రంగు. ఆహాహా! ఏమివింత! ఏమిచిత్రము! పచ్చనిబయళ్లు! ఫలములతో నిండినచెట్లు, పుష్పములు గుత్తులుగుత్తులుగా నున్న లతలు, భూమినుండి యుబికి యుబ్బెత్తుగ లేచుకొండలు, స్వాదుజలభరితములగు నదులు, నొడ్డులేని నముద్రము, నంతములేని యాకాశము, తేజోమయములగు గ్రహములు, కంటికి తేజము, చెవికి హాయి, యొడలికిఁ జలువ, ఘ్రాణమునకు సౌరభము, జిహ్వకు రుచి నిచ్చుచున్నవికదా? ఈతేజముకంటె, నీహాయికంటె, నీచలువకంటె, నీసౌరభముకంటె, నీరుచికంటె విలక్షణమైన యాశ్చర్యకరమైన, యనుభవైక వేద్యమైన యానందము ప్రకృతిదర్శనమున మనస్సునఁ గల్గుచున్నదికదా? ఆయానంద ప్రభావమున మనస్సిట్టె యిట్టె తేలికయై యట్టెయట్టె విస్తీర్ఘమై ప్రకృతియందు వ్యాప్తమై లీనమై పోవుచున్నదికదా? ఏవస్తువును గాంచిన సౌందర్యమృతము వర్షించుచున్నట్ల గడుచున్నదికదా? ఏవస్తువును గాంచిన సౌందర్యామృతము వర్షించు చున్నట్టగడుచున్నది కదా? ఆహా? ఆకసమున నీవైపునుండి యావైపునకు వ్యాపించిన యింద్రధనుస్సు వంపులతో, రంగులతో, వ్యాప్తితో, సౌందర్యముతోఁ కలసి ప్రకృతిసౌభాగ్యదేవతకు మంగళపుటారతు లిచ్చుచున్నవికదా? ఒక్కగులాబిపువ్వులోని సారళ్యము, సౌందర్యము, సౌరభము నాలోకింపఁబోయి, యస్వాదింపంబోయి, యనుభవింపఁబోయి, యాపుష్చసౌభాగ్యములోఁ గలసి, యాకేసర మార్దవమున నార్ద్రమై, యామకరందబిందుసందోహమున లీనమై మన సట్టె యట్టె తన్మయత్వమును జెందుచున్నదే. తుట్టతుద కొక్క గడ్డిపొరకలోఁ బరమేశ్వ రుని కరుణ, పరమేశ్వరునిలీల, పరమేశ్వరునిజ్ఞానము, పరమేశ్వరునియానందము, పరమేశ్వరునిమహిమము భావించి, యామూర్తిని సేవించి సేవించి, యాశక్తిని ధ్యానించి ధ్యానించి తరింప వచ్చునుగదా! ప్రకృతిసామంజస్యమునకు, ప్రకృతి సామీచీన్యమునకు, వలచి వలచి వశుడై వశుండై సౌందర్యగీతము లరచి యరచి, వ్యక్తిత్వమును మఱచి మఱచి, తన్మయుఁ డగు నాతండు కవి. తాను వలచిన ప్రకృతిఁ జూచినకొలఁది, చూచినకొలఁది సుందరన్వరూపయై కానఁబడునే. ఆఘ్రాణించినకొలఁది నధిక పరిమళభరితయై కానఁబడునే. కౌఁగిలించిన కొలఁది కౌఁగిలించిన కొలఁది కఠినతలో మెత్తన, మెత్తనలోఁ గఠినత. కఠినతలో గఠినత, మెత్తనలో మెత్తన, వేడిలోఁ జలువ, చలువలో వఁడి, చలువలో జలువ నిముసనిముసమున కధికతరముగఁ గానబఱచుచున్నదే. ముద్దుపెట్టిన కొలఁది ముద్దులోఁ దేనె, యాతేనెలో కలకండ, యారెంటిలో ద్రాక్షపండ్లరసము, నామూటిలోఁ బద్మసౌరభము, ఆనాల్గింటిలో శిరీషపేశలత క్షణక్షణప్రవర్ధమాన మగుచుఁ గానఁబఱచుచున్నదే ప్రాఁకులాడినకొలఁది ప్రాఁకులాడిన కొలఁది వన్నెలు, చిన్నెలు, హొరఁగులు, హొయలులు, తళుకులు, బెళుకులు, వగలు, వద్దికలు నేకొత్తరాభివృద్దిగాఁ గానఁబఱచుచున్నదే. మల్లెపూవులలో రెల్లుపూవులలో నట్టె యట్టె మందహాస మొనర్చుచున్నదే. చక్కని చుక్కలమాటునఁ జేరి కాముకుఁడైన కవికిఁ గన్నిట్టెయట్టెఁ గీటుచున్నదే. పర్వతములప్రక్కఁ జేరి తెల్లని జిలుఁగు పయ్యెదతోఁ బయోదరములాంధ్ర వనితవలె గూఢతయుఁ బ్రత్యక్షతయుఁ గాకుండ మాటుకొనుచు బయలు సేయుచున్నదే. అంభోధరములచెంత నిలిచి మొగము ముడుఁచుకొని ధుమధుమలాడుచుఁ గంటివెంట నిప్పలు గ్రక్కుచు బడబడాయమానశబ్దములతోఁ గఠోరముగ ఝాంకరించుచున్నదే. అట్లు ఝాంకరించి ఝాంకరించి స్త్రీనైజము ననుసరించి ధారాపాతముగఁ గన్నీరు విడుచుచున్నదే. గంగావాల్గాదిముక్తాహారాలంకృతగళసీమయై, నక్షత్రపుష్చవారవిరాజిత కేశబంధయై, భానుమండలసిందూరతిలక ప్రభాభాసమానఫాలసీ
పుట:SaakshiPartIII.djvu/27
Appearance