కాంతలు భ్రష్టలైపతితలై ప్రాణములఁ గోలుపోవలేదు? రోముపట్టనము నాల్గుమూల లంటుకొని మండిపోవునప్పడు చక్రవర్తియగు "నీరో" అయ్యయ్యో యని యైన ననెనా? అంతఃపురములోఁ గూరుచుండి ఫిడేలువాయించు కొనుచు హాయిహాయి యనలేదా? ఎందుల కీ గానశక్తి నాదనామక్రియకు సాధుప్రవర్తన కేమి సంబంధము? జంపె తాళమునకు స్వార్థపరిత్యాగమునకు సంబంధమున్నదా? ఐహికగానములవలన నరున కుద్గతి లేదు. సంసారతరణమునకు లోకకల్యాణమునకుఁ గావలసినది భక్తిగానము. రక్తిగానము గానమే. భక్తిగానము గానమే. ఒకటి వేశ్యాజటామండలిలోని గులాబిపూవు. ఒకటి ఈశ్వరజటామండలిలోని గులాబిపూవు. గానము లేనివాఁడు నరఘాతుకుఁడని చెప్పట సమంజసము కాదేమో? భక్తిలేనివాఁ డట్టివాఁడు. నిజముగా నట్టివాఁడు. భక్తులకథలు విని కరఁగనివాఁడువాఁడు. ప్రధానమైనది భక్తి గానము దానికుపలక్షణము. రక్తికిఁగూడ నదియే యుపలక్షణము. ఉపలక్షణమును బ్రధానముగఁ జేసి చెప్పటచే నాంగ్లేయకవిమాటలు నచ్చలే దని చెప్పవలసివచ్చినది. గరళకంఠభక్త శిఖామణిగాథలో గానమునుగూర్చిన తగవులాట చెప్పినందులకు మన్నింపవలెను. మనభక్తాగ్రేసరుఁడగు బ్రహ్మయ్య బసవేశ్వర స్వామిని దర్శింపఁ బాదచారియై పయనమై పోవుచున్నాఁడు. అడుగడుగునకు, హరహరా! అంధకహర! భక్తపాపనంహర! గంగాధర! శశాంకరేఖధర! యని స్మరించుకొనుచుఁ బాడుకొ నుచు నాడు కొనుచుఁ బోవుచుండెను. కాని మనబ్రహ్మయ్యను సంగమేశ్వరమునకు ముందే యెదుర్కొనవచ్చుచున్న యా యలౌకిక తేజోరాశి యొనరు? ఆహాహా! కన్నులు ధన్యము లగున ట్టవలోకించితిరా? మహారణ్యములో నొకమహాజ్వాల రెండవజ్వాలను దరియుచున్న ట్టున్నదే సముద్రమున నొకహిమసౌధము (Iceberg) రెండవ హిమసౌధమును సమీపించు చున్నట్లున్నదే! బ్రహ్మయ్యగారిరాక యాతఁ డెట్టు గ్రహించెనో, స్వచ్ఛాత్మకు స్వచ్ఛాత్మకు నిస్తంత్రీతంత్రవార్తలు జరుగుచుండును గాఁబోలు. ఒకచుక్క రెండవచుక్కకుఁ గన్నుగీటు, నొకయాత్మ రెండవయాత్మకు నన్న చేయకుండునా? కాని యావచ్చు.జ్యోతీరూప మెవరో? ఎవరో-చెప్పమందురా?

ద్వి

"శాశ్వతసర్వజ్ఞ-శశ్వద్గుణాంక-
విశ్వేశ శ్రీగురవే నమో యనుచు
సద్వఃప్రసన్నానవద్య వేదాంత-
వేద్యాత్మ శ్రీగురవే నమో యనుచు